Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

SP MP Akhilesh Yadav Interesting Comments Over Central Govt
ఎన్డీయే సర్కార్‌ త్వరలో పడిపోతుంది: అఖిలేష్‌ యాదవ్‌

కోల్‌కత్తా: కేంద్రంలోని బీజేపీ సర్కార్‌ ఎక్కువ కాలం పాలన కొనసాగించలేదు.. త్వరలోనే పడిపోతుందని జోస్యం చెప్పారు సమాజ్‌వాదీ పార్టీ చీఫ్, ఎంపీ అఖిలేష్ యాదవ్. మతం పేరిట రాజకీయాలు ఎన్నో రోజులు నిలబడవు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.కాగా, అఖిలేష్‌ యాదవ్‌ ప్రస్తుతం బెంగాల్‌లో ఉన్నాఉ. ఈ సందర్బంగా అఖిలేష్‌ ఆదివారం బెంగాల్ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ నేతృత్వం జరిగిన ‘ధర్మతల ర్యాలీ’లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అఖిలేష్ యాదవ్ మాట్లాడుతూ..‘మతం పేరిట దేశాన్ని విభజించేందుకు కుట్రలు పన్నుతున్న శక్తులు తాత్కిలికంగా విజయం సాధించవచ్చు. కానీ, అంతిమంగా ఓడిపోతాయి. పశ్చిమ బెంగాల్ ప్రజలు బీజేపీని ఓడించారు. అధికారంలోకి వచ్చిన వారు చుట్టం చూపుగానే ఉంటారు.ఇదే సమయంలో బెంగాల్ ప్రజలు బీజేపీతో పోరాడారని, ఉత్తర్ ప్రదేశ్‌లో కూడా ఇదే జరిగిందని చెప్పారు. ఢిల్లీ ప్రభుత్వంలో కూర్చున్న వ్యక్తులు కొద్ది రోజులు మాత్రమే అధికారంలో ఉంటారని, వారిది నడిచే సర్కార్ కాదని, పడిపోయే సర్కార్’ అని ఆసక్తికర కామెంట్స్‌ చేశారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.ఇదిలా ఉండగా.. కేంద్రంపై అఖిలేష్ చేసిన వ్యాఖ్యలకు మమతా మద్దతు ఇచ్చారు. కేంద్రంలోని ప్రభుత్వం బెదిరింపుల ద్వారా ఏర్పడిందని, అది ఎక్కువ కాలం నిలవదని అన్నారు. ఉత్తర్ ప్రదేశ్‌లో లోక్‌సభ ఎన్నికల్లో ఎస్పీ కనబరిచిన ఫలితాలను సీఎం మమతా బెనర్జీ ప్రశంసించారు. యూపీ ప్రభుత్వం కేంద్ర ఏజెన్సీలను, ఇతర మార్గాలను దుర్వినియోగం చేస్తూ అధికారంలో కొనసాగుతోందని మండిపడ్డారు. ర్యాలీకి హాజరైన అఖిలేష్ యాదవ్‌కు మమతా బెనర్జీ కృతజ్ఞతలు తెలిపారు.

YS Jagan Will Meet AP Governor Abdul Nazeer
టీడీపీ అరాచకాలపై గవర్నర్‌కు వైఎస్‌ జగన్‌ ఫిర్యాదు

సాక్షి, విజయవాడ: వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.. గవర్నర్‌ అబ్ధుల్‌ నజీర్‌తో భేటీ అయ్యారు. ఈ రోజు సాయంత్రం 5 గంటల ప్రాంతంలో రాజ్‌భవన్‌కు వెళ్లిన వైఎస్‌ జగన్‌.. గవర్నర్‌తో సమావేశమయ్యారు. గత 45 రోజులుగా రాష్ట్రంలో జరుగుతున్న టీడీపీ అరాచకాలపై గవర్నర్‌కు జగన్‌ ఫిర్యాదు చేశారు.రాష్ట్రంలో టీడీపీ కూటమి అధికారం చేపట్టిన నాటి నుంచి కొనసాగుతున్న అరాచక పాలన, చేస్తున్న హత్యలు, దాడులు, విధ్వంసాలను వైఎస్‌ జగన్‌.. రాష్ట్ర గవర్నర్‌ దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం.సంబంధిత వార్త: యావత్‌ దేశం దృష్టికి 'ఆటవిక పాలన': వైఎస్‌ జగన్‌

Women's Asia Cup 2024: India Beat UAE By 78 Runs
రిచా ఘోష్‌ ఊచకోత.. టీమిండియా ఖాతాలో మరో విజయం

మహిళల ఆసియా కప్‌ 2024లో టీమిండియా వరుసగా రెండో విజయం సాధించింది. యూఏఈతో ఇవాళ (జులై 21) జరిగిన మ్యాచ్‌లో భారత్‌ 78 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన హర్మన్‌ సేన్‌.. నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేయగా.. యూఏఈ 20 ఓవర్లు పూర్తయ్యేసరికి 7 వికెట్ల నష్టానికి 123 పరుగులు మాత్రమే చేయగలిగింది.రిచా ఘోష్‌ ఊచకోత.. హర్మన్‌ మెరుపు హాఫ్‌ సెంచరీటాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్‌.. హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (47 బంతుల్లో 66; 7 ఫోర్లు, సిక్స్‌), రిచా ఘోష్‌ (29 బంతుల్లో 64 నాటౌట్‌; 12 ఫోర్లు, సిక్స్‌) మెరుపు హాఫ్‌ సెంచరీలతో విరుచుకుపడటంతో భారీ స్కోర్‌ చేసింది. ఆఖరి ఓవర్‌లో రిచా ఘోష్‌ ఆకాశమే హద్దుగా చెలరేగి చివరి ఐదు బంతులను బౌండరీలుగా మలిచింది. ఫలితంగా టీమిండియా టీ20ల్లో తొలిసారి 200 పరుగుల మార్కును దాటింది. భారత ఇన్నింగ్స్‌లో హర్మన్‌, రిచాతో పాటు షఫాలీ వర్మ (18 బంతుల్లో 37; 5 ఫోర్లు, సిక్స్‌) కూడా రెచ్చిపోగా.. స్మృతి మంధన (9 బంతుల్లో 13), దయాలన్‌ హేమలత (4 బంతుల్లో 2), జెమీమా రోడ్రిగెజ్‌ (13 బంతుల్లో 14 పరుగులు) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. యూఏఈ బౌలర్లలో కవిష ఎగోడగే 2, సమైరా ధర్నిధర్కా, హీనా హోచ్చందనీ తలో వికెట్‌ దక్కించుకున్నారు.మూకుమ్మడిగా దాడి చేసిన టీమిండియా బౌలర్లు202 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలో​కి దిగిన యూఏఈ.. భారత బౌలర్లు మూకుమ్మడిగా దాడి చేయడంతో 123 పరుగులకే పరిమితమైంది. దీప్తి శర్మ 2, రేణుక సింగ్‌, తనుజా కన్వర్‌, పూజా వస్త్రాకర్‌, రాధా యాదవ్‌ తలో వికెట్‌ పడగొట్టారు.తిరుగులేని భారత్‌ఈ టోర్నీలో గ్రూప్‌-ఏలో పాకిస్తాన్‌, నేపాల్‌, యూఏఈలతో పోటీపడుతున్న భారత్‌.. వరుసగా రెండు విజయాలతో గ్రూప్‌ టాపర్‌గా కొనసాగుతుంది. నేపాల్‌, పాక్‌ చెరో మ్యాచ్‌లో ఓడిపోయి రెండు, మూడు స్థానాల్లో ఉండగా.. ఆడిన రెండు మ్యాచ్‌ల్లో ఓడిన యూఏఈ ఆఖరి స్థానంలో నిలిచింది.గ్రూప్‌-బి విషయానికొస్తే.. ఈ గ్రూప్‌లో థాయ్‌లాండ్‌, శ్రీలంక, బంగ్లాదేశ్‌, మలేషియా పోటీపడుతున్నాయి. థాయ్‌లాండ్‌, శ్రీలంక ఇప్పటివరకు ఆడిన ఏకైక మ్యాచ్‌లో గెలిచి ఒకటి, రెండు స్థానాల్లో కొనసాగుతుండగా.. బంగ్లాదేశ్‌, మలేషియా మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నాయి.

Ex-Minister Ambati Rambabu Serious Comments On Muchumarri And TDP
ముచ్చుమర్రి కేసు.. లాకప్‌ డెత్‌ ఎందుకు జరిగింది?: అంబటి రాంబాబు

సాక్షి, గుంటూరు: కూటమి ప్రభుత్వ పాలనలో రాష్ట్రంలో లా అండ్‌ ఆర్డర్‌ ఉందా? అని ప్రశ్నించారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. ఇదే సమయంలో వినుకొండలో జరిగిన బాలిక హత్యపై టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తోందన్నారు. ముచ్చుమర్రి ఘటనపై హోం మంత్రి వంగలపూడి అనిత సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు.కాగా, మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆదివారం మీడియాతో మాట్లాడుతూ..‘పోలీసులు ఇప్పటి వరకు ముచ్చుమర్రి బాలిక కేసును చేధించలేదు. రాష్ట్రంలో శాంతి భద్రతలు లోపించాయి. ముచ్చుమర్రి ఘటనపై హోం మంత్రి అనిత సమాధానం చెప్పాలి. రాష్ట్రంలో శాంతిభద్రతలపై శ్వేతపత్రం విడుదల చంద్రబాబు ఎందుకు వాయిదా వేశారు. రషీద్‌ కుటంబాన్ని టీడీపీ నేతలు ఎందుకు పరామర్శించలేదు. స్థానిక టీడీపీ ఎమ్మెల్యే ఎందకు పరామర్శకు వెళ్లలేదు. పుంగనూరులో ఎంపీ మిథున్‌రెడ్డిపై పోలీసుల సమక్షంలోనే దాడి జరిగింది. టీడీపీ నేతలు మాజీ ఎంపీ రెడ్డెప్ప కారును దగ్ధం చేశారు. టీడీపీ నేతలే దాడి చేసి వైఎస్సార్‌సీపీ నేతలపై కేసులు పెట్టారు. ఈ క్రమంలోనే వైఎస్సార్‌సీసీ నేతలపై హోంమంత్రి అనిత చేసిన వ్యాఖ్యలపై సీరియస్‌ అయ్యారు. రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా గంజాయిని అడ్డుకోలేక మాపై నిందలు వేస్తున్నారు. శాంతిభద్రతలపై చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేయాలి. ముచ్చుమర్రి బాలిక మృతదేహాన్ని ఇప్పటి వరకు కనిపెట్టలేకపోయారో చెప్పాలి. ఈకేసులో నిందితుడిని, దళిత వ్యక్తిని లాకప్‌లో పోలీసులు దారుణంగా కొట్టడంతో​ అతను చనిపోయాడు. ఇది లాకప్‌ డెత్‌.. ప్రభుత్వ హత్య. ఈ దారుణంపై దళిత సంఘాలు ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి. రాష్ట్రంలో లా అండ్‌ ఆర్డర్‌ను కాపాడాలి. ఇక, ఎన్నికల్లో కూటమి ఇచ్చిన హామీ తల్లికి వందనం ఏమైంది. రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీ నేతలపై కేసులు పెట్టడమే టీడీపీ పనిగా పెట్టుకుంది. ముందుగా మీరు ఇచ్చిన హామీలను నెరవేర్చండి. టీడీపీ బెదిరింపులకు వైఎస్సార్‌సీపీ బెదరదు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Newly Married NRI Gavin Dasaur Shot Dead In USA
అమెరికాలో దారుణం.. భారత సంతతి నవ వరుడు హత్య

వాషింగ్టన్‌: ఇటీవల కాలంలో అమెరికాలో భారత సంతతి వ్యక్తులపై వరుసగా దాడులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో కొందరు భారతీయులపై కాల్పులు జరపడంతో వారు మరణించిన ఘటనలు కూడా చూశాం. తాజాగా అకారణంగా భారత సంతతి వ్యక్తిపై కాల్పులు జరపడంతో అతడు మృతిచెందాడు.వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాకు చెందిన వ్యక్తి గావిన్‌ దసౌర్‌(29) కొన్నేళ్ల క్రితమే అమెరికాలో స్థిరపడ్డాడు. ఈ క్రమంలో గావిన్‌.. మెక్సికోకు చెందిన వివియానా జమౌరాతో ఇటీవలే వివాహం జరిగింది. ఈ సందర్భంగా భార్యతో సరదాగా బయటకు వెళుతుండగా.. కారు ప్రమాదం జరిగింది. వెంటనే దసౌర్‌ తన వద్ద ఉన్న తుపాకీ తీసుకుని కారు నుంచి కిందకు దిగాడు. వెనక వాహనంలో ఉన్న డ్రైవర్‌తో వాగ్వాదానికి దిగాడు. ఆగ్రహానికి గురైన ఆ డ్రైవర్‌ తన దగ్గర ఉన్న తుపాకీతో దసౌర్‌పై కాల్పులు జరిపాడు. మెడకు బుల్లెట్‌ తగలడంతో దసౌర్‌ అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. There are lessons here. The guy totally wasted imo. He should gather more data before getting out of the car with the gun. pic.twitter.com/KiNQzj9Z08— Xnews_with_Grok (@Xnews_with_grok) July 19, 2024అనంతరం దసౌర్‌ను అతడి భార్య ఆసుపత్రికి తరలించింది. చికిత్స పొందుతూ అతడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఇక, నిందితుడిని కోర్టులో హాజరుపరచడంతో ఆత్మరక్షణ కోసమే కాల్పులు జరిపినట్టు నిందితుడు తెలిపాడు. ఇక, దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారడంతో ఈ ఘటన బయటకు వచ్చింది. ఇక, దసౌర్‌ మృతితో స్వగ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

YSRCP Demands Special Status To AP In All Party Meeting
ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే.. అఖిలపక్ష భేటీలో వైఎస్సార్‌సీపీ డిమాండ్‌

సాక్షి, ఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల బడ్జెట్ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో వైఎస్సార్‌సీపీ తరపున ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్‌రెడ్డి హాజరయ్యారు. ఏపీలో క్షీణించిన శాంతి భద్రతల పరిస్థితులను వైఎస్సార్‌సీపీ వివరించింది. ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలని కోరింది. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని అఖిలపక్ష సమావేశంలో వైఎస్సార్‌సీపీ డిమాండ్ చేయగా, టీడీపీ మాత్రం మౌనంగా ఉంది. బీహార్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని జేడీయూ డిమాండ్‌ చేసింది.ఢిల్లీ వేదికగా టీడీపీ దాడులను ఎండగడతాం: విజయసాయిరెడ్డిఅఖిల పక్ష భేటీ అనంతరం ఎంపీ విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ, ఏపీలో 45 రోజుల్లో 39 హత్యలు, 300 మందిపై హత్యాయత్నాలు జరిగాయని.. ఢిల్లీ వేదికగా టీడీపీ దాడులను ఎండగడతామన్నారు. ఢిల్లీలో బుధవారం వైఎస్‌ జగన్‌ నేతృత్వంలో ధర్నా నిర్వహిస్తామని తెలిపారు. బ్లాక్‌ మెయిల్‌ చేసే మీడియాను అడ్డుకునే చట్టం తీసుకురావాలని విజయసాయిరెడ్డి డిమాండ్‌ చేశారు.కాగా, పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు రేపటి(సోమవారం) నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో నిన్న (శనివారం) ఆయన తాడేపల్లిలోని క్యాంప్‌ ఆఫీసులో వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం నిర్వహించారు. సమావేశాల్లో అనునరించాల్సిన వ్యూహంపై పార్టీ ఎంపీలకు వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దిశా నిర్దేశం చేశారు.రాష్ట్రంలో హత్యలు, హత్యా­యత్నాలు, దాడులు, విధ్వంసాలు సృష్టిస్తూ చంద్రబాబు ప్రభుత్వం సాగిస్తున్న దారుణకాండను యావత్‌ దేశం దృష్టికి తీసుకెళ్లేందుకు ఢిల్లీలో ఈ నెల 24వ తేదీ బుధవారం నిర్వహించే ధర్నాకు అన్ని పార్టీలను ఆహ్వానిస్తున్నామని వైఎస్‌ జగన్‌ చెప్పారు.గత 45 రోజులుగా రాష్ట్రంలో ఏం జరుగుతోందో వివరించి.. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం చేస్తున్న పోరాటంలో కలిసి వచ్చే అన్ని పార్టీలనూ కలుపుకుపోదామని ఎంపీలకు సూచించారు. ధర్నా అనంతరం పార్లమెంట్‌కు హాజరై రాష్ట్రంలో సాగుతున్న ఆటవిక పాలనపై గళమెత్తాలని దిశా నిర్దేశం చేశారు. చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం కక్షతో చేస్తున్న దురాగతాలను తమ సభల్లోని సభ్యులందరి దృష్టికి తీసుకెళ్లాలని ఉద్భోధించారు.

JioSafe App Launched In India; Details
జియో కొత్త యాప్ - సంవత్సరం పాటు ఫ్రీ..

జియో సంస్థ యూజర్ల కోసం 'జియోసేఫ్' అనే యాప్ పరిచయం చేసింది. ఇది ఆండ్రాయిడ్, ఐఓఎస్‌లలో అందుబాటులో ఉంటుంది. ఈ యాప్ చాలా సురక్షితమైనదని, ఎక్కువ ప్రైవసీ ఉంటుందని జియో పేర్కొంది. ఇది ప్రస్తుతం రూ. 199 నెలవారీ సబ్‌స్క్రిప్షన్‌తో అందుబాటులో ఉంది. ఈ యాప్‌ను మొదటి సంవత్సరం ఫ్రీగా ఉపయోగించుకోవచ్చు.జియో పరిచయం చేసిన ఈ కొత్త అప్లికేషన్ సురక్షితమైన వీడియో కాలింగ్, ఆడియో, టెక్స్టింగ్ వంటి వాటికి సపోర్ట్ చేస్తుంది. అయితే ఈ యాప్ కేవలం 5జీ నెట్‌వర్క్‌లో మాత్రమే వినియోగించడానికి అవకాశం ఉంది. 4G నెట్‌వర్క్‌లలో లేదా Jio SIM లేని వినియోగదారులు యాప్‌ను ఉపయోగించలేరు, ఇది భారతదేశానికి పరిమితం.ఈ యాప్ మెటా వాట్సాప్‌కు ప్రత్యామ్నాయంగా ఉంటుంది. ఇది చాలా సురక్షితమైన యాప్, కాబట్టి దీనిని ఎవరూ హ్యాక్ చేయలేరని సంస్థ పేర్కొంది. కాబట్టి ఇది మెటా వాట్సాప్‌కు గట్టి పోటీ ఇస్తుందనే చాలామంది భావిస్తున్నారు. అయితే ఒక సంవత్సరం ఉచితంగా ఉపయోగించుకున్న తరువాత నెలవారీ చెల్లింపులు చేయాల్సి ఉంటుందని తెలుస్తోంది.జియోసేఫ్ సేఫ్టీ అనేది జియో 5జీ క్వాంటం సెక్యూర్ నెట్‌వర్క్‌పై ఆధారపడి ఉంటుంది. ఇది 256 బిట్ నెట్‌వర్క్ ఎన్‌క్రిప్షన్‌ను అందిస్తుంది. వినియోగదారును గోప్యంగా ఉంచడానికి సబ్‌స్క్రైబర్ కన్సీల్డ్ ఐడెంటిటీ (SCI) సాంకేతికతను ఉపయోగిస్తుంది.

Chandragiri MLA Pulivarthi Nani Drama Have Come To Light
చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని డ్రామా బట్టబయలు

సాక్షి, తిరుపతి: ఎన్నికల సమయంలో ప్రస్తుత చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని డ్రామాలను స్వీమ్స్‌ డాక్టర్లు బట్టబయలు చేశారు. రాష్ట్రంలోనే సంచలనం సృష్టించిన పద్మావతి మహిళా వర్శిటీ వద్ద పోలింగ్‌ అనంతరం మే 14వ తేదీన జరిగిన ఘటనలో పులివర్తి నానికి ఎలాంటి గాయాలు కాలేదని స్విమ్స్‌ వైద్య నివేదికలు తేల్చి చెప్పాయి.స్విమ్స్‌ ఆసుపత్రిలో నాని తల, శరీరం, చేయి, కాలికి తీసిన ఎక్స్‌రే, ఎంఆర్‌ఐ, సిటీ స్కానింగ్‌.. ఇలా ఆరు రకాల వైద్య పరీక్షలు నిర్వహించారు. అందులో ఒక్కదానిలోనూ ఆయన గాయపడినట్లు వెల్లడికాలేదు. వైద్య నివేదికలు అన్ని కూడా ఆయన సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా తేల్చాయి. రాజకీయ లబ్ధి కోసం పులివర్తి నాని నాటకాలు ఆడినట్లు తేటతెల్లమైంది.మే 14వ తేది మధ్యాహ్నం 3గంటల తర్వాత సంఘటన జరిగితే దాదాపు రెండు గంటలకు పైగా వర్శిటీ పరిసరాల్లోనే నాని హుషారుగా నడుస్తూ కనిపించిన పులివర్తి నాని వీడియో దృశ్యాలు ఆశ్చర్య పరుస్తున్నాయి. ర్యాలీ, ధర్నాలో పాల్గొన్న నాని.. చక్కగా నేలపై కూర్చుని ఆందోళనలు చేశారు. నాడు ఆ వీడియోలు విస్తృతంగా వైరల్‌ అయ్యాయి. నడుస్తూ వెళ్లిన పులివర్తి నాని.. తర్వాత వీల్ చైర్‌లో ప్రత్యక్షమై నటన ప్రదర్శించారు. ఒక్క గాయం లేదని వైద్య నివేదికలు స్పష్టం చేశాయి.తలకు, శరీరానికి, చేతికి, భుజానికి, పొట్టకు, కాలికి ఇలా అన్ని పరీక్షలను విడుదల చేశారు. ఎక్స్‌రేలు, ఎంఆర్‌ఐలు, సిటీ స్కానింగ్‌. వైద్య పరీక్షలు అన్నిటిలోనూ నానికి ఎలాంటి గాయాలు లేవని, ఆయన సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్య నివేదికలు వెల్లడించాయి. నాని స్వార్థంతో చేసిన నాటకం వల్ల అనేక మంది అమాయకులు జైలులోనూ, వారి కుటుంబసభ్యులు ఇంటి వద్ద రోదిస్తున్నారు. ఎలాంటి గాయాలు లేని వ్యక్తి పెట్టిన కేసులో 37 మంది జైలు పాలయ్యారు. నెలల తరబడి జైలులో ఉంచారు.

Actor Ravikanth: I Am Not Ambika's Second Husband
ఇక చాలు ఆపండి.. నేను ఆమె భర్తను కాదు: నటుడు

చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా కెరీర్‌ ప్రారంభించి హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగింది అంబిక. సీనియర్‌ హీరోయిన్‌ రాధ సోదరి అయిన ఈ మలయాళ నటి తన సొంత భాషతో పాటు తమిళ, కన్నడ, తెలుగు భాషల్లోనూ యాక్ట్‌ చేసింది. దొంగలు బాబోయ్‌ దొంగలు, మా నాన్నకు పెళ్లి, రాయుడు, నేటి గాంధీ, కొండవీటి సింహాసనం, మనసు పలికే మౌనరాగం.. ఇలా పలు చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. ప్రస్తుతం బుల్లితెరపైనే ఎక్కువ ఫోకస్‌ పెట్టిన ఈమె రెండు పెళ్లిళ్లు చేసుకుందని చాలాకాలంగా ప్రచారం జరుగుతోంది.రెండు పెళ్లిళ్లు?1988లో ఎన్నారై ప్రేమ్‌కుమార్‌ను పెళ్లాడగా వీరికి ఇద్దరు కుమారులు సంతానం. వ్యక్తిగత విభేదాల కారణంగా 1996లో విడాకులు తీసుకున్నారు. అనంతరం 2000వ సంవత్సరంలో నటుడు రవికాంత్‌ను పెళ్లాడగా 2002లో విడాకులు తీసుకున్నట్లు చాలాకాలంగా ప్రచారం జరుగుతోంది. వికీపీడియాలోనూ ఈ విషయం రాసి ఉండటంతో అందరూ అదే నిజమని భావిస్తున్నారు.భార్యాభర్తలుగా నటించినంత మాత్రాన..తాజాగా ఈ ప్రచారంపై నటుడు రవికాంత్‌ స్పందించాడు. 'నేను అంబిక భర్తనంటూ ప్రచారం చేస్తున్నారు. మేమిద్దరం పలు సినిమాల్లో భార్యాభర్తలుగా నటించినంత మాత్రాన నిజంగానే దంపతులమైపోతామా? మేమిద్దరం పక్క పక్క ఇంట్లోనే నివసిస్తాం. కాబట్టి షూటింగ్‌ ఉన్నప్పుడు రెండు కార్లు తీయకుండా ఒకే కారులో వెళ్తుంటాం. భార్యాభర్తలు కలిసొస్తున్నారంటూ అందరూ సరదాగా ఆటపట్టిస్తుంటారు.నేను ఆమె భర్తను కాదుఅంతేకానీ మేము పెళ్లి చేసుకోలేదు. అంబిక.. ప్రేమ్‌కుమార్‌ను పెళ్లి చేసుకుని అమెరికాలో ఉండేది. షూటింగ్స్‌ కోసం వచ్చి వెళ్తుండేది.. అంతే! నేను ఆమెను పెళ్లి చేసుకోలేదు. తన భర్తను కానే కాదు' అని క్లారిటీ ఇచ్చాడు. కాగా రవికాంత్‌ తమిళంలో సరోజ, బిర్యానీ, అభిమన్యు, మానాడు వంటి చిత్రాల్లో అలరించాడు. ప్రస్తుతం మలర్‌ అనే సీరియల్‌ చేస్తున్నాడు.చదవండి: మూడేళ్లుగా సింగిల్‌గానే.. నా కూతురు పెళ్లి చేసుకోనివ్వట్లేదు

Sakshi Editorial On AP TDP Chandrababu Govt and President rule
రాష్ట్రపతి పాలనే శరణ్యం!

‘‘మేం అధికారంలోకి వస్తున్నాం, రాగానే ‘అకౌంట్స్‌’ సెటిల్‌ చేస్తాం. ఒక ఆరు నెలలపాటు మాలో కొందరం ఇదే పని మీద ఉంటాం. అందరి అకౌంట్లూ సెటిల్‌ చేస్తాం’’. ఎన్నికలకు ముందు ఒక తెలుగుదేశం నాయకురాలు టీవీ ఛానల్‌ ఇంటర్వ్యూలో చెప్పిన మాటలివి. ఇప్పుడా నాయకురాలు హోం మంత్రిగా పని చేస్తున్నారు.తెలుగుదేశం పార్టీ యువనేత అనేక సభల్లో తన చేతుల్లోని ‘రెడ్‌ బుక్‌’ను ప్రజలకు చూపెట్టారు. ఈ ‘రెడ్‌ బుక్‌’లో ప్రత్యర్థుల పేర్లను రాసుకుంటున్నాననీ, అధికారంలోకి రాగానే వారి సంగతి తేల్చేస్తాననీ హెచ్చరికలు జారీ చేశారు. తమ మాట వినని అధికారులకు కూడా ఈ హెచ్చరికలు వర్తిస్తాయనే బెదిరించే ప్రయత్నం చేశారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే ఆంధ్రప్రదేశ్‌ అంతటా యువనేత, ‘రెడ్‌ బుక్‌’ బొమ్మలతో కూడిన హోర్డింగులు ప్రత్యక్షమయ్యాయి. ఆ యువనేత ఇప్పుడు క్యాబినెట్‌లో ఉన్నారు. కీలక నిర్ణయాలన్నీ ఆయనే తీసుకుంటున్నారని సమాచారం. ఈ రెండు ఉదాహరణలు మచ్చుకు మాత్రమే! తెలుగుదేశం ప్రభుత్వం కక్షపూరిత పాలనా విధానానికి దిగజారిందని చెప్పడానికి ఇటువంటి డజన్లకొద్దీ ఉదాహరణలు ఇవ్వవచ్చు. రాజ్యాంగ వ్యవస్థల్లోని అతి ప్రధాన విభాగమైన ఎగ్జిక్యూటివ్‌ వ్యవస్థ బాహాటంగానే రాజ్యాంగేతర పాలనా పద్ధతులను ఎంచుకుంటున్నది. పర్యవసానాలు జనజీవితాన్ని భయ కంపితం చేస్తున్నాయి.అధికార పార్టీ కక్షలకూ, కార్పణ్యాలకూ ఆరు వారాల స్వల్పకాలంలోనే 32 మంది వైసీపీ అభిమానులు హతమైనట్టు వార్తలందుతున్నాయి. వినుకొండలోని ఒక ప్రధానమైన సెంటర్‌లో వేలాది మంది ప్రజల సమక్షంలో వైసీపీ కార్యకర్త రషీద్‌ను నరికి చంపిన దృశ్యం రాష్ట్ర ప్రజలకు దిగ్భ్రాంతిని కలిగించింది. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులకు అద్దం పట్టింది. వైసీపీకి అనుకూలంగా ఉండే ఒక దళిత మహిళా రైతును తెలుగుదేశం కార్యకర్త అత్యంత పాశవికంగా ట్రాక్టర్‌తో తొక్కించి చంపిన దారుణం జరిగిన వారం రోజుల్లోనే రషీద్‌ దారుణ హత్య జరగడం రాష్ట్ర ప్రజలను కలవరపరుస్తున్నది.వైసీపీ కార్యకర్తలూ, అభిమానులపై ఈ ఆరు వారాల్లో 305 హత్యాయత్నాలు జరిగినట్టు వివరాలు అందుతున్నాయి. తిరువూరులో ఒక మునిసిపల్‌ కౌన్సిలర్‌నే రోడ్లపై పరుగెత్తిస్తూ కత్తులతో పొడిచిన వీడియో చిత్రం కూడా కలకలం సృష్టించింది. అధికార పార్టీ నాయకుల బెదిరింపులకు భయపడి 35 మంది ఆత్మహత్యలు చేసుకున్నట్టు వైసీపీ చెబుతున్నది. దాదాపు నాలుగు వేల కుటుంబాలు సొంత ఊరును వదిలి దూరంగా శరణార్థుల మాదిరిగా తలదాచుకుంటున్నాయి.వైసీపీ పార్లమెంట్‌ సభ్యుడు, లోక్‌సభలో ఆ పార్టీ నాయకుడైన మిథున్‌రెడ్డిపై దాడి చేశారు. ఆయన సొంత నియోజక వర్గంలో మాజీ ఎంపీ రెడ్డప్ప ఇంట్లో కూర్చుని మాట్లాడుతున్న సందర్భంలో పథకం ప్రకారం రౌడీ మూకల్ని తరలించి రాళ్ల దాడి చేశారు. ఎంపీ వాహనంతో సహా డజనుకు పైగా వాహనాలకు నిప్పుపెట్టారు. 560 కుటుంబాల ఆస్తులను అధికార పార్టీ మూకలు ధ్వంసం చేశాయి. పరిపాలనా వికేంద్రీకరణకు ఆయువుపట్టు వంటి గ్రామ సచివాలయాలు, ఆర్‌బీకే సెంటర్లపై వందల సంఖ్యలో దాడులు జరిగాయి. వైఎస్‌ జగన్‌ ఆనవాళ్లు కనిపించకూడదన్న కక్షతో వేలాది శిలాఫలకాలను పగుల గొట్టారు.జరిగిన సంఘటనలనూ, వాటి తీవ్రతనూ గమనంలోకి తీసుకుంటే ఈ ఆరు వారాల కాలాన్ని ‘బీభత్స పాలన’ (reign of terror) గా పరిగణించాలి. ఈ నేపథ్యంలోనే నిన్న రషీద్‌ కుటుంబ పరామర్శకు వెళ్లిన ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ మాట్లాడిన మాటలను అర్థం చేసుకోవాలి. రాష్ట్రంలో శాంతిభద్రతలకు తీవ్ర భంగం వాటిల్లిన నేపథ్యంలో రాష్ట్రపతి పాలన విధించాలని ఆయన డిమాండ్‌ చేశారు. బెంగాల్, తమిళనాడుల్లో ఎన్నికల తర్వాత బీజేపీ కార్యకర్తలపై జరిగిన స్వల్ప దాడులకే ఆ రాష్ట్రాలకు కేంద్ర బలగాలను పంపిన మోదీ సర్కార్‌ ఆంధ్రప్రదేశ్‌లోని తమ కూటమి ప్రభుత్వం బీభత్సపాలన చేస్తున్నా మిన్నకుండటం ద్వంద్వ ప్రమాణాలకు నిదర్శనం.ఒకపక్క తెలుగునాట మెజారిటీ మీడియా సంస్థలపై తెలుగుదేశం అనుకూలవర్గ గుత్తాధిపత్యం కొనసాగుతున్నది. మరోపక్క కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏలో తెలుగుదేశం పార్టీ భాగస్వామి. ఈ పరిస్థితుల్లో దేశంలో ఉన్న ప్రజాస్వామ్య మద్దతుదారులందరి దృష్టికీ జరుగుతున్న ఆగడాలను తీసుకురావడం కోసం ఈ బుధవారం ఢిల్లీలో ధర్నా చేయాలని వైసీపీ సంకల్పించింది. రాష్ట్రపతి పాలన అంశాన్ని గత కేంద్ర ప్రభుత్వాలు ఒక రాజకీయ ఆయుధంగా వాడుకున్నందు వల్ల దానిపై ప్రజాస్వామికవాదుల్లో భిన్నాభిప్రాయాలు నెలకొని ఉన్నాయి. ఈ కారణంగా ఆంధ్రప్రదేశ్‌లో నెలకొని ఉన్న యథార్థ పరిస్థితులను జాతీయ స్థాయికి తీసుకొని వెళ్లడం వైసీపీకి అవసరం.భారత రాజ్యాంగం ఆర్టికల్‌ 355 ప్రకారం ‘విదేశీ దాడుల నుంచీ, అంతర్గత కల్లోలం నుంచీ రాష్ట్రాలను కాపాడే బాధ్యత యూనియన్‌ ప్రభుత్వానిదే. ఆ రాష్ట్రాల్లో రాజ్యాంగబద్ధమైన పాలన కొనసాగేలా చూడటం కూడా కేంద్రం బాధ్యత’. ఈ ఆర్టికల్‌ను మరింత విశదీకరిస్తే ‘రాజ్యాంగ సూత్రాలకు అనుగుణంగానే రాష్ట్రాల ప్రభుత్వాలు పరిపాలించాలి. రాష్ట్రంలోని ప్రతి పౌరుడికీ భద్రత కల్పించడంతోపాటు, అతని ఆత్మగౌరవానికి భంగం కలగకుండా చూడటం కూడా రాష్ట్ర ప్రభుత్వం విధి’. రాష్ట్రాల్లో రాజ్యాంగబద్ధమైన పరిపాలన జరగడం కోసం అవసరాన్ని బట్టి రాష్ట్రపతి పాలన విధించే విశేషాధికారాన్ని ఆర్టికల్‌ 356 ద్వారా రాష్ట్రపతికి రాజ్యాంగం కట్టబెట్టింది.రాష్ట్రాల్లో రాజ్యాంగ సూత్రాలకు అనుగుణంగా పరిపాలించడం కుదరని పరిస్థితులు ఏర్పడినట్లయితే ఆర్టికల్‌ 356 (1) ప్రకారం రాష్ట్రపతి పాలన విధించవచ్చు. ఆంధప్రదేశ్‌లో ఇప్పుడు శాంతిభద్రతల పరిస్థితికి ఏర్పడిన విఘాతం సాధారణమైనది కాదు. జరుగుతున్నవి చెదురుమదురు సంఘటనలు అసలే కావు. సీనియర్‌ జర్నలిస్టు కృష్ణంరాజు లెక్కగట్టిన వివరాల ప్రకారం శుక్రవారం నాటికే రోజుకు సగటున 130 హింసాత్మక సంఘటనలు జరిగాయి. నెలరోజుల్లో 22 మంది మహిళలు అత్యాచారాలకు గురయ్యారు. ఇందులో నలుగురిని చంపేశారు. అభం శుభం తెలియని చిన్నారులను కూడా చిదిమేశారు. ఒక బాలిక చనిపోయిందని చెబుతున్న పోలీసు యంత్రాంగం ఆమె శవాన్ని కూడా రెండు వారాలు దాటినా గుర్తించలేక పోయింది.‘ఎస్‌ఆర్‌ బొమ్మై వర్సెస్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా’ కేసులో రాష్ట్రపతి పాలనపై సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పును చెప్పింది. రాజకీయ కారణాలతో ఎడాపెడా రాష్ట్రపతి పాలన విధించే సంప్రదాయాలకు చెక్‌ పెడుతూనే, ఏయే సందర్భాల్లో విధించడం సమర్థనీయమో కూడా రాజ్యాంగ విస్తృత ధర్మాసనం తీర్పు (1994) చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వ చర్యలు రాజ్యాంగ మౌలిక స్వరూపానికి విరుద్ధంగా ఉంటే రాష్ట్రపతి పాలన విధించవచ్చని అభిప్రాయపడింది. ఉదాహరణకు సెక్యులరిజం అనే అంశం రాజ్యాంగ మౌలిక స్వరూపంలో భాగం. రాష్ట్ర ప్రభుత్వ చర్యలు సెక్యులరిజాన్ని బలహీనపరిచేవిగా ఉంటే ఆ రాష్ట్ర పరిస్థితులు 356వ అధికరణంలో పేర్కొన్నట్టుగా ఉన్నాయనే భావించాలి.రాజ్యాంగ పీఠికను రాజ్యాంగ మౌలిక స్వరూపానికి గుర్తుగా భావిస్తారు. ప్రజాస్వామ్యం, సెక్యులరిజంతోపాటు ప్రజలందరికీ సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం – ఆలోచనా, భావప్రకటన, విశ్వాసం, ఆరాధనా స్వేచ్ఛ – అవకాశాల్లో, హోదాల్లో సమానత్వం – వ్యక్తిగత గౌరవం వంటి అంశాలకు కూడా పీఠిక ప్రాధాన్యమిచ్చింది. ఇందులో దేనికి భంగం కలిగినా రాజ్యాంగ మౌలిక స్వరూపంపై జరిగిన దాడిగానే పరిగణించాలి. భిన్నమైన రాజకీయ అభిప్రాయాలు కలిగి ఉండటాన్ని ప్రస్తుత ఏపీ ప్రభుత్వం నేరంగా పరిగణిస్తున్నది. ప్రతిపక్ష కార్యకర్తలను మోకాళ్లపై కూర్చోబెట్టి చేతులు జోడింపజేసి అధికారపక్షీయులు తమ నాయకునికి జైకొట్టించుకుంటున్నారు. ఇటువంటి వీడియోలు అసంఖ్యాకంగా యూట్యూబ్‌లో కనిపిస్తున్నాయి. ఈ చర్యలు అనైతికమే కాదు రాజ్యాంగ విరుద్ధం కూడా!రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్దేశపూర్వకంగా రాజ్యాంగ విరుద్ధ చర్యలకు పాల్పడడం, హింసను రెచ్చగొట్టడం కూడా రాష్ట్రపతి పాలన విధించడానికి అనువైన చర్యలుగా బొమ్మై కేసులోనే సుప్రీంకోర్టు తేల్చింది. ఉద్దేశపూర్వకంగానే తమ ప్రత్యర్థులపై దాడులు చేస్తామని, ‘అకౌంట్లు’ సెటిల్‌ చేస్తామని ఎన్నికల ముందునుంచే తెలుగుదేశం నాయకులు బహిరంగంగా చెబుతున్నారు. ప్రత్యర్థులపై కక్ష సాధించడమే ధ్యేయంగా ‘ఉద్దేశపూర్వకంగా’ రెడ్‌బుక్‌ హోర్డింగులను రాష్ట్రవ్యాపితంగా నెలకొల్పి, తమ పార్టీ కార్యకర్తల హింసాప్రవృత్తిని రెచ్చగొడుతున్నారు.రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా తన రాజ్యాంగ విధులను, బాధ్యతలను విస్మరించడం కూడా రాష్ట్రపతి పాలనకు దారితీయాల్సిన పరిస్థితిగానే సర్వోన్నత న్యాయస్థానం పరిగణించింది. ఈ నలభై రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఐదువేల పైచిలుకు హింసాయుత ఘటనల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తన రాజ్యాంగ బాధ్యతలను విస్మరించింది. ఏ సందర్భంలోనూ పోలీసు యంత్రాంగం స్పందించకపోవడానికి వెనుకనున్న కారణం – రాష్ట్ర ప్రభుత్వ మౌఖిక ఆదేశాలే! ఎంపీ మిథున్‌రెడ్డిని తన నియోజకవర్గంలో పర్యటించకుండా రౌడీ మూకలు అడ్డుకున్న సందర్భంలో గానీ, వినుకొండ నడిబజారులో రషీద్‌ను తెగనరుకుతున్న సందర్భంలో గానీ పోలీసులు ప్రేక్షకపాత్రనే పోషించారు.ఈ హింసాకాండ – నరమేధం ఆరు మాసాలపాటు కొనసాగిస్తామని ఆ పార్టీ నాయకులు చెప్పుకొస్తున్నారు. ఇక ఉపేక్షించడం క్షంతవ్యం కాదు. తన కూటమి భాగస్వామ్య పక్షం పట్ల మోదీ ప్రభుత్వం ఒలకబోస్తున్న ధృతరాష్ట్ర ప్రేమకు వారు కూడా మూల్యం చెల్లించవలసి ఉంటుంది. ఈ ఆటవిక పాలనను ఇంకా కొనసాగించడం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక అవసరంగా మారింది. తమ పార్టీ ఇచ్చిన అలవికాని హామీలను అమలు చేయడం సాధ్యం కాదు. ప్రశ్నించడానికి ప్రతిపక్షాలు, ప్రజలు భయపడాలి. అందుకోసం ఈ బీభత్స పాలన కొనసాగాలి. రేపటి బడ్జెట్‌లో తమ ’సూపర్‌ సిక్స్‌’ హామీల అమలుకు అదనంగా లక్ష కోట్ల పైచిలుకు కావాలి. అందువల్ల పూర్తి బడ్జెట్‌ను మరోసారి వాయిదా వేసి, మళ్లీ ‘ఓట్‌ ఆన్‌ అకౌంట్‌’ పెట్టే అవకాశాలను రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. అదే జరిగితే ఇది కూడా అసాధారణ చర్యే!వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com

Advertisement
Advertisement
Advertisement
International View all
title
రష్యా సరిహద్దులో హైటెన్షన్‌.. యూఎస్‌ బాంబర్‌ విమానాలు ప్రత్యక్షం!

మాస్కో: అగ్ర రాజ్యం అమెరికాలో అధ్యక్ష ఎన్నికల వేళ రష్యా, అమె

title
అమెరికాలో దారుణం.. భారత సంతతి నవ వరుడు హత్య

వాషింగ్టన్‌: ఇటీవల కాలంలో అమెరికాలో భారత సంతతి వ్యక్తులపై వర

title
బంగ్లాదేశ్‌లో ఆందోళనలు: సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు

ఢాకా: బంగ్లాదేశ్‌లో రిజర్వేషన్ల ఆందోళనలు హింసాత్మకంగా మారాయి

title
‘అతిగా తిని’ ప్రాణం పోగొట్టుకున్న సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్

ఓ సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ తినే ఛాలెంజ్‌ను స్వీకరించి ప్రాణాలు కోల్పోయింది.  

title
భారత్‌లోనే కోవిడ్‌-19 మరణాలు ఎక్కువ.. ఖండించిన కేం‍ద్రం

న్యూఢిల్లీ: కోవిడ్‌-19 సమయంలో భారత్‌లో అధి

National View all
title
ఎన్నికల ఎఫెక్ట్‌: ఒడిశా పీసీసీ రద్దు

భువనేశ్వర్‌: లోక్‌ సభ, అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ

title
ఎన్డీయే సర్కార్‌ త్వరలో పడిపోతుంది: అఖిలేష్‌ యాదవ్‌

కోల్‌కత్తా: కేంద్రంలోని బీజేపీ సర్కార్‌ ఎక్కువ కాలం పాలన కొన

title
బంగ్లా దేశీయులకు ఆశ్రయం ఇస్తాం: సీఎం మమత

కోల్‌కతా: బంగ్లాదేశ్ నుంచి వచ్చే శరణార్థులుకు తమ రాష్ట్రం ఆశ

title
కన్వర్‌ యాత్ర నేమ్‌ప్లేట్‌ వ్యవహారం.. కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు

లక్నో: కన్వర్‌ యాత్ర మార్గంలో ఉన్న దుకాణాల యజమానులు తమ పేర్ల

title
రాహుల్‌ ‘ప్రధాని’లా ఫీలయ్యారు.. కిషన్‌ రెడ్డి సెటైర్లు

సాక్షి, హైదరాబాద్‌: ఎన్నికల్లో ఓడిపోయినా సంబురాలు చేసుకున్న

NRI View all
title
అమెరికాలో దారుణం.. భారత సంతతి నవ వరుడు హత్య

వాషింగ్టన్‌: ఇటీవల కాలంలో అమెరికాలో భారత సంతతి వ్యక్తులపై వర

title
అమెరికాలో తెనాలి యువకుడి దుర్మరణం

ఆస్టిన్‌: ప్రమాదవశాత్తూ మరో భారతీయుడు అమెరికాలో ప్రాణాలు పొగొట్టుకున్నాడు.

title
కువైట్‌లో విషాదం.. మలయాళ కుటుంబం సజీవ దహనం

గల్ఫ్‌​ దేశం కువైట్‌లో మరో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది.

title
డాక్టర్ వైఎస్సార్ ఫౌండేషన్ అమెరికా ఆధ్వర్యంలో వైఎస్సార్ జయంతి వేడుకలు

న్యూ జెర్సీ: డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి ఫౌండేషన్ అమెరికా

title
ఆస్ట్రేలియాలో తెలుగు విద్యార్థులు దుర్మరణం, స్నేహితుడిని కాపాడబోయి

ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌లాండ్‌లో విషాదం చోటు చేసుకుంది.

Advertisement
Advertisement

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement

ఫోటో స్టోరీస్

View all