చందేరీ సిల్క్‌ డిజైన్స్.. లైట్‌ అండ్‌ బ్రైట్‌

Bhargavi Kunam Chanderi Silk Latest Design Sarees With Bright Combination - Sakshi

చూస్తే చూపు తిప్పుకోనివ్వనంత బ్రైట్‌నెస్‌
కట్టుకుంటే లైట్‌ వెయిట్‌నెస్‌ 
అదే, చందేరీ చమక్కు.
చందేరీకి అంచుగా బెనారస్‌ సిల్క్‌ జత చేరినా..
గద్వాల పట్టు కలిసి నడిచినా 
ముచ్చటైన డిజైన్‌గా మెరిసిపోతోంది.

సంప్రదాయ డ్రెస్‌ డిజైన్స్‌కి కేరాఫ్‌ అడ్రస్‌గా నిలుస్తారు భార్గవి కూనమ్‌. హైదరాబాదీ డిజైనర్‌ భార్గవి వివిధ రకాల చేనేతలతో అందమైన దుస్తులను రూపొందిస్తారు. వివాహ వేడుకలకు ప్రత్యేక ఆకర్షణ తెచ్చే డిజైన్స్‌కు పేరెన్నిక గన్న డిజైనర్‌ చందేరీ సిల్క్‌తో చేసిన డిజైన్స్‌ ఇవి. లైట్‌.. బ్రైట్‌ కాంబినేషన్‌లో రూపొందించిన ఈ డిజైన్స్‌ గురించి మరింత వివరంగా... 

టచందేరీ సిల్క్‌ డ్రెస్సులు, శారీస్‌ ఇప్పుడు ఏ విధంగా ట్రెండ్‌లో ఉన్నాయి? 
మన దేశీయ చేనేతలు ఎప్పుడూ ట్రెండ్‌లో ఉంటాయి. వాటిలో చందేరీకి ఓ ప్రత్యేక ఆకర్షణ ఉంటుంది. కోరా సిల్క్‌ మిక్సింగ్‌తో చందేరీ సిల్క్‌ను నేస్తారు. కలర్స్‌ బ్రైట్‌గా, స్పేషల్‌గా ఉంటాయి. చిన్న బుటీ, అంచులు కూడా ఆకర్షణీయంగా ఉంటాయి. చేనేతకారులను కలిసి, మాదైన ప్రత్యేక డిజైన్స్‌ చెప్పి ఈ చీరలను నేయిస్తాం. దీని వల్ల ఏ చీర అయినా, ఫ్యాబ్రిక్‌ అయినా మరో రెప్లికా అంటూ ఉండదు. 

మీరు చేసిన కాంబినేషన్స్‌? 
చందేరీ లెహంగాలను రూపొందిస్తే ఏవైనా రెండు, మూడు కాంబినేషన్‌ ఫ్యాబ్రిక్‌ను ఎంచుకుంటాను. బెనారస్, గద్వాల, కంచిపట్టు అంచులు ఉంటాయి. వీటి వల్ల లెహంగా లుక్‌ గ్రాండ్‌గా మారిపోతుంది. వీటికి సింపుల్‌ హ్యాండ్‌ ఎంబ్రాయిడరీ చేసినవి, ప్లెయిన్‌ బ్లౌజ్‌లు, గ్రాండ్‌గా అనిపించే పట్టు దుపట్టాలను కాంబినేషన్‌గా ఉపయోగిస్తాం. 

చందేరీ సిల్క్‌ దుస్తులు ఏ సీజన్‌కి బాగుంటాయి? 
ఏ సీజన్‌కైనా బ్రైట్‌నెస్‌ తెస్తాయి ఇవి. లైట్‌ వెయిట్‌ ఫ్యాబ్రిక్‌ కావడంతో రాబోయే వివాహ వేడకలకు, వేసవి కాలానికి సౌకర్యంగా, మరింత బాగుంటాయి.

|

ఎవరెవరికి.. ఏ వయసు వారికి చందేరీ ఫ్యాబ్రిక్‌ దుస్తులు, చీరలు బాగుంటాయి?
అన్ని వయసుల వారికి చందేరీ నప్పుతుంది. అయితే, బ్లౌజ్‌ ఎంపికలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. టీనేజ్, యంగేజ్‌ వారికి చందేరీ ఫ్యాబ్రిక్‌తో ఆకర్షణీయమైన దుస్తులను రూపొందింవచ్చు. 

వీటిని ఏ కాంబినేషన్‌లో ధరిస్తే ఆకర్షణీయంగా కనిపిస్తారు? 
లెహంగా లేదా శారీ బ్రైట్‌ కలర్‌ ఎంచుకుంటే బ్లౌజ్‌ ప్లెయిన్‌గా ఉండాలి. కొంచెం ఇండోవెస్ట్రన్‌ టచ్‌ కూడా దీనికి ఇవ్వచ్చు. స్లీవ్‌లెస్‌ బ్లౌజ్‌లతో ఆ ప్రయోగం చేయవచ్చు. అయితే, సందర్భం, వేడుకను బట్టి ఇక్కడ ఇచ్చిన డిజైన్స్‌ను ఎంచుకోవచ్చు.  

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top