
వేసవిలో పిల్లలతో కలిసి టూర్లకు విరివిగా వెళుతుంటారు. వేసవిని ఆహ్లాదకరంగా గడపడానికి చాలామంది సముద్రతీరాలను ఎంచుకోవడం మామూలే! ఈ వేసవిలో బీచ్‌ల అనుభూతిని పొందాలంటే అలాంటి వాతావరణాన్ని ఇంట్లోనే సృష్టించుకోవచ్చు. ఆహ్లాదాన్నే కాదు వినూత్నమైన ఈ అలంకరణతో అతిథుల మనసునూ ఆకట్టుకోవచ్చు.
సముద్ర జీవరాశిని పోలిన కుషన్స్
నత్తలు, గవ్వలు, తాబేలు, చేపలు తదితర జలచరాలను పోలి ఉండే కుషన్ మోడల్స్‌ను సొంతంగా తయారు చేసుకోవచ్చు. లేదంటే కొనుగోలు చేయవచ్చు. ఈ కుషన్స్ డిజైన్స్ బట్టి వందల రూపాయల నుంచి ఆన్‌లైన్/ఆఫ్‌లైన్‌లో లభిస్తున్నాయి.
బీచ్ స్టైల్ ఫర్నిషింగ్
బీచ్ వాతావరణం ఉండే కర్టెన్స్, సోఫా కవర్స్, బెడ్‌షీట్స్ వంటివి అలంకరణకు ఉపయోగించవచ్చు. వీటిలో పేస్టల్ కలర్స్ ఎంపిక వేసవికి సరైన ఎంపిక అవుతుంది. కర్టెన్ హుక్స్, హ్యాంగర్స్ స్టార్ ఫిష్, షెల్స్‌ను పోలిన డిజైన్స్‌ని ఎంపిక చేసుకోవచ్చు.
గవ్వల డిన్నర్ సెట్స్
గవ్వలతో డిజైన్ చేసిన టేబుల్ మ్యాట్స్, తెల్లని పింగాణీ ప్లేట్ల అమరిక, ల్యాంప్ హోల్డర్లు, స్పూన్, టిష్యూ హోల్డర్లు మొదలైన వాటిని ఉపయోగించవచ్చు. సెంటర్ టేబుల్స్, అక్వేరియమ్, శంఖాలు, గవ్వలతో డిజైన్ చేసిన ఫౌంటైన్లు అదనపు అకర్షణను ఇస్తాయి. బీచ్‌లకు వెళ్లినప్పుడు అక్కడి వస్తువులను చాలా మంది సేకరిస్తుంటారు. అలాంటి వాటిని ఈ సమ్మర్‌లో ఇంటి అలంకరణలో వాడచ్చు.
(చదవండి: అక్కడ తింటే.. పర్సు ఖాళీ!)