ఏం చిక్కొచ్చి పడింది! అటు చూస్తే.. జవాన్‌!.. ఇటు చూస్తే.. ఆఫీస్‌..! | Bengaluru WFH Employee To Open Laptop During Theatre | Sakshi
Sakshi News home page

ఏం చిక్కొచ్చి పడింది! అటు చూస్తే.. జవాన్‌!.. ఇటు చూస్తే.. ఆఫీస్‌..!

Published Sun, Sep 10 2023 11:54 AM | Last Updated on Sun, Sep 10 2023 12:26 PM

Bengaluru WFH Employee To Open Laptop During Theatre - Sakshi

అటు చూస్తే జవాన్‌ ఇటు చూస్తే ఆఫీస్‌...అటు చూస్తే బాదం హల్వా ఇటు చూస్తే సేమ్యా ఇడ్లీ... అని శ్రీశ్రీ అన్నట్టుగా ఆ  బెంగుళూరు ఐ.టి ఉద్యోగికి కూడా సంకటం వచ్చింది. ఒకవైపు జవాన్‌ రిలీజ్‌. మరోవైపు సాఫ్ట్‌వేర్‌ డ్యూటీ. చివరకు అతను రెండూ చేశాడు. వైరల్‌ అయ్యాడు. బెంగళూరులోనే ఇటువంటివి జరుగుతుంటాయి. మొన్నా మధ్య ఒక సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి ర్యాపిడో బైక్‌ వెనుక కూచుని ఆఫీస్‌కు వెళుతూ ట్రాఫిక్‌లో చిక్కుకుపోతే బైక్‌ మీదే ల్యాప్‌టాప్‌ తెరిచి లాగిన్‌ అయ్యి డ్యూటీ మొదలెట్టేశాడు.

భారీ ట్రాఫిక్‌ వల్ల క్యాబుల్లో ఎక్కగానే ల్యాప్‌టాప్‌లు తెరిచే వాళ్లూ అక్కడ ఎక్కువే. ఇప్పుడు ఒక ఉద్యోగి ఏకంగా సినిమా హాల్లోనే ల్యాప్‌టాప్‌ తెరిచాడు. ఏం చేస్తాడు మరి? షారూక్‌ ఖాన్‌ ఫ్యాన్‌. ఫస్ట్‌ డే ఫస్ట్‌ షో. సరిగ్గా ఆ టైమ్‌కే లాగిన్‌ అవ్వాలి. అందుకని థియేటర్‌లో ల్యాప్‌టాప్‌లో వేళ్లు టిక్కుటక్కుమంటుంటే కళ్లు సినిమాకు అంకితం అయ్యాయి. వెనుక కూచున్న ఒక వ్యక్తి ఇది ఫొటో తీసి ఇన్‌స్టాలో పెడితే లక్షల కొద్దీ వ్యూస్‌ వచ్చాయి. ‘బెంగళూరులో ఇక పని చేయకుండా వదిలేసిన చోటు ఏదీ లేదు’ అని కామెంట్లు చేస్తూ ఏడవలేక నవ్వుతున్నారు. 

(చదవండి: కాలం కలిసి వస్తే  డంప్‌యార్డ్‌ కూడా నందనవనం అవుతుంది!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement