రూ. 11వేల కోట్ల టుబాకో సామ్రాజ్యం : ముదిరిన తల్లీ కొడుకుల పోరు | In Battle For 11000 Crore Tobacco Empire Son Accuses Mother Of Assault | Sakshi
Sakshi News home page

రూ. 11 వేల కోట్ల టుబాకో సామ్రాజ్యం : ముదిరిన తల్లీ కొడుకుల పోరు

Jun 1 2024 3:37 PM | Updated on Jun 1 2024 3:44 PM

 In Battle For 11000 Crore Tobacco Empire Son Accuses Mother Of Assault

పాపులర్‌ సిగరెట్‌ కంపెనీ గాడ్‌ఫ్రే ఫిలిప్స్ మధ్య రగిలిన ఫ్యామిలీ వార్‌ మరింత ముదురుతోంది. గాడ్‌ఫ్రే ఫిలిప్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సమీర్ మోడీ తల్లి తనపై దాడికి పాల్పడిందని ఆరోపించారు. ఢిల్లీలోని జసోలా ఆఫీస్‌లో జరగాల్సిన బోర్డు మీటింగ్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నించినందుకు గాడ్‌ఫ్రే ఫిలిప్స్‌కు చెందిన పలువురు డైరెక్టర్లు, తన తల్లి బీనా మోడీ వ్యక్తిగత భద్రతా అధికారి (పిఎస్‌ఓ)  పలువురు డైరెక్టర్లు తనను తీవ్రంగా గాయపరిచారని ఆరోపిస్తూ సమీర్ శుక్రవారం ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రూ. 11,000 కోట్ల వారసత్వంపై కొనసాగుతున్న ఫ్యామిలీ వార్‌ మరింత తీవ్రమైంది.

బోర్డ్‌ మీటింగ్‌కి  హాజరయ్యే ప్రయత్నంలో,  తల్లి బీనా పీఎస్‌ఓవో నెట్టివేయడంతో  తన చూపుడి వేలుకి తీవ్ర గాయమైందనీ, అదిక  పూర్తిగా పనిచేయదని వైద్యులు తెలిపారంటూ సరితా విహార్ పోలీస్ స్టేషన్‌లో దాఖలు చేసిన ఫిర్యాదులో మోడీ పేర్కొన్నారు.

‘‘నా సొంత కార్యాలయంలోనే దాడి జరుగుతుందని నేను ఎప్పుడూ ఊహించలేదు. "షేర్ల సెటిల్‌మెంట్‌పై కోర్టు కేసు పెండింగ్‌లో ఉండగా, ఇప్పుడు నా వాటాను విక్రయించను. నన్ను బోర్డు నుండి తొలగించే ప్రయత్నాన్ని అడ్డుకుంటాను’’ అంటూ సమీర్ మోడీ  ఆగ్రహం వ్యక్తం చేశారు. 

అయితే ఈ ఆరోపణలను గాడ్‌ఫ్రే ఫిలిప్స్ ప్రతినిధి ఆరోపణలను ఖండించారు.  ఇవి పూర్తిగా అబద్ధం,  దారుణమైన ఆరోపణలని పేర్కొన్నారు. ఈ ఘటన ఇంట్లోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యిందని, అవి చూస్తే ఈ ఘటనపై స్పష్టత వస్తుందన్నారు.

కాగా 2019లో  గాడ్‌ఫ్రే ఫిలిప్స్  అధినేత కేకే మోడీ మరణంతర్వాత కుటుంబం వారసత్వ సంపదపై వివాదం మొదలైంది.  అప్పటినుంచి కలహాలుకొనసాగుతున్నాయి.గాడ్‌ఫ్రే ఫిలిప్స్ ప్రస్తుత సీఈఓ బీనా మోడీ ట్రస్ట్ డీడ్ నిబంధనలను ఉల్లంఘించి కంపెనీని తన ఆధీనంలోకి తీసుకున్నారని సమీర్ ఆరోపిస్తూ దావా వేశారు. 

అయితే మొదట తల్లి బీనా నిర్ణయానికి సమీర్, అతని సోదరి, చారు మోడీ మద్దతు ఇచ్చారు. అయితే, దీనిని వ్యతిరేకించిన లలిత్ మోడీ ట్రస్టు రద్దు చేయాలని డిమాండ్ చేశారు.దీంతో అతని వాటా అతని కిచ్చేశారు.  తరువాత కుటుంబ సంపదను పంచమని కోరడంతో  వచ్చిన విభేదాల నేపథ్యంలో  ఈ వివాదం ప్రస్తుం సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉంది. సమీర్ మోడీ 1933లో తన తాత గుజర్మల్ మోడీ స్థాపించిన మోడీ ఎంటర్‌ప్రైజెస్‌లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అలాగే గాడ్‌ఫ్రే ఫిలిప్స్ ఇండియాకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కూడా.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement