టేప్‌ రోల్‌ మాదిరి బ్రాస్‌లెట్‌..ఖరీదు ఏకంగా..! | This Balenciaga Bracelet Looks Exactly Like A Roll Of Tape, Netizens Shocked - Sakshi
Sakshi News home page

టేప్‌ రోల్‌ మాదిరి బ్రాస్‌లెట్‌..ఖరీదు ఏకంగా..!

Mar 27 2024 4:46 PM | Updated on Mar 27 2024 5:12 PM

This Balenciaga Bracelet Looks Exactly Like A Roll Of Tape - Sakshi

కొన్ని ప్రముఖ బ్రాండ్‌లు ఉత్పత్తి చేసే ప్రొడక్ట్‌లు చాలా లగ్జరియస్‌గా ఉంటాయి. వాటి ధరలు చూస్తే కళ్లు చెదిరిపోతాయి. అయితే ఒక్కోసారి అంత ప్రముఖ బ్రాండ్‌లు కూడా ఎంత విచిత్రాతి విచిత్రమైన ప్రొడక్ట్‌లను ఉత్పత్తి చేస్తాయో చూస్తే మాత్రం ఇదేంటీ? అనిపిస్తుంది. అలాంటి మాదిరి ప్రొడక్టనే మార్కెట్‌లోకి విడుదల చేసంది ప్రసిద్ధ ఫ్యాషన్‌ బ్రాండ్‌ కంపెనీ. అయితే ప్రొడక్ట్‌ని చూసిన జనం మండిపడుతున్నారు. ఎందుకంటే..

హై ఎండ్‌ ఫ్యాషన్‌ బ్రాండ్‌లకు పేరుగాంచిన బాలెన్సీగా ఓ విచిత్రమైన ప్రొడక్టను విడుదల చేసింది. ఈ నెల ప్రారంభంలో పారిస్‌ ఫ్యాషన్‌ వీక్‌ ఫాల్‌/వింటర్‌ 2024 సందర్భంగా సరికొత్త ఫ్యాషన్‌ బ్రాసెలెట్‌ని మార్కెట్‌లోకి విడుదల చేసింది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఆ వీడియోలో బ్రాస్‌లెట్‌ చూడటానికి ఎలా ఉందంటే.. టేప్‌రోల్‌ మాదిరిగి ఉండటంతో నెట్టింట హాట్‌ టాపిక్‌గా మారింది. ఇదేం బ్రాస్‌లెట్ అని సర్వత్రా చర్చలు మొదలయ్యాయి. ఇంత లగ్జరియస్‌ బ్రాండ్‌ మరీ ఇంత చీఫ్‌గా ఇలాంటి ప్రొడక్ట్‌లను తీసుకొస్తుందా అని మండిపడ్డారు.

పైగా ఆ బ్రాస్‌లెట్‌పై బ్రాండ్‌ లోగో క్లియర్‌గా ఉంది. కాబట్టి ఆ ఫ్యాషన్‌ కంపెనీ ప్రొడక్టే అని క్లియర్‌గా తెలుస్తుంది. ధర ఏకంగా రూ. 3 లక్షలకు పైగా పలకడం మరింత చర్చలకు దారితీసింది. నిజంగా ఈ బ్రాస్‌లెట్‌ స్పష్టమైన టేప్‌ రోల్‌ని పోలి ఉంది. దీంతో సోషల్‌ మీడియాలో నెటిజన్లు ఇదేం ఫ్యాషన్‌ అంటూ తిట్టిపసోస్తున్నారు. మరీ ఇంత చెత్త ప్రొడక్ట్‌లనా ఆ బ్రాండ్‌ తీసుకొచ్చేది. ఇదేం బ్రాండ్‌ అంటూ విమర్శలు చేస్తూ కామెంట్లు పెట్టారు. ఇంతకు ముందు కూడా ఈ బాలెన్సీగా ఇలానే ఓ చెత్త బ్యాగ్‌లా కనిపించే లెదర్‌ పర్సుని తీసుకొచ్చింది. పైగా దాని ధర కూడా లక్షల్లోనే పలకడం విశేషం. ఏదీఏమైన ఒక్కొసారి ప్రముఖ ఫ్యాషన్‌ బ్రాండ్‌లు కూడా లేటెస్ట్‌ ఫ్యాషన్‌ తీసుకురావడంలో చతకిలపడతాయోమో కదూ..!

(చదవండి: అందం కోసం పాము రక్తమా? ఎక్కడో తెలుసా!)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement