చల్లచల్లని కూల్‌ కూల్‌ | Sakshi
Sakshi News home page

చల్లచల్లని కూల్‌ కూల్‌

Published Sun, Apr 14 2024 6:34 AM

Artificial Intelligence Helps Improve NASA Eyes on the Sun - Sakshi

ఈ వేసవిలో ఆకాశానికి ఏసీ బిగిస్తే? మనం నడుస్తూ ఉంటే గాలి గొడుగు పడితే? కూర్చున్న చోటు చల్లని మందిరంగా మారితే? అసలు వేసవి మొత్తం  కూల్‌ కూల్‌గా అనిపిస్తే?
నిజంగా ఎలాగూ జరగదు. ఘోరమైన ఎండల్లో మాడక తప్పదు. అందుకే ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ను అడిగి ఇలాంటి ఊహలు చేసి ఆనందిస్తున్నారు జనం.


మార్తాండుడి ముందు ఎవరైనా మోకరిల్లాల్సిందే ఎండాకాలంలో. వట్టివేర్లు కిటికీలకు కట్టుకునేవారు, కూల్‌ పెయింట్‌ చేయించుకునేవారు, గోతాం పట్టాలు కట్టుకుని నీళ్లు చల్లుకునేవారు, ఏసీలు కొనుక్కునేవారు, కూలర్లు రిపేర్లు చేయించుకునేవారు, కొబ్బరి మట్టలతో పందిరి వేసుకునేవారు... చల్లదనం కోసం ఎన్నో మార్గాలు. అయితే మన నెత్తి మీదే ఎప్పుడూ ఫ్యాన్‌ ఉండాలని, మనం ఎక్కడ కూచున్నా జిల్లుమనాలని అత్యాశ కూడా ఉండొచ్చు.

‘ఇలాంటి ఆశలు మాకున్నాయి. అవి తీరినట్టుగా ఫొటోలు చేసి చూపించు’ అని ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ను అడిగితే అది తయారు చేసిన ఫొటోలు నెట్‌లో వైరల్‌ అయ్యాయి. నెత్తి మీద ఐసు గడ్డల హెల్మెట్‌ ఉన్న అవ్వ, ఐసు బల్ల మీద కూచుని టూరిస్ట్‌లు, ఐసు స్కూటర్‌ మీద రివ్వున దూసుకెళ్లే అమ్మాయి, ఒళ్లంతా ఫ్యాన్లు మొలిచిన గరీబు... ఇవన్నీ ఏ.ఐ చూపించి ఐసు వాటర్‌ తాగిన ఫీలింగ్‌ కలిగించింది.

Advertisement
Advertisement