అర్జున బెరడు గురించి విన్నారా? దీని ఔషధ గుణాలు తెలిస్తే..! | Arjuna Tree Bark amazing Benefits and Uses | Sakshi
Sakshi News home page

అర్జున బెరడు గురించి విన్నారా? దీని ఔషధ గుణాలు తెలిస్తే..!

Published Mon, Jun 17 2024 5:21 PM | Last Updated on Mon, Jun 17 2024 5:30 PM

Arjuna Tree Bark  amazing Benefits  and Uses

అర్జున చెట్టు లేదా తెల్ల మద్ది గురించి ఎపుడైనా విన్నారా?  ఈ  చెట్టు నుంచి తీసిన బెరడులో బోలెడన్ని ఔషధ గుణాలున్నాయి. అర్జున బెర‌డు తెలుపు, ఎరుపు రంగుల‌ను క‌ల‌గ‌లసి ఉంటుంది. పలు రకాల ఔషధాల తయారీలో దీనిని ఆయుర్వేదంలో విరివిగా వాడతారు. దీని అద్భుత  ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.


దీని బొటానికల్ పేరు: టెర్మినలియా అర్జున. దీని బెరడు గుండెకు టానిక్‌గా పనిచేస్తుందట. ఈ చెట్టు గురించిన ప్రస్తావన ఋగ్వేదంలో ఉంది. గుండె జబ్బులు, శ్వాసకోసం వ్యాధులు మొదలు  సంతాన లేమి   సమస్యలతో బాధపడే పురుషులకు కూడా ఇది దివ్యౌష‌ధంలా ప‌ని చేస్తుంది.

  • ఎముక‌ల బ‌ల‌హీన‌త‌తో బాధ ప‌డే వారికి అర్జున బెర‌డుచాలా ఉపయోడపడుతుంది. అర్జున బెర‌డును మెత్త‌గా పొడి చేసి, తేనె క‌లిపి రోజుకు పావు స్పూన్ చొప్పున తీసుకుంటే బ‌ల‌హీన‌మైన ఎముక‌లు దృఢంగా మార‌తాయి. ఫ్యాటీ లివర్ వ్యాధికి చక్కటి  పరిష్కారం  అర్జున బెరడు.

  • అలాగే వాతావరణం చల్లగా ఉన్నపుడు గోరు వెచ్చ‌టి పాల‌ల్లో అర్జున బెర‌డు పొడిని అర స్పూన్ చప్పున క‌లిపి తీసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల జ‌లుబు, ద‌గ్గు, గొంతు నొప్పి వంటి స‌మ‌స్య‌లు ద‌రి దాపుల్లోకి రాకుండా ఉంటాయి. ఆస్త‌మా,  శ్వాసకోశ ఇబ్బందులకు కూడా మంచి పరిష్కారం ఇది.

  • సంతాన స‌మ‌స్య‌ల‌తో బాధ ప‌డే పురుషులు రోజూ అర్జున బెరడు చూర్ణాన్ని పాలతో కలిపి తీసుకోవాలి. దీంతో వీర్య క‌ణాల వృద్ధిచెంది సంతాన భాగ్యం క‌లిగే అవ‌కాశాలు పెరుగుతాయి.

  • అర్జున బెరడుతో కషాయాన్ని త‌యారు చేసుకుని త‌ర‌చూ తీసుకుంటే గుండె పోటు, ఇత‌ర గుండె సంబంధిత జ‌బ్బులు వ‌చ్చే రిస్క్ త‌గ్గుతుంది.ధమనులు, సిరల్లో రక్త ప్రవాహాన్ని సాఫీగా జరిగేలా చేస్తుంది. లిపో ప్రోటీన్, ట్రైగ్లిజరైడ్స్‌ను తగ్గించి కొలెస్ట్రాల్‌కు చెక్‌ పెడుతుంది. 

  •  క‌డుపు అల్స‌ర్ స‌మ‌స్య నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది. రోగ నిరోధ‌క శ‌క్తిని వృద్ది చేస్తుంది. ర‌క్త పోటు స్థాయిలను నియంత్రిస్తుంది. శారీరక ఒత్తిడిని నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇంకా అర్జున బెరడు పొగాకు, ధూమపానం వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలను తగ్గించడంలో తోడ్పడుతుంది.

  • కణుతుల పెరుగుదలను నియంత్రించడంలోఉపయోగపడుతుంది. అర్జున బెరడులోని విటమిన్ ఈ కేన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల అర్జున బెరడు తోడ్పడుతుంది. 
     

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement