
Health Tips in Telugu: ఏ సీజన్‌లో అయినా విరివిగా దొరికే వాటిలో ముందుండేది దొండకాయ. సాధారణంగా ఇది చౌకగానే దొరుకుతుంది. దొండకాయతో వేపుళ్లు, కూరలు చేనుకుంటారు. గుత్తి వంకాయ లాగే దొండకాయలను కూడా నాలుగు పక్షాలుగా చీరి అందులో పూర్ణం కూరి కాయలు కాయలు కూర చేసుకుంటారు. పచ్చడి చేసుకుంటారు. బాలింతలకు, జ్వరం వచ్చి తగ్గిన వారికి దొండకాయ కూరను పథ్యంగా పెడతారు.
ముఖ్యంగా రోజువారీ ఆహారంలో ఒక కప్పు మేర దొండకాయను తీసుకుంటే డయాబెటిస్‌ను నిరోధించే వీలుంటుందని నిపుణులు సూచిస్తున్నారు. ఇందులో ఉండే క్యాల్షియం మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడకుండా చేస్తుంది. దొండ ఆకుల పేస్టును మాత్రల్లా వాడితే బ్యాక్టీరియాతో ఏర్పడే చర్మ సమస్యలు వుండవు. జలుబు, దగ్గును కూడా దొండ నయం చేస్తుంది. శరీరం నుంచి మలినాలను చెమట ద్వారా వెలివేస్తుంది.
ఈ ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా?
►దొండకాయ రక్తపోటును, మధుమేహాన్ని నియంత్రిస్తుంది.
►పీచు, ప్రోటీన్లు అధికంగా ఉంటాయి.
►ఇందులోని యాంటీ యాక్సిడెంట్లు హానికర బ్యాక్టీరియాను అడ్డుకుంటాయి.
►దగ్గు, ఆకలి లేకపోవడం.. వంటి వాటితో బాధపడేవారు దీన్ని తినడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
►దొండలో ఉండే బి–విటమిన్ నాడీ వ్యవస్థను రక్షిస్తుంది.
►మానసిక ఆందోళన, మూర్ఛ వ్యాధితో బాధపడేవారికి దొండకాయ చక్కటి పరిష్కారం.
►దీనిలోని క్యాల్షియం మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడకుండా చేస్తుంది.
►ఎముకలకు గట్టిదనాన్ని ఇస్తుంది. అయితే ఎన్ని ప్రయోజనాలున్నా దొండకాయను వారానికి మూడు సార్లకు మించకుండా తీసుకోవటమే మంచిది.
చదవండి: Pumpkin Seeds Health Benefits: గుమ్మడి గింజలు: ఎవరు తినకూడదు? ఎవరు తినవచ్చు!
Badam Health Benefits: రాత్రంతా నీళ్లలో నానబెట్టి బాదం పొట్టు తీసి తింటున్నారా? వేటమాంసం తిన్న తర్వాత వీటిని తిన్నారంటే..