Health Benefits Of Ivy Gourd: దొండకాయ కూర తింటున్నారా.. అందులో ఉండే బీటా కెరోటిన్ వల్ల..

Amazing Health Benefits Of Ivy Gourd Dondakaya In Telugu - Sakshi

అతివల అదరాల అందాన్ని వర్ణించాలంటే.... ఈ కూరగాయను అరువు తెచ్చుకోవాల్సిందే! అవును.. మరి దొండపండు లాంటి పెదవే నీది అంటే చాలదా! ఎంతటి కోపమైనా ఇట్టే మాయమైపోతుంది. అయితే, కేవలం ఈ ఉపమానాలకే వరకే దొండకాయను సరిపెట్టేయకండి! దీని వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదలరు. 

సాధారణంగా ఆసియా, ఆఫ్రికా దేశాల్లో దొండకాయను ఎక్కువగా పండిస్తారు. మన దేశంలో దొండకాయలతో కూరలతో పాటు.. వేపుడు చేయడానికి ఎక్కువ మంది ఇష్టపడుతూ ఉంటారు. ఇందుకోసం లేత దొండకాయలను ఉపయోగిస్తారు. అయితే, కొన్ని దేశాల్లో మాత్రం బాగా పండిన దొండకాయలను కూడా వంటల్లో ఉపయోగిస్తారు. ముఖ్యంగా ఇండోనేసియా, థాయ్‌లాండ్‌ వంటి దేశాల్లో ఎర్రగా పండిన దొండకాయలతో పాటు, దొండ ఆకులను కూడా తింటారు.

దొండకాయలో ఉండే విటమిన్లు, ఖనిజ లవణాలు
దొండకాయల్లో పీచు పదార్థాలు పుష్కలం.
అదే విధంగా.. బీటా కెరోటిన్, విటమిన్‌–బి1, బి2, బి3, బి6, బి9, విటమిన్‌–సి వంటివి ఉంటాయి.
స్వల్పంగా పిండి పదార్థాలు కూడా ఉంటాయి.
క్యాల్షియం, మెగ్నీషియం, ఐరన్, ఫాస్ఫరస్, పొటాషియం, సోడియం, జింక్‌ వంటి ఖనిజ లవణాలు దొండకాయలో ఉంటాయి.

దొండకాయ తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు
దొండకాయలు తినడం వల్ల రక్తహీనత తగ్గుతుంది.
రోగ నిరోధక శక్తిని పెంపొందించే గుణం దొండకాయలకు ఉంటుంది. 
ఇవి జీర్ణకోశానికి మేలు చేకూరుస్తాయి. ఇందులోని పీచు పదార్థాలు ఆహారం సులభంగా జీర్ణమయ్యేలా తోడ్పడతాయి. 

అంతేగాక రక్తంలో చక్కెర స్థాయిని అదుపు చేస్తాయి. కాబట్టి దొండకాయ రసం తాగితే ప్రయోజనం ఉంటుంది.
ఆస్తమాను నివారించడంలో కూడా దొండకాయలు కీలక పాత్ర పోషిస్తాయని పలు అధ్యయనాలు పేర్కొంటున్నాయి.
కాన్సర్‌ ముప్పును కూడా తగ్గిస్తాయి. ఇక ఇందులోని బేటా కెరోటిన్‌ విటమిన్‌- ఏగా రూపాంతరం చెంది కంటి ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుంది.

చదవండి: Health Tips: షుగర్‌, రేచీకటి ఉన్నవాళ్లు.. దగ్గు, ఆయాసంతో ఇబ్బంది పడేవాళ్లు గోంగూరను తింటే...

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top