Amarnath Vasireddy: యూరప్ తగలబడి పొతుందెందుకని? హరిత గృహ ప్రభావమా! భూతాపమా!

Amarnath Vasireddy Comments on Europe Environment Issues - Sakshi

యూరప్ తగలబడి పొతుందెందుకని ?
హైదరాబాద్  ఉష్ణ మండల ప్రాంతం లో ఉంది. భూమధ్య రేఖ కు రెండు వేల కిలోమీటర్ ల దూరం .
అదే యూరప్ దేశాలు సమ శీతోష్ణ మండలం లో ఉన్నాయి. ఉదాహరణకు పోర్చుగల్ భూమధ్య రేఖ నుంచి 4500  కిలోమీటర్ ల దూరం లో ఉంది .
హైదరాబాద్ లో వేసవి లో 42 ,43  డిగ్రీ ల ఉష్ణోగ్రత రికార్డు అవుతుంటుంది . మరి  మనం శీతల దేశాలుగా పిలుచుకునే యూరప్ లో వేసవిలో ఎంత ఉష్ణోగ్రత ఉండాలి ?   30?.. పోనీ ఎక్కువంటే 35  కదా ?

మొన్న పోర్చుగల్ లో పిహవో అనే చోట రికార్డు అయిన ఉష్ణోగ్రత ఎంతో తెలుసా ? 47  డిగ్రీ లు .! రామగుండం,  రెంటచింతల లాంటి ప్రాంతాల్లో కూడా ఇలాంటి ఉష్ణోగ్రత అరుదుగానే  రికార్డు అవుతుంది . ఏదో ఎడారి లో ఉన్నట్టు మంచు దేశాలయిన యురోపియన్ దేశాల్లో ఆ ఉష్ణోగ్రతలు ఏంటి ? 
రైలు పట్టాలు దెబ్బతింటున్నాయి . రవాణా వ్యవస్థ దెబ్బ తింది. మంటలు! మంటలు! .. అడవులే కాదు. ఊళ్లే తగలబడి పోతున్నాయి . లండన్,  కెంట్ , కన్వేల్ల్, తూర్పు లండన్ గ్రామాలు.. ఎక్కడ చూసినా తగలబడి పోతున్న దృశ్యాలు . 

స్కూళ్లకు సెలవులిచ్చేశారు . అత్యయిక పరిస్థితి విధించారు . ఎండకు,  వేడి కి జనాలు చచ్చి పోతున్నారు . ఒక్క స్పెయిన్ పోర్చుగల్ దేశాల్లోనే ఇప్పటిదాకా వెయ్యి మంది మరణించారు . 
ఎందుకిలా ? హరిత మందిర ప్రభావం .. భూతాపం . ఇదేనా ?  
ఆలా అనే ఇప్పటికీ అనుకొంటున్నా .  ఇదే కారణమైతే తూతూమంత్రపు చర్యలు కాకుండా ఇప్పటికైనా పటిష్టమైన చర్యలు చేపట్టాలి .

హరితమందిర ప్రభావం వల్ల అనేక రకాల అనర్ధాలు జరుగుతాయి . వర్షాలు పడవు . అంటే కరువు . పడితే ఒక రోజులో అతి భారీ కుంభ వృష్టి . అంటే ఒక పక్క వరదలు,  మరో పక్క క్షామం . ఏ విధంగా చూసినా బారీనష్టాలు . కొండచరియలు విరిగిపడడం , క్లౌడ్ బరస్ట్ , టైపూన్ , హరికేన్ , ఫ్లాష్ ఫ్లడ్స్ ఇలా అనేక విపత్తులు .

మరి గేట్ల తాత మాటేంటి ?
రెండేళ్ల నాటి మాట . ‘ప్రపంచ జనాభా ఏడు వందల కోట్లయ్యింది . దీని వల్ల అనేక అనర్ధాలు . రాబొయ్యేది నాలుగో పారిశ్రామిక యుగం . రోబో లు  రాజ్యమేలుతాయి . పారిశ్రామిక వ్యవస్థ సంగతి వేరు . పరిశ్రమల్లో పని చేయడానికి ఎక్కువ మంది కావాలి . కానీ కృత్రిమ మేధ యుగం లో ఇప్పుడున్న దానిలో మూడో వంతు చాలు .. ఇదీ గేట్ల తాత బృందం ఆలోచన . కాబట్టి జనాభా ను ఎలాగైనా లేపేయాలి ‘.. ఇదండీ .. రెండేళ్ల క్రితం నేను విన్నది . మెయిన్ మీడియా లో రాదు . ఇలాంటివి ఒక వర్గం లో బాగా సర్క్యూలేట్ అవుతున్నాయి 

వామ్మో .. ఇదేంటబ్బా .... మరీ స్కెజో పేర్నియా వ్యాధి గ్రస్తుల్లా,  మతి భ్రమణం చెంది ఏదేదో ఊహించుకొని చెప్పేస్తున్నారు  అనుకొన్నా. వాక్ సీన్ లు వేసుకోండి అని చెప్పా .
తీరుబడి గా చూస్తే వాక్ సీన్ ల వల్ల జరిగిన నష్టం,  అంతా ఇంతా కాదు . లక్షల మంది ఆరోగ్యం నాశనం అవుతుంటే వ్యవస్థలన్నీ  దొంగ నాటకాలాడడం   చూసి చూసి .. అసలు నేను కలకంటున్నానా ? అని ఇప్పటికీ నమ్మలేక నమ్మలేక బతుకుతున్నా.

గత కొన్ని  రోజులుగా కొంతమంది మిత్రులు కొన్ని లింక్స్ పంపుతున్నారు . పుంఖానుపుంఖాలుగా లింక్స్ . డాకుమెంట్స్ . వీటి సారంశం ఏమిటంటే తాత బృందం కేవలం వాక్సిన్ లను నమ్ముకొంటే లాభం లేదని ఇప్పుడు పర్యావరణం రూట్ పట్టింది .. కేం ట్రైల్స్ .. సూర్యుడ్ని కప్పేయడం .. ఇంకా చాలా చాలా ఉంది లెండి . 

‘సర్.. మీరు చెబితే నలుగురికీ తెలుస్తుంది . చెప్పండి . తాత కొత్త ప్లాన్.. అందరికీ తెలియాలి‘ అని మెసెంజర్ ద్వారా కొంత మంది మిత్రులు అడుగుతున్నారు .
‘అయ్యా !.. వాక్సీన్‌ల విషయం లో నాకు అయ్యింది చాలు . కుక్కపని చేసి తన్నులు తిన్న గాడిద బతుకయ్యింది . కరోనా యుగం ముగిసింది . వాక్సీన్‌ అయితే...  వద్దు అంటే కనీసం నలుగురు వింటారు .

తాత నిజంగానే పర్యావరణ విపత్తు సృష్టిస్తే నేను జనాల్ని ఎడ్యుకేట్ చేసినా సముద్రం లో నీటి బొట్టు .. జనాలు తెలుసుకున్నా చేసేది ఏముంటుంది ? ఎక్కడో కూర్చొని ఆయనో పొర లో ఏదో మార్పులు చేస్తే ఇక్కడ మనం చేసేది ఏముంటుంది ? అయినా ఇలాంటి వాటి పట్ల పెద్ద పెద్ద నాయకులు వ్యవస్థలు స్పందించాలి . నేను ఈ బురద లో కాలు పెట్టను‘ అని చెబుతూ వస్తున్నా.
మొన్న ఒక పోస్ట్ పెట్టా. యూరప్ లో ఇదిగో ఇలాంటి విపత్తులు వస్తున్నాయి .. దీని వెనుక కారణం హరితమందిర ప్రభావమేనా లేక ఇంకేదైనా ఉందా ? అని. కనీసం జనాల్లో చర్చ మొదలైతే ఏది నిజమో ఏదో అబద్ధమో తెలుస్తుంది అని నా ఆశ .

జనాలకు ఓపిక తక్కువ . కేవలం ఒక లైన్ చదివి నిర్ణయానికి వచ్చే రకం .
ఆరోగ్య కరమైన చర్చలకు అవకాశం లేదు . నిందలు.. ఆరోపణలు .. తిట్లు .. ఆవేశాలు ..  .. బూతులు .. ఇవీ సోషల్ మీడియా లో రాజకీయ చర్చలు . రాజకీయాలే సర్వం అనుకొనే స్థాయి వారిది .

నేను చెప్పింది వేరు . అసలు పర్యావరణ కుట్ర జరుగుతోంది అని కూడా చెప్పలేదు . ఇక్కడ జరిగింది క్లౌడ్ బరస్ట్ అవునా ?కదా? చెప్పలేదు . కానీ చదివే ఓపిక ఎవరికీ ? ప్రపంచ పర్యావరణం  మారి పోతోంది . ఎందుకు ?. చర్చ జరగని .. ఇదీ నా పోస్ట్ ల సారం . 
నా స్టూడెంట్స్ .. పోలీస్ కమిషనర్ , ఇన్కమ్ టాక్స్ కమిషనర్ అయితే వెళ్లి ఒక సారి గ్రీటింగ్ చెప్పలేదు . చెప్పకూడదని కాదు . నా పని నాది . ఎప్పుడైనా సందర్భం వస్తే ఓకే. అంతే కానీ నా పనులు వదిలి పెట్టి వెళ్ళ.

నేను .. నా స్కూల్ .. నా పిల్లలు .. క్లాసులు .. జిం .. ఇదే నా ప్రపంచం . ఏదో కరోనా యుగం లో  ఫేస్బుక్ ద్వారా  ఎడ్యుకేట్ చేయడం మొదలెట్టా . అది కొనసాగిస్తా . 
కానీ అక్కినేనికి మిక్కిలినేని తేడా తెలియదా? అని ఏదో సినిమా లో చెప్పినట్టు ఆరోరాల్ రీసెర్చ్ ప్రోగ్రాం కు ఇక్కడ జరిగిందో లేదో తెలియని క్లౌడ్ బరస్ట్ కు తేడా తెలియని జనాలకు జనాలకు చెప్పే ఓపిక/  అవసరం లేదు . వాక్ సీన్ ల గురించి చెప్పాల్సింది అంతా చెప్పేశా . ఇక పర్యావరణ్ కుట్ర నిజమో కాదో .. నేనే  డిసైడ్ చేసుకోలేక ఉన్నా. ఇక నేను ఈ విషయం లో చెప్పేది ఏముంది ? ఒక వేళ . చెప్పినా చాలా మందికి అర్థం కాదు . 

అవన్నీ మీకు అనవసరం  కదా .. పోనీలే ! మీరు మీ స్విమ్మింగ్ కొనసాగించండి . 
మీకు ఏ విధంగా విరోధి కాని / వైరం లేని ఆ మాటకు వస్తే మీ హితం కోరే వ్యక్తి పై ఏదో కాలక్షేపానికో / అహం దెబ్బ తినో బట్ట కాల్చి నెత్తిన వేయకండి . అది ధర్మంకాదు . ధర్మో రక్షతి రక్షితః !


- అమర్నాద్ వాసిరెడ్డి
ప్రముఖ ఉపాధ్యాయులు, పరిశోధకులు, మనస్తత్వ పరిశీలకులు

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top