‘సీలాండ్‌'.. దేశ జనాభా 27 మంది మాత్రమే! | Sakshi
Sakshi News home page

Sealand: ‘సీలాండ్‌'.. దేశ జనాభా 27 మంది మాత్రమే!

Published Tue, Jul 5 2022 9:21 PM

All You Need To Know About Sealand - Sakshi

యునైటెడ్‌ కింగ్‌డమ్‌లోని సఫోక్‌ సముద్ర తీరానికి దాదాపు పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఏర్పడిన వింతదేశం పేరు ‘సీలాండ్‌’. సముద్రంలో ఏర్పాటు చేసిన రెండు భారీ స్తంభాలపై పూర్తిగా మానవ నిర్మిత ప్రదేశం ఇది. ఒక మానవ నిర్మిత ప్రదేశమే దేశంగా ఏర్పడటం దీని ప్రత్యేకత. ఇది 1967 సెప్టెంబర్‌ 2న ప్రత్యేక దేశంగా ఆవిర్భవించింది. రెండో ప్రపంచయుద్ధం జరుగుతున్నప్పుడు 1943లో అప్పటి యూకే ప్రభుత్వం సముద్రం మధ్య రెండు భారీ రాతి స్తంభాలను కలుపుతూ ఇక్కడ తన రక్షణ అవసరాల కోసం కోటను నిర్మించుకుంది. 

యుద్ధం ముగిశాక ఖాళీగా మిగిలిన ఈ కోటకు జాక్‌ మూరే, అతని కూతురు జేన్‌ చేరుకున్నారు. వాళ్లిద్దరూ ‘వండర్‌ఫుల్‌ రేడియో లండన్‌’ అనే పైరేట్‌ రేడియో స్టేషన్‌ తరఫున ఇక్కడకు వచ్చారు. ఆ పైరేట్‌ రేడియో స్టేషన్‌ అధినేత ప్యాడీ రాయ్‌ బేట్స్‌ 1967 సెప్టెంబర్‌ 2న ఈ కోటను ఆక్రమించుకుని, ప్రత్యేక దేశంగా ప్రకటించుకున్నాడు. ఈ దేశానికి ప్రత్యేక కరెన్సీ, జెండా, జాతీయగీతం కూడా ఉన్నాయి. ఈ దేశం తన పౌరులకు పాస్‌పోర్టులూ ఇస్తోంది. ఈ దేశ జనాభా 27 మంది మాత్రమే!
చదవండి: World Zoonoses Day: కని‘పెట్‌’కుని ఉండాలి..! లేదంటే కష్టమే!

Advertisement
 
Advertisement