ఫస్ట్‌ కంప్యూటరింగ్‌ ప్రోగ్రామ్‌... ఆమె చలువే! | Ada Lovelace and the first computer programme in the world | Sakshi
Sakshi News home page

ఫస్ట్‌ కంప్యూటరింగ్‌ ప్రోగ్రామ్‌... ఆమె చలువే!

Nov 28 2026 1:14 AM | Updated on Nov 28 2026 1:14 AM

Ada Lovelace and the first computer programme in the world

అడుగుజాడలు

కంప్యూటర్లు పుట్టడానికి చాలాకాలం క్రితం... 27 ఏళ్ల బ్రిటిష్‌ గణితశాస్త్రవేత్త అడా లవ్‌లేస్‌ భవిష్యత్‌ను దర్శించింది. అంకెలను లెక్కించడమే కాకుండా, సూచనలను అనుసరిస్తూ, ఎంత సమాచారాన్ని అయినా మేనేజ్‌ చేయగల ఒక మెషిన్‌ గురించి కల కన్నది. 

ఫస్ట్‌ కంప్యూటర్‌ ప్రోగ్రామింగ్‌ రాసిన తొలి మహిళగా ప్రసిద్ధికెక్కింది అడా. అనలిటికల్‌ ఇంజిన్‌ కోసం ఒక అల్గారిథమ్‌ను రూపొందించడం ఆమె ఘనత. దీన్ని మొదటి కంప్యూటర్‌ ప్రోగ్రామ్‌ అని చాలామంది పిలుస్తారు. ఇటాలియన్‌ గణిత శాస్త్రవేత్త, ఇంజినీర్‌ లూయిగి ఫెడెరికో బాబేజ్‌ అనలికటికల్‌ ఇంజిన్‌ గురించి ఫ్రెంచ్‌లో ఒక వ్యాసం రాశాడు. అడా దానిని ఇంగ్లీష్‌లోకి అనువాదం చేయడంతో పాటు ఫుట్‌నోట్స్‌లో తన సొంత ఆలోచనలను రాసింది.

ఒక్కమాటలో చెప్పాలంటే ఇది కంప్యూటర్‌ ప్రోగ్రామ్‌కు సంబంధించి ప్రచురితమైన మొట్ట మొదటి రచన. నిజానికి అడా నోట్స్‌కు ముందే బాబేజ్‌ అనే మేధావి నమూన ప్రోగ్రామ్‌లను రాశారు. అయితే అడా పనిని ప్రత్యేకంగా నిలిపింది...స్పష్టమైన అల్గారిథమ్‌ను ప్రచురించడం మాత్రమే కాదు, ప్రోగ్రామబుల్‌ మెషిన్‌లకు సంబంధించి లోతైన చిక్కులను కనిపెట్టి, వాటి గురించి స్పష్టంగా వివరించడం.

ఇంతకీ అడా లవ్‌లేస్‌ ఎవరో కాదు. ప్రపంచ ప్రసిద్ధ కవి లార్డ్‌ బైరన్‌ కూతురు. ఆమె తల్లి గణిత శాస్త్రవేత్త. ఒక మాటలో చెప్పాలంటే తల్లిదండ్రుల మేధో వారసత్వానికి నిజమైన వారసురాలిగా అడా చరిత్రకెక్కింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement