breaking news
ADA
-
వచ్చేస్తోంది ఐదో తరం ఫైటర్
న్యూఢిల్లీ: మారుతున్న యుద్ధతంత్రాలకు అనుగుణంగా అధునాతన ఐదోతరం యుద్ధవిమానాన్ని రూపొందించే బృహత్తర ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. అడ్వాన్స్డ్ మీడి యా కంబాక్ట్ ఎయిర్‌క్రాఫ్ట్ (ఏఎంసీఏ–అమ్కా)గా పిలిచే నవతరం యుద్ధవిమానం మోడల్ తయారీకి సంబంధించిన కార్యనిర్వాహక ఉత్తర్వుపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ ఆమోదముద్ర వేశారు. ఏఎంసీఏ ప్రాజెక్ట్‌లో భాగంగా గగనతలంలో మెరుపువేగంతో దూసుకుపోతూ శత్రు రాడార్లు, నిఘా వ్యవస్థలను ఏమారుస్తూ భీకర స్థాయిలో దాడి చేయగల మధ్యస్థాయి బరువైన ఐదో తరం యుద్ధ విమానాన్ని అభివృద్ధి చేయనున్నారు.కొత్త ప్రాజెక్ట్ దేశీయ రక్షణ సామర్థ్యాలను మరింత పెంచడంతోపాటు స్థానిక వైమానిక తయారీ రంగ పరిశ్రమ పురోభివృద్ధికి ఇది బాటలు వేయనుందని రక్షణ శాఖ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొంది. రక్షణ పరిశోధనాభివృద్ధి సంస్థ (డీఆర్డీఓ)కు చెందిన ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ(ఏడీఏ) రక్షణ రంగ సంస్థల భాగస్వామ్యంతో ఏఎంసీఏ మోడల్‌ను అభివృద్ధి చేయనుంది. ప్రైవేట్ సంస్థలకూ ప్రాజెక్టులో భాగస్వామ్యం దక్కుతుండటంతో ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో ఉపాధి అవకాశాలు మెరుగవనున్నాయి.‘‘ఈ ప్రాజెక్ట్‌ను స్వతంత్ర సంస్థలాగా లేదంటే జాయింట్ వెంచర్లాగా లేదంటే కన్సార్షియం మాదిరి నెలకొల్పి ప్రారంభించనున్నాం. ఈ కొత్త సంస్థను భారతీయ సంస్థగానే నమోదు చేస్తాం. పూర్తిగా భారతీయ చట్టాలు, నియమనిబంధనలకు లోబడే ఈ సంస్థ పనిచేయనుంది. ఏఎంసీఏ ప్రోటోటైప్ దేశీయ రక్షణరంగ సత్తాను చాటేలా ఉంటుంది. రక్షణరంగంలో స్వావలంబన, ఆత్మనిర్భరత సాధనలో ఇది మైలురాయిగా నిలవనుంది’’అని రక్షణ శాఖ పేర్కొంది. ఈ ప్రాజెక్ట్‌ను రూ.15,000 కోట్ల ఆరంభ వ్యయంతో మొదలు పెట్టనున్నారు.దీర్ఘకాల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని వాయుసేన, నావికాదళం డిమాండ్లకు తగ్గట్లు ఏఎంసీఏ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చుతోంది. తేలికపాటి యుద్ధవిమానమైన తేజస్ తర్వాత మధ్యశ్రేణి బరువైన అడ్వాన్స్డ్ మీడియా కంబాక్ట్ ఎయిర్‌క్రాఫ్ట్ త యారీ దిశగా భారత్ ముందడుగు వేయడం విశేషం. దీన్ని 2035కల్లా తయారు చేయాలని డీఆర్డీవో భావిస్తుంది. భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ గతేడాది ఈ ప్రాజెక్ట్‌కు అంగీకారం తెలిపింది. పదేళ్లలోపు తయారు చేస్తామని డీఆర్డీఓ పేర్కొంది. భిన్న రకాల బాంబులు అమ్కాలో వేర్వేరు రకాల క్షిపణులు, మందుగుండును అమర్చవచ్చు. ⇒ గైడెడ్ మిస్సైళ్లతోపాటు నాలుగు దీర్ఘశ్రేణి క్షిపణులను ప్రయోగించవచ్చు. ⇒ 1,500 కేజీల బరువైన బాంబులను సునాయాసంగా జారవిడవగలదు. ⇒ ఇది అత్యల్పస్థాయిలో విద్యుదయస్కాంత స్వ భావాన్ని ప్రదర్శిస్తుంది. దాంతో శత్రు రాడార్లు దీని జాడను కనిపెట్టడం చాలా కష్టం.మూడు దేశాల వద్దే ప్రస్తుతం మూడు దేశాల వద్ద మాత్రమే ఐదో తరం యుద్ధవిమానాలున్నాయి. ⇒ అమెరికా: ఎఫ్–22 రాప్టర్, ఎఫ్–35ఏ లైట్నింగ్– ఐఐ ⇒ చైనా: చెంగ్డూ జె–20 మైటీ డ్రాగన్, జె–35 ⇒ రష్యా: సుఖోయ్ 57ఇ సైలెంట్ కిల్లర్ కొత్త తరహా సెన్సార్ వ్యవస్థ, అంతర్గత ఆయుధ వ్యవస్థ, కమ్యూనికేషన్, నావిగేషన్, సూపర్ క్రూయిజ్ సామర్థ్యం ఇలా ఎన్నో విశిష్టతల సమాహారంగా అమ్కా ఫైటర్ జెట్ రూపుదిద్దుకోనుంది. ఇందులోని విశేషాలు అన్నీ ఇన్నీ కావు... ⇒ అమ్కా మొత్తం బరువు 25 టన్నులు. ఇందులో జంట ఇంజిన్లు ఉంటాయి. సుదూరాలకు ప్రయాణించగలిగేలా 6.5 టన్నుల ఇంధనాన్ని విమానంలో నింపొచ్చు. ⇒ కొత్త యుద్ధవ్యూహాలకు తగ్గట్లు, శత్రు రాడార్లకు చిక్కకుండా, నిశ్శబ్దంగా దూసుకెళ్లేలా దీనిని డిజైన్ చేస్తారు. ఇది ఏకంగా 55,000 అడుగుల ఎత్తులో ఎగరగలదు. ⇒ కృత్రిమ మేధ సాయంతో దీనిని పైలట్ లేకుండానే భూమి మీద నుంచే నియంత్రించవచ్చు. ⇒ ఉపగ్రహాల నుంచి అందే రియల్‌టైమ్ డేటా ను విశ్లేషించుకుంటూ కొత్తరకం నెట్ సెంట్రిక్ వార్ఫేర్ సిస్టమ్‌తో ఇది పనిచేస్తుంది. ⇒ ఇది అన్ని రకాల వాతావరణాల్లో, ప్రతికూల పరిస్థితుల్లోనూ నిరి్నరోధంగా దూసుకెళ్లగలదు. ⇒ శత్రు గగనతలంలోకి వెళ్లగానే ఎల్రక్టానిక్, ఆప్టికల్, ఇన్ఫ్రారెడ్ వ్యవస్థల సాయంతో వారి రాడార్లను పేల్చేసే ‘సీడ్’అనే ప్రత్యేక వ్య వస్థ ఈ విమానం సొంతం. అలా శత్రువుల క్షిపణి ప్రయోగ వ్యవస్థ నిర్విర్యమవుతుంది. మన యుద్ధవిమానాల పని సులువవుతుంది. ⇒ అమ్కా వేగంగా యాంటీ–రేడియేషన్ క్షిపణులను ప్రయోగించగలదు. ⇒ దీనిలో వాడే ఇంజన్‌ను విదేశీ ఒరిజినల్ ఎక్విప్మెంట్ మాను్యఫ్యాక్చరర్ (ఓఈఎం)లతో సంయుక్తంగా తయారు చేయనున్నారు.ఏమిటీ ఐదో తరం? ⇒ 1940–50 దశకంలో తయారైన వాటిని తొలి తరం యుద్ధవిమానాలుగా పేర్కొంటారు. వీటిల్లో రాడార్లు ఉండవు. కేవలం మెషీన్ గన్ బిగించి ఉంటుంది. వేగమూ తక్కువే. ⇒ 1950–60 కాలంలో తయారైనవి రెండో తరానికి చెందినవి. ప్రాథమిక స్థాయి రాడార్ వ్యవస్థ వీటిల్లో ఉండేది. సూపర్సోనిక్ వేగంతో దూసుకెళ్లేవి. మిగ్–21, మిరాజ్–3 ఈ రకానివే. ⇒ 1970–80ల్లో తయారైనవి మూడో తరానికి చెందినవి. ఇవి శత్రు విమానాలను గాల్లోనే పేల్చేయగలవు. ఎఫ్–4, మిగ్–23, జాగ్వార్ ఈ కోవకు వస్తాయి. ⇒ 1980–90 కాలంలో తయారైనవి 3.5 తరానికి చెందినవి. వీటిల్లో డిజిటల్ వ్యవస్థలు వచ్చేశాయి. ఆకాశంలో 40 కి.మీ. దూరంలోని విమానాలను కూడా పేల్చేసే శక్తిసామర్థ్యాలు వీటి సొంతం. ఎఫ్–5ఈ టైగర్2, మిగ్–21 బిసాన్ ఈ రకానివే. ⇒ 1990 తర్వాత నాలుగో తరం యుద్ధవిమానాలు అందుబాటులోకి వచ్చాయి. ఇప్పుడున్నవన్నీ 4, 4.5 తరాలకు చెందినవే. -
ఆ ఒక్కటీ... అడక్కు..!! షాక్‌లో ఆడిట్ అధికారులు
సాక్షి, కణేకల్లు: కణేకల్లు వ్యవసాయ విత్తనోత్పత్తిక్షేత్రంలో అక్రమాలు నిగ్గు తేల్చేందుకు రంగంలో దిగిన ఆడిటర్లు తమకు అప్పగించిన పనిని పూర్తి చేశారు. పూర్వ ఏడీఏ సనావుల్లా పదేళ్ల కాలంలో రికార్డులను సక్రమంగా నిర్వహించకుండా, ఆదాయ వ్యయాలు సరిగా చూపకుండా, నిధులను భారీస్థాయిలో దుర్వినియోగం చేసినట్లు ఆరోపణలున్నాయి. ఫారం బకాయిపడిన సొమ్మును ఓటీఎస్ ద్వారా రూ.78.36 లక్షలను ప్రభుత్వం ఇటీవలే చెల్లించగా... ఇందులో కూడా ఓ వ్యక్తి ఖాతా నుంచి తన భార్య ఖాతాకు రూ.13.85 లక్షలు మళ్లించుకున్న విషయం విదితమే. ఈ వ్యవహారంపై సీరియస్‌గా ఉన్న రాష్ట్ర వ్యవసాయశాఖ కమిషనర్.. సనావుల్లా పని చేసిన సమయంలోని రికార్డులన్నీ పరిశీలించేందుకు ఆడిటర్లను నియమించింది. ఆడిటర్లు యోగానందరెడ్డి, రాంబాబు, మాధవి, అన్నపూర్ణ ఐదు రోజుల పాటు రికార్డులన్నీ క్షుణ్ణంగా ఆడిట్ చేశారు. నిధుల దుర్వినియోగంపై ఆడిటర్లను అడిగితే ‘ఆ ఒక్కటి అడక్కండి.. కమిషనర్‌కు నివేదిక అందజేస్తాం’ అని సమాధానమిచ్చారు. నివేదికలో ఏముంది.. పూర్వ ఏడీఏపై ఎటువంటి చర్యలు తీసుకుంటారోనన్న చర్చ అందరిలోనూ ఉత్కంఠ రేపుతోంది. (చదవండి: విద్యార్థి ఆత్యహత్య కేసు: చనిపోవడానికి ముందు వేరే గదికి!) -
ఆదాయానికి మించి ఏడీఏ ఆస్తులు
సాక్షి, పెద్దపల్లిరూరల్: పాలనా సౌలభ్యంకోసం ప్రభుత్వం కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తే ఇదే అదనుగా భావించిన కొందరు అధికారులు పైసలిస్తేనే పనులు చేస్తున్నారు. బాధితులు అవినీతి నిరోధకశాఖ అధికారులను ఆశ్రయించి అక్రమాలకు పాల్పడుతున్న అధికారులను కటకటాలకు పంపుతున్నారు. ఓ పక్క కేసులు నమోదవుతున్నా కొంతమంది అధికారుల్లో మాత్రం ఏ మాత్రం మార్పు కనిపించడం లేదనేందుకు మూడునెలల వ్యవధిలో జిల్లాకేంద్రంలోనే నలుగురు అధికారులు ఏసీబీకి చిక్కడమే ఇందుకు నిదర్శనం. కొద్ది మాసాలక్రితం సబ్‌రిజిస్ట్రార్, ఇరిగేషన్ డీఈఈ, వీఆర్వోలు పట్టుబడగా.. తాజాగా వారంక్రితం (ఈ నెల 15న) పెద్దపల్లి డివిజన్ ఏడీఏ కృష్ణారెడ్డి విత్తన వ్యాపారికి లైసెన్స్ మంజూరుకోసం రూ.10 వేలు లంచం తీసుకుంటూ అవినీతి నిరోధకశాఖ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. వ్యవసాయశాఖలో ప్రతీ పనికి ఓ రేటు నిర్ణయించి వసూలు చేస్తున్నారంటూ కొంతకాలంగా ప్రచారం జరుగుతున్నా ఏసీబీ అధికారులకు ఏడీఏ చిక్కడంతో అది నిజమేనని పలువురు పేర్కొంటున్నారు. విత్తనాలు, ఎరువుల విక్రయం కోసం కొత్త లైసెన్స్ జారీ చేయడం, పాత వాటిని రెన్యువల్ చేసేందుకు అధికారులు మామూళ్లు వసూలు చేశారనే ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. జిల్లా వ్యవసాయశాఖలో పని చేస్తున్న ఇంకా కొందరి అధికారులపై కూడా ఏసీబీ అధికారులు దృష్టిసారించి లోతుగా విచారణ సాగించేందుకు సమాయత్తమవుతున్నట్లు సమాచారం. ఇప్పటికే ఒకరిద్దరు వ్యవసాయాధికారులకు ఏసీబీ అధికారుల నుంచి పిలుపు వచ్చిందని సంబంధితశాఖ అధికార వర్గాల ద్వారా తెలిసింది. ఆదాయానికి మించిన ఆస్తులు పెద్దపల్లి ఏడీఏగా పని చేస్తున్న కృష్ణారెడ్డి రూ.10 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన విషయం తెలిసిందే. అయితే ఏసీబీ అధికారులు రెండు, మూడురోజులుగా ఏడీఏ నివాసముండే వరంగల్‌లో ఇంట్లో సోదాలు నిర్వహించగా ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారని గుర్తించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. కృష్ణారెడ్డి ఇంట్లో దాదాపు రూ.6 లక్షల మేర నగదుతోపాటు రూ.75 లక్షల ఫిక్స్డ్ బాండ్లు, సుమారు కిలో వరకు బంగారు ఆభరణాలు, హైదరాబాద్‌లోని పలుప్రాంతాల్లో ప్లాట్లు, అపార్ట్మెంట్లకు సంబంధించిన డాక్యుమెంట్లను గుర్తించి సీజ్ చేసినట్లు సమాచారం. అంతేకాకుండా బ్యాంకులో మూడు జంబో లాకర్లలో రూ.కోటి 30 లక్షల నగదు ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించినట్లు తెలిసింది. సదరు ఏడీఏ కృష్ణారెడ్డిపై ఇప్పటికే అవినీతి కేసును నమోదు చేసిన ఏసీబీ అధికారులు తాజాగా లభించిన ఆధారాలతో ఆదాయానికి మించిన ఆస్తుల కేసు కూడా నమోదు చేసేందుకు సమాయత్తమవుతున్నట్లు ఓ అధికారి ధ్రువీకరించారు. దీంతో ఏడీఏ కృష్ణారెడ్డి కేసు విచారణ సాగుతున్నందున వ్యవసాయశాఖలో పని చేస్తున్న వారిలో ఇంకా ఎవరి మెడకు చుట్టుకుంటుందోనని పలువురు అధికారులు ఆందోళనలో ఉన్నట్లు తెలుస్తోంది. -
ఏసీబీకి చిక్కిన పెద్దపల్లి ఏడీఏ
సాక్షి, పెద్దపల్లి(కరీంనగర్) : పెద్దపల్లి వ్యవసాయశాఖ ఏడీఏ క్రిష్ణారెడ్డి శుక్రవారం ఏసీబీ అధికారులకు చిక్కారు. కరీంనగర్‌కు చెందిన నగునూరి లక్ష్మణ్ పెద్దపల్లిలో ఫెర్టిలైజర్ దుకాణం ఏర్పాటుకు లైసెన్సుకోసం ఏడీఏ రూ.15వేలు డిమాండ్ చేశారు. లక్ష్మణ్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. రూ.10వేలు ఏడీఏ చేతికి అందిస్తుండగా ఏసీబీ డీఎస్పీ భద్రయ్య పట్టుకున్నారు. పట్టణంలోని జెండాచౌరస్తా ఏరియాలో ఫెర్టిలైజర్ దుకాణం కోసం లైసెన్సు ఇవ్వాల్సిందిగా రెండు నెలలుగా లక్ష్మణ్ «అధికారులచుట్టూ తిరుగుతున్నాడు. ఏడీఏ క్రిష్ణారెడ్డిని కలిసి లైసెన్స్ గురించి ప్రశ్నిం చాడు. తనకు రూ.15వేలు ఇవ్వాలని, మిగతా ఉద్యోగులకు ఎవరికి ఇవ్వాల్సినవి వారికి ఇచ్చి లైసెన్స్ తీసుకెళ్లాల్సిందిగా క్రిష్ణారెడ్డి సూచిం చాడు. తాను రూ.10వేలు ఇస్తానని ఒప్పుకుని ఏసీబీని ఆశ్రయించాడు. శుక్రవారం ఏడీఏ కార్యాలయం వద్ద డబ్బులు తీసుకుం టుండగా అధికారులు అరెస్ట్ చేశారు. లక్ష్మ ణ్‌వాగ్మూలం సేకరించారు. కార్యాలయంలో పెండింగ్‌లో ఉన్న లైసెన్స్ పత్రాలను పరిశీలించారు. కార్యాలయం వద్దకు మరో ఇద్దరు బాధితులు విషయం తెలుసుకున్న మరో ఇద్దరు బాధితులు ఏసీబీ అధికారులను కలిసేందుకు కార్యాలయానికి వచ్చారు. తాను రూ.5 వేలు ఇచ్చానని, మరొకరు రూ.15 వేలు ఇచ్చానంటూ ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యారు. అక్కడే ఉన్న కొందరు ఇప్పటికే క్రిష్ణారెడ్డి ఉద్యోగానికి ఎసరు వచ్చిందని, ఇక కొత్తగా ఫిర్యాదు వద్దంటూ వారించడంతో బాధితులు వ్యవసాయశాఖ కార్యాలయం నుంచి వెళ్లిపోయారు. పెద్దపల్లిలోనే నలుగురు అవినీతిపరులు పెద్దపల్లిలోనే ఆరునెలల కాలంలో నలుగురు అవినీతిపరులు ఏసీబీకి చిక్కారు. రెండువారాల క్రితమే వీఆర్వో లింగమూర్తి రూ.8వేలు లంచం తీసుకుంటూ పట్టుపడ్డాడు. శుక్రవారం వ్యవసాయశాఖ అధికారి క్రిష్ణారెడ్డి రూ.10వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ వైనం నివ్వెరపరిచింది. సబ్‌రిజిస్ట్రార్, ఇరిగేషన్ శాఖ డీఈ, పాఠశాల హెచ్ఎం, తాజాగా చిక్కిన ఏడీఏ లకు రూ.లక్షకు ఐదుపదివేలు తక్కువ జీతం తీసుకొనేవాళ్లే. ప్రభుత్వం భారీగా వేతనాలు చెల్లిస్తున్నా అవినీతిలో మాత్రం తగ్గకుండా ఉద్యోగులు రూ.ఐదు, పది వేలకు చేతులు చాచి, తమ ఉద్యోగ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని ఏసీబీకి చెందిన ఓ అధికారి వ్యాఖ్యానించారు. -
నీటి పరీక్షలే కీలకం
అనంతపురం అగ్రికల్చర్ : మారుతున్న వ్యవసాయ సాగు పద్ధతుల్లో నీటి పరీక్షలకు ప్రాధాన్యత ఏర్పడిందని స్థానిక మట్టి, నీటి, విత్తన పరీక్షా కేంద్రం (ఎస్టీఎల్) ఏడీఏ ఎం.కృష్ణమూర్తి తెలిపారు. పంటలు బాగా పండాలంటే మట్టి, నీరు, పత్ర విశ్లేషణ లాంటి పరీక్షలు చేయించుకొని, వాటి ఫలితాల ఆధారంగా సమగ్ర పోషక, నీటి, సస్యరక్షణ చర్యలు చేపడితే పెట్టుబడి ఖర్చులు తగ్గి పంట దిగుబడి పెరుగుతాయని తెలిపారు. నీటి పరీక్ష ఆవశక్యత : నీటి పరీక్షల ఫలితాల ఆధారంగా పంటల ఎంపిక, వాటి దిగుబడులు ఆధారపడి ఉంటాయని ఏడీఏ తెలిపారు. మట్టి పరీక్షలు, ఫలితాలు, ఎరువుల వాడకం గురించి ఇటీవల రైతుల్లో అవగాహన పెరిగినా నీటి పరీక్షల గురించి తెలియడం లేదన్నారు. పెరుగుతున్న నీటి కొరత, భూమి లోపల పొరల నుంచి నీటిని విచ్చలవిడిగా తోడేయడం వల్ల ఎక్కువ లవణాలు నేల ఉపరితలంపై చేరి పంట ఎదుగుదలకు హానికరమవుతున్నాయన్నారు. దీని వల్ల పంటలు సరిగా ఎదగకపోవడమే కాక నేలలు కూడా చెడిపోయే పరిస్థితి నెలకొందన్నారు. ఇలాంటి ప్రతికూల పరిస్థితులు ఏర్పడకుండా సాగునీటిని పరీక్ష చేయించిన తర్వాత వాడుకోవడం మంచిదని, మట్టి, నీళ్ల శ్యాంపిల్స్ ఎప్పుడు తీసుకొచ్చినా సకాలంలో ప్రయోగశాలలో పరీక్షించి వాటి ఫలితాలను ఆన్లైన్ చేసి, హెల్త్‌కార్డు పేరుతో రైతుకు వివరాలు అందజేస్తామన్నారు. నీటి సేకరణ : నీళ్లకు ఎక్కడి పడితే అక్కడ ఎలా అంటే అలా తీసుకురాకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఏడీఏ తెలిపారు. మొదట బోరుబావి నీటిని సుమారు 20–30 నిమిషాలు వదలిపెట్టాలన్నారు. ప్లాస్టిక్ సీసాలో అర లీటర్ నీటిని సేకరించాలి. వీలైనంత వరకు గాజు సీసా బదులు ప్లాస్టిక్ సీసాలను వాడాలని, పురుగు మందులు, టానిక్‌లు, మద్యం సీసాలను వాడకూడదని ఏడీఏ తెలిపారు. నీటి నమూనాను తీసే సీసాను అదే నీటితో రెండు మూడు సార్లు బాగా కడిగిన అనంతరం నీరు నింపుకుని రావాలన్నారు. కాలువలు లేదా చెరువులు నుంచి నీటి నమూనా తీసేటప్పుడు ఒక పెద్ద కర్రకు చిన్న బకెట్‌ను కట్టి ఒడ్డుకు దూరంగా నీటిని తీయాలన్నారు. ఆ నీటితో సీసాను రెండు మూడు సార్లు కడిగి ఆ తరువాత నమూనాతో నింపాలన్నారు. సాగునీటి నాణ్యత పరీక్ష కోసం నమూనాను వెంటనే చేరేటట్లు సమీప భూసార పరీక్ష కేంద్రానికి పంపాలన్నారు. నమూనాతో పాటు రైతు పేరు, సర్వే నంబరు, బోరు లేక కాలువల వివరాలు, గ్రామం, మండలం తదితర విషయాలు తెలియచేయాలన్నారు. సేకరించిన రోజే పరీక్షా కేంద్రానికి అందజేయాలని ఏడీఏ చెప్పారు. -
ఎరువుల వాడకం తగ్గించాలి
దగదర్తి : రైతులు సాగులో రసాయనికి ఎరువుల వాడకం తగ్గించాలని, ప్రకతి వ్యవసాయంపై దష్టిసారించాలని కావలి వ్యవసాయశాఖ ఏడీఏ కుప్పయ్య అన్నారు. మండలంలో ప్రకతి వ్యవసాయంపై రైతులకు బుధవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈసందర్భంగా కుప్పయ్య మాట్లాడుతూ భవిష్యత్ వ్యవసాయం అంతా ప్రకతి సేద్యంపైనే ఆధారపడి ఉండబోతుందన్నారు. రైతులు అవగాహన లోపంతో రసాయనిక ఎరువులు విచ్చలవిడిగా వినియోగించడం ద్వారా అనర్థాలు ఎదురవుతాయన్నారు. ప్రకతి వ్యవసాయం ద్వారా తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులు సాధించవచ్చని వివరించారు. రైతులు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయాధికారి శ్రీనువాసులురెడ్డి, ఎంపీఈఓ పాల్గొన్నారు. -
‘రెండు రోజులకే ఎత్తివేస్తారా’
అల్లాదుర్గం: వ్యవసాయ శాఖ డివిజన్ ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసి, ఏడీఏను నియమించిన రెండు రోజులకే కార్యాలయాన్ని ఎత్తి వేశారంటూ రైతులు ఆందోళనకు దిగారు. వివరాలివీ...మెదక్ జిల్లా అల్లాదుర్గంను వ్యవసాయ డివిజన్‌గా ఏర్పాటు చేస్తూ ఈనెల 2వ తేదీన వ్యవసాయ శాఖ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. అల్లాదుర్గం ఏడీఏగా మాధవిని నియమించారు కూడా. కార్యాలయ భవనం కోసం ఆ శాఖ అధికారులు అల్లాదుర్గంలో వెతకడం మొదలు పెట్టారు. ఇలా రెండు రోజులు గడవక ముందే అల్లాదుర్గం డివిజన్‌ను రద్దు చేస్తున్నట్లు ఉత్తర్వులు వచ్చాయి. శుక్రవారం విషయం తెలుసుకున్న రైతులు అగ్రహం వ్యక్తం చేస్తూ హైదరాబాద్-అకోలా రహదారిపై రాస్తారోకో చేశారు. పోలీసులు రైతులతో మాట్లాడి ఆందోళన విరమింప చేశారు. అనంతరం రైతులు తహశీల్దార్ కార్యాలయానికి వెళ్లి తహశీల్దార్ చక్రవర్తికి వినతి పత్రం అందజేశారు. కలెక్టర్ స్పందించాలని లేకుంటే కలెక్టరేట్ ముట్టడిస్తామని హెచ్చరిస్తున్నారు. -
ఓ తాగుబోతు తల్లి నిర్వాకం
అమెరికాలోని ఒక్లహామా.. హైవేలు అధిక సంఖ్యలో ఉన్న రాష్ట్రాల్లో ఒకటి. స్టేట్, ఇంటర్ స్టేట్ అన్నీ కలుపుకుంటే అక్కడి హైవేల సంఖ్య 500పై మాటే! వాటన్నింటిలోకి 1వ నంబర్ హైవేను అత్యంత ప్రమాదకమైనది. ప్రతి ఫర్లాంగ్ కు ఓ భయంకరమైన మూలమలుపు పొంచిఉంటుందా దారిలో! అలాంటి గండరగండ 4 లేన్ రోడ్డుపై.. సీట్లో కూర్చుంటే కనీసం బ్రేకులు కూడా అందని ఓ మూడేళ్ల బాలుడు కారు నడిపాడు. రికార్డు కోసం కాదు.. ప్రాణాలు నిలుపుకునేందుకు. అసలేం జరిగిందంటే.. అదా నగరానికి చెందిన టాలో ఫాస్టర్ (33) అనే మహిళ తన ఇద్దరు కొడుకుల (మూడేళ్ల కవలలు)తో కలిసి ఒక్లహామా సిటీకి బయలుదేరింది. డ్రైవింగ్ చేస్తూ చేస్తూ ఒక్కసారిగా కారులో నుంచి కిందికి పడిపోయింది ఫాస్టర్! లోపలున్న ఇద్దరు పిల్లలూ తల్లి పడిపోవటం, స్టీరింగ్ స్వేచ్ఛగా తిరుగుతుండటం గమనిస్తూనే ఉన్నారు. ఇంతలో ఆ ఇద్దరు పిల్లల్లో ఒకడు.. డ్రైవింగ్ సీట్ పై నిల్చుని స్టీరింగ్ ను కంట్రోల్ చేసే ప్రయత్నం చేశాడు. దాదాపు నాలుగు కిలోమీటర్లు ప్రయాణించిన తర్వాత రోడ్డు పక్కనుండే మట్టిగడ్డను ఢీకొట్టించి కారును ఆపాడు. అటుగా వచ్చిన వేరే కార్లు.. పిల్లాడు డ్రైవింగ్ సీట్లో ఉండటాన్ని గమనించి హైవే పెట్రోలింగ్ పోలీసులకు కబురందించారు. దర్యాప్తులో భయంకరమైన వాస్తవాలు బయటపడ్డాయి.. టాలో ఫాస్టర్ పూటుగా మద్యం సేవించి మత్తులోకి జారుకోవడం వల్లే కారులో నుంచి కిందపడిపోయినట్లు పోలీసులు నిర్ధారించారు. అందుకు సాక్ష్యంగా ఆమె తాగిన మందు బాటిళ్లను కారులో నుంచి స్వాధీనం చేసుకున్నారు. పిల్లల పట్ల నిర్లక్ష్యం వహించినందుకే కాక డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు కూడా ఆమెపై నమోదయింది. అక్టోబర్ 21న ఈ సంఘటన జరిగింది. కోర్టులో జడ్జి చేత చివాట్లు తిన్న ఫాస్టర్ ప్రస్తుతానికి బెయిల్ పై విడుదలైంది. అయితే పిల్లల్ని మాత్రం ఆమెకు అప్పగించేందుకు కోర్టు అంగీకరించలేదు. తుది తీర్పు వచ్చేదాకా పిల్లలిద్దరినీ అమ్మమ్మా తాతయ్యల సంరక్షణలో ఉంచాలని ఆదేశాలు జారీచేసింది. -
స్వాన్ టెలికంలో అడాగ్ వేల కోట్ల పెట్టుబడులు: సీబీఐ వాదన
న్యూఢిల్లీ : స్పెక్ట్రం కుంభకోణం కేసుకు సంబంధించి రిలయన్స్ అనిల్ ధీరుభాయ్ అంబానీ గ్రూప్ (అడాగ్) .. టెలికం సంస్థ స్వాన్ టెలికం (ఎస్టీపీఎల్)లో వేల కోట్లు నిధులు పెట్టిందని సీబీఐ ఆరోపించింది. 2007 మార్చిలో 13 సర్కిళ్లలో 2జీ లెసైన్సుల కోసం ఎస్టీపీఎల్ దరఖాస్తు చేసుకుందని సీబీఐ తెలిపింది. అయితే నికర విలువ నిబంధనల ప్రకారం దానికి అర్హత లేకపోవడంతో అడాగ్ దొడ్డిదారిన కంపెనీకి కోట్లు అందించిందని వివరించింది. ఎస్‌టీపీఎల్‌లో అడాగ్‌కి 9.9 శాతం, మరో సంస్థ టైగర్ ట్రేడర్స్‌కి 90.1 శాతం వాటాలు ఉన్నట్లు చూపిస్తున్నారని. కానీ టైగర్ ట్రేడర్స్ కూడా రిలయన్స్ అడాగ్‌కి చెందిన కంపెనీయేనని తెలిపింది. స్పెక్ట్రం కేసులో సీబీఐ వాదనలు వినిపించింది. తదుపరి వాదనలు జులై 22న కూడా కొనసాగనున్నాయి. -
ప్రభుత్వ సొమ్మంటే లెక్కేలేదా?
బీర్కూర్ : ‘‘ప్రభుత్వ సొమ్మంటే లెక్కలేకుండా పోయింది. నాణ్యమైన సీడ్‌ను అందించాల్సిన సీడ్ ఫాంను భ్రష్టు పట్టించేశారు. పని చేయడం ఇష్టం లేకపోతే ఇంట్లో కూర్చోండి’’ అంటూ బొప్పాస్పల్లి విత్తనోత్పత్తి క్షేత్రం జేడీఏ నర్సింహ, ఏడీఏ సైదులులపై వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి విరుచుకుపడ్డారు. గురువారం సాయంత్రం ఆయన బొప్పాస్పల్లి విత్తన ఉత్పత్తి క్షేత్రాన్ని తనిఖీ చేశారు. సీడ్ ఫాంలో చేస్తున్న పనులను పరిశీలించారు. లక్షలాది రూపాయలు వెచ్చించి నిర్మిస్తున్న వాటర్ పాండ్లను పరిశీలించి పనులపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కాలువ కంటే ఎత్తు ఎక్కువగా ఉంటే నీళ్లు ఎలా నిలువ ఉంటాయని ఆయన ఏడీఏను ప్రశ్నించారు. అనంతరం కాలువ నిర్మాణ పనులతో పాటు సీడ్‌ఫాంలో చేపట్టిన అభివృద్ధి పనులను పరిశీలించారు. కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. విత్తన ఉత్పత్తి క్షేత్రానికి సంబంధించి అభివృద్ధి పనుల కోసం కార్యాలయం నుంచి సుమారు రూ. 2 కోట్ల నిధులు కావాలంటూ తన కార్యాలయానికి ప్రతిపాదనలు వచ్చాయన్నారు. అయితే ఈ ప్రతిపాదనలు దేనికోసం పంపించారని ఆయన ఏడీఏను ప్రశ్నించారు. 475 ఎకరాలు ఉన్న సీడ్ ఫాం భూమికి కంచె నిర్మాణం కోసం రూ. 60 లక్షలతో ప్రతిపాదనలు పంపించారని అయితే ఈ రూ. 60 లక్షలు ఎందుకు కావాలో తనకు తెలియాలని ప్రశ్నించారు. ప్రతిపాదనలు పంపిన విషయం తన దృష్టికి రాలేదని జేడీఏ సమాధానమిచ్చారు. కింది స్థాయి అధికారులు ఏ ప్రతిపాదనలు పంపుతున్నారో తెలియకపోతే మీరంతా ఎందుకు ఉన్నారంటూ మంత్రి మండిపడ్డారు. పంట భూమిని నాశనం చేశారు బ్రహ్మాండంగా పంటలు పండే భూమిని గుంతలు తవ్వి నాశనం చేశారని, పని చేయడం ఇష్టం లేకపోతే ఉద్యోగానికి రాజీనామా చేసి ఇంట్లో కూర్చోవాలని మంత్రి పోచారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక సందర్భంలో తన చేతిలో ఉన్న ఫైల్‌ను సైతం ఆయన విసిరి కొట్టారు.. ఇప్పటికే భూమి మొత్తం నాశనం అయిందని మరో రూ. 20 లక్షలు కావాలని ప్రతిపాదనలు పంపించారని, ఈ డబ్బులు ఇస్తే ఏం చేస్తారని ఆయన ప్రశ్నించారు. మంత్రి అడిగిన ఏ ప్రశ్నకూ ఏడీఏ వద్ద సమాధానం లేకపోవడంతో.. ఏం చేస్తే మీరు మారతారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సీడ్‌ఫాంలో ఉన్న బోర్లు పూర్తిగా ఎత్తిపోయాయని, వాటిని బాగు చేయించే దిక్కు లేదు కాని మరికొన్ని బోర్లు వేయడానికి నిధులు కావాలా అని నిలదీశారు. పని చేయకుండానే జీతం తీసుకునే అలవాటు అధికారుల్లో ఎక్కువ అయ్యిందని, ఇది మంచి పద్ధతి కాదని మంత్రి పేర్కొన్నారు. గతంలో వచ్చిన నిధులతో ఏ ఏ పనులు చేశారని ఆయన ఏడీఏను అడిగారు. వంతుల వారీగా డబ్బులు పంచుకుంటూ ప్రభుత్వ సొమ్మును దోచుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీడ్‌ఫాంకు సంబంధించిన 475 ఎకరాల్లో సుమారు 225 ఎకరాల్లో పంటలు పండించవ చ్చని, అయితే ఇంత వరకు ఒక్క ఎకరంలో అరుునా పంటలు పండించిన దాఖలాలు కనిపించడం లేదని పేర్కొన్నారు. ఈ సీడ్ఫాం భూమి ద్వారా రెండు జిల్లాలకు సోయా విత్తనాలు అందించవచ్చన్నారు. అయితే అధికారుల నిర్లక్ష్యం ఫలితంగా సోయా విత్తనాలు ఇతర ప్రాంతాల నుంచి కొనుగోలు చేయాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. ఏడీఏను వెంటనే మార్చండి ప్రస్తుతం ఉన్న ఏడీఏ సైదులును వెంటనే ఇక్కడి నుంచి పంపించివేయాలని, ఆయన స్థానంలో మరో రెగ్యులర్ ఏడీఏను, ఇతర సిబ్బందిని నియమించాలని జేడీఏ నిర్సింహను మంత్రి ఆదేశించారు. సిబ్బంది స్థానికంగా ఉండేలా క్వార్టర్లకు సైతం మరమ్మతులు చేయించాలని సూచించారు. మంత్రి కాలికి గాయం సీడ్ఫాంను పరిశీలించేందుకు వచ్చిన మంత్రి పోచారం కాలికి కర్ర గుచ్చుకోవడంతో ఆయన స్వల్పంగా గాయపడ్డారు. వెంటనే స్థానిక నాయకులు ఆయనకు ప్రథమ చికిత్స చేరుుంచారు. ఆయన వెంట స్థానిక సర్పంచ్ రాములు, జడ్పీటీసీ సభ్యుడు కిషన్ నాయక్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శ్రీనివాస్, ఎంపీటీసీ సభ్యుడు కంది మల్లేశ్, నాయకులు సతీశ్, బస్వరాజ్, హన్మంతు తదితరులున్నారు.