‘యాంట్‌’ వార్‌! | Activists stage anti-tourism protest in Menorca | Sakshi
Sakshi News home page

‘యాంట్‌’ వార్‌!

Jul 5 2026 2:02 AM | Updated on Jul 5 2026 2:02 AM

Activists stage anti-tourism protest in Menorca

‘చలి చీమల చేత జిక్కి చావదే పాము’ అన్నట్లు, స్పెయిన్ లోని అందమైన విహారదీవి మెనోర్కాలో చీమల దండయాత్ర మొదలైంది. వేలాది ‘చీమలు’ రోడ్లపైకి వచ్చి పర్యాటకులపై నిరసన వ్యక్తం చేశాయి! అయితే అవి నిజమైన చీమలు కాదు, చీమల వేషాలు వేసుకున్న స్థానికులే! చేతుల్లో ‘పర్యాటకం మమ్మల్ని నలిపేస్తోంది’, ‘మా ఇళ్ల నుంచి మమ్మల్ని వెళ్లగొడుతున్నారు’ వంటి నినాదాలతో వారు ప్రభుత్వం మీద ఆగ్రహం వ్యక్తం చేశారు.

 ఒకప్పుడు పర్యాటకులను ఆహ్వానించిన ఈ దీవి ప్రజలు ఇప్పుడు ‘చాలు బాబోయ్‌!’ అంటున్నారు. కారణం... ఇళ్ల అద్దెలు ఆకాశాన్నంటడం, జీవన వ్యయం పెరగడం, నీటి సమస్యలు తీవ్రమవడం, స్థానికులకు అందుబాటులో ఇళ్లు దొరకకపోవడం. పర్యాటకులను ఆకర్షించేందుకు ప్రభుత్వం రోజుకు లక్షల రూపాయలు ఖర్చు చేస్తుండగా, స్థానికుల సమస్యలపై మాత్రం అంతగా దృష్టి పెట్టడం లేదని వాపోతున్నారు.

అయితే, ప్రపంచమంతా ‘ఇక్కడికి రండి!’ అంటూ పర్యాటకులను ఆహ్వానిస్తుంటే, మెనోర్కా ప్రజలు మాత్రం ‘ఇంకెవరూ రావద్దు!’ అంటూ నిరసనలకు దిగడం ఇప్పుడు సోషల్‌ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. పర్యాటకం అభివృద్ధికి ఎంత అవసరమో, స్థానికుల జీవన నాణ్యత కూడా అంతే ముఖ్యమనే విషయాన్ని ఈ చీమల దండయాత్ర మరోసారి గుర్తు చేస్తోంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement