సత్తాచాటిన ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ
సాక్షి ప్రతినిధి, ఏలూరు : జిల్లాలో పరిషత్ కౌంటింగ్ ప్రక్రియ శనివారం రాత్రి వరకు కొనసాగింది. జిల్లాలో కూటమి పార్టీ అభ్యర్థులు అత్యధిక స్థానా లు గెలుపొందారు. అనేక ప్రతిఘటనలు, తీవ్ర బెదిరింపులు, ప్రలోభాలను దాటుకుని ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ 105 ఎంపీటీసీ స్థానాలు, 3 జెడ్పీటీసీ స్థానాలను కై వసం చేసుకుంది. ప్రధానంగా జీలుగుమిల్లి, కామవరపుకోటలో ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ మెజార్టీ సీట్లు సాధించి సత్తాచాటింది. జిల్లా వ్యాప్తంగా 454 ఎంపీటీసీ స్థానాల్లో ఏకగ్రీవాలు మి నహా 441 స్థానాలకు, అలాగే 27 జెడ్పీటీసీ స్థానాలకుగాను పెదవేగి ఏకగ్రీవం మినహా 26 స్థానాలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ నిర్వహించారు.
జిల్లాలో మూడు చోట్ల..
ఏలూరు డివిజన్‌కు సంబంధించి సీఆర్‌రెడ్డి ఇంజనీరింగ్, పాలిటెక్నిక్ కళాశాలలో, నూజివీడు డివిజన్ కు సంబంధించి సారథి ఇంజనీరింగ్ కళాశాల, జంగారెడ్డిగూడెం డివిజన్‌కు సంబంధించి నోవా ఇంజనీరింగ్ కళాశాలలో శనివారం ఉదయం 8 గంటలకు ప్రారంభించారు. అనేక చోట్ల ఇబ్బందులు తలెత్తడం, కొన్ని ఎంపీటీసీ స్థానాలకు రీకౌంటింగ్, ఇతరత్రా కారణాలతో కౌంటింగ్ శనివారం రాత్రి 11.30 గంటల వరకు కొనసాగింది. జిల్లా వ్యాప్తంగా మొదట 23 మండలాల్లో 22 జెడ్పీటీసీలు, 441 ఎంపీటీసీ స్థానాల్లో 11.62 లక్షల ఓటర్లకుగాను 8.77 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. దీంతో 75.52 శాతం పోలింగ్ నమోదైంది. అలాగే మలి విడతలో ఏజెన్సీలోని నాలుగు మండలాల్లో నాలుగు జెడ్పీటీసీ, 40 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నిక జరగ్గా 1.18 లక్షల మంది ఓటర్లకుగాను 82,634 మంది ఓటు హక్కు వినియోగించుకోవడంతో 69.92 శాతం పోలింగ్ నమోదైంది. ఈ క్రమంలో శనివారం జరిగిన కౌంటింగ్ ప్రక్రియలో ఏకగ్రీవాలతో కలిపి తెలుగుదేశం పార్టీ 265 స్థానాలు, వైఎ స్సార్‌సీపీ 105 ఎంపీటీసీ స్థానాలు, జనసేన 72 స్థానాలు, బీజేపీ 6, ఏజెన్సీ ప్రాంతంలో సీపీఐ 2, సీపీఎం 2, ఇతరులు 4 స్థానాల్లో గెలుపొందారు.
ఏలూరులో కౌంటింగ్ ప్రక్రియను పరిశీలిస్తున్న కలెక్టర్ వెట్రిసెల్వి
ఏలూరు సీఆర్‌రెడ్డి ఇంజనీరింగ్ కాలేజీ వద్ద కౌంటింగ్ ప్రక్రియ
కోర్సా బాలకృష్ణ, బుట్టాయగూడెం జెడ్పీటీసీ
కోర్సా సూరమ్మ, జీలుగుమిల్లి జెడ్పీటీసీ
జీలుగుమిల్లి, కామవరపుకోటలో సత్తాచాటిన వైఎస్సార్‌సీపీ
పోలవరం ఎమ్మెల్యే సొంత మండలంలో కూటమికి షాక్
105 ఎంపీటీసీ స్థానాల్లో వైఎస్సార్‌సీపీ విజయం
జీలుగుమిల్లి, బుట్టాయగూడెం, వేలేరుపాడు జెడ్పీటీసీలు కై వసం
6 స్థానాల్లో బీజేపీ, 4 స్థానాల్లో వామపక్షాలు, 4 స్థానాల్లో స్వతంత్రులు
6 ఎంపీటీసీ స్థానాల్లో కూటమి గెలుపు
కూటమి అధికార బలంతో జిల్లాలో బెదిరింపులు, దౌర్జన్యకాండకు అనేక చోట్ల తెగబడింది. వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టారు. ఇలాంటి పరిస్ధితుల్లోనూ కామవరపుకోట, జీలుగుమిల్లిలో వైఎస్సార్‌సీపీ సత్తాచాటింది. చింతలపూడి, నూజివీడు, బుట్టాయగూడెం, వేలేరుపాడులో మండలాల్లో బలమైన పోటీ ఇచ్చింది. ప్రధానంగా కామవరపుకోట మండలంలో 16 స్థానాలకుగాను 9 ఎంపీటీసీలను కై వసం చేసుకుంది. అలాగే జీలుగుమిల్లిలో 9 ఎంపీటీసీ స్థానాలకుగాను 7 ఎంపీటీసీ స్థానాలు కై వసం చేసుకుంది. అలాగే జీలుగుమిల్లి, బుట్టాయగూడెం, వేలేరుపాడు మూడు జెడ్పీటీసీ స్థానాలు, మూడు ఎంపీపీ స్థానాలను వైఎస్సార్‌సీపీ గెలుచుకుంది. ఇక పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజుకు జీలుగుమిల్లి మండలంలో ఘోర పరాభవం ఎదురైంది. కూటమి అభ్యర్థులు 9 స్థానాల్లో పోటీ చేసి 2 స్థానాలకే పరిమితమయ్యారు.


