మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు
బుట్టాయగూడెం: జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో అధికార పార్టీ బెదిరింపులకు భయపడకుండా, ప్రలోభాలకు లొంగకుండా వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల విజయానికి అహర్నిశలు కృషి చేసిన పార్టీ శ్రేణులు, అభిమానులకు పోలవరం మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ సమన్వయకర్త తెల్లం బాలరాజు శనివారం ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల ఆశీస్సులతో ఘన విజయం సాధించిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓటమి పాలైన అభ్యర్థులు, వారి గెలుపు కోసం శ్రమించిన కార్యకర్తలు ఎవరూ నిరుత్సాహపడవద్దని సూచించా రు. పార్టీ కోసం కష్టపడి పనిచేసిన ప్రతి కార్యకర్తకు, నాయకుడికి వైఎస్సార్‌సీపీలో ఎల్లప్పు డూ సముచిత గుర్తింపు, గౌరవం, తగిన స్థానం ఉంటాయని భరోసా ఇచ్చారు. రాజకీయాల్లో గెలుపు, ఓటములు సహజమని, నిరంతరం ప్రజల పక్షాన నిలిచి పోరాటం కొనసాగిస్తూ పార్టీ బలోపేతానికి ఐక్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. అంకితభావంతో పనిచేసిన ప్రతిఒక్కరికీ ధన్యవాదాలు తెలపడంతో పాటు, వారి సేవలను పార్టీ ఎప్పటికీ గుర్తుంచుకుంటుందని కొనియాడారు.


