డిసెంబర్‌ 11 నుంచి జాతీయ నృత్యోత్సవాలు | - | Sakshi
Sakshi News home page

డిసెంబర్‌ 11 నుంచి జాతీయ నృత్యోత్సవాలు

Nov 8 2026 4:41 AM | Updated on Nov 8 2026 4:41 AM

డిసెంబర్‌ 11 నుంచి జాతీయ నృత్యోత్సవాలు ఎల్‌ఎన్‌డీపేట రిజర్వాయర్‌ నుంచి నీరు విడుదల జల్లేరు నీరు విడుదల ముగిసిన టెన్నిస్‌ టోర్నీ

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఏలూరులో అభినయ నృత్యభారతి 31వ జాతీయస్థాయి నృత్యోత్సవాలు వచ్చేనెల 11 నుంచి మూడు రోజులపాటు నిర్వహించనున్నట్టు సంస్థ గౌరవ అధ్యక్షుడు అంబికా కృష్ణ, అధ్యక్షుడు మనోహర్‌ గోపాల్‌ లునాని, వ్యవస్థాపక కార్యదర్శి నా ట్యాచార్య దువ్వి హేమసుందర్‌ తెలిపారు. స్థానిక హేలాపురి లయన్స్‌ క్లబ్‌లో శనివారం ఆహ్వాన పత్రాలను లయన్స్‌ ఇంటర్నేషనల్‌ డైరెక్టర్‌ పర్వతనేని సుభాష్‌ బాబు విడుదల చేశారు. సుమారు 100 మందితో నిర్వహణ కమిటీ ఏర్పాటు చేశామని, నృత్యోత్సవాలకు 10 రాష్ట్రాలకు చెందిన కళాకారులు, నృత్య పోటీలకు ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన 400 మంది హాజరవుతారన్నారు. అలాగే పలువురికి నృత్య కౌముది, సేవా తపస్వి, నృత్య తపస్వి, అభినయ సీ్త్ర శక్తి పురస్కారాలు అందజేస్తామన్నారు. పోటీల్లో విజేతలకు బహుమతులు, నగదు అందిస్తామన్నారు. సుభాష్‌ బాబు మాట్లాడుతూ 30 ఏళ్లుగా నగరంలో శాసీ్త్రయ నృత్యాలకు పెద్దపీట వేస్తూ అభినయ నృత్య భారతి వ్యవస్థాపకుడు దువ్వి హేమసుందర్‌ చేస్తున్న సేవలు ప్రశంసనీయమన్నారు. లయన్స్‌ జిల్లా గవర్నర్‌ డి.సుబ్బారావు, సరస్వతి దంపతులు, పూర్వపు గవర్నర్‌ మురళీమోహనరావు, జిల్లా నాయకులు లేళ్ల వెంకటేశ్వరరావు, కేబీ రావు, కానాల శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

పోలవరం రూరల్‌ : పాపికొండల అభయారణ్య ప్రాంతంలో కురిసిన భారీ వర్షాలకు ఎల్‌ఎన్‌డీపేట రిజర్వాయర్‌లో నీరు చేరుతోంది. రిజర్వాయర్‌ నుంచి 200 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. దీంతో సాగిపాడు, దొండపూడి గ్రామాల మధ్య లోలెవల్‌ కాజ్‌వే వద్ద వరద నీరు ఉధృతంగా ప్రవహించడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఎన్నికల సిబ్బంది, పార్టీల నాయకులు, ఉద్యోగులు పోలవరం చేరుకోవడానికి తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

బుట్టాయగూడెం: భారీ వర్షాలతో ఏజెన్సీ ప్రాంతంలోని జల్లేరు జలాశయంలోకి వరద నీరు వచ్చి చేరుతోంది. శనివారం రాత్రి 10 గంటలకు స్పిల్‌ వే ద్వారా 300 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు.జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 217.80 మీటర్లు కాగా.. ప్రస్తుతం 217 మీటర్లకు చేరుకుంది. జలాశయంలోకి ప్రస్తుతం 208 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా అప్రమత్తమైన అధికారులు గేట్లను ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. దిగువ ప్రాంతాల ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. వాగులు, వంకలు దాటే ప్రయత్నం చేయవద్దని నీటిపారుదల శాఖ అధికారి సురేష్‌ హెచ్చరించారు.

భీమవరం : క్రీడాకారులను ప్రోత్సహించడానికి కాస్మోపాలిటన్‌ క్లబ్‌ కృషి అభినందనీయమని కలెక్టర్‌ సీహెచ్‌ నాగరాణి అన్నారు. పట్టణంలోని కాస్మోపాలిటన్‌ క్లబ్‌లో ఏఐటీఏ మెన్‌, ఉమెన్‌ జాతీయస్థాయి టెన్నిస్‌ టోర్నీ విజేతలకు శనివారం బహుమతులు అందజేశారు. ముఖ్య అతిథిగా కలెక్టర్‌ నాగరాణి హా జరై మాట్లాడుతూ క్రీడల నిర్వహణకు అందిస్తున్న ప్రోత్సాహం స్ఫూర్తిదాయకమన్నారు. కాస్మోపాలిటన్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో మరిన్ని క్రీడా పోటీలు నిర్వహించాలని ఆకాంక్షించారు. కా స్మోపాలిటన్‌ క్లబ్‌ అధ్యక్షుడు సీహెచ్‌ రామభద్రిరాజు, టోర్నమెంట్‌ కమిటీ చైర్మన్‌ యు.కృష్ణప్రసాద్‌, వైస్‌ చైర్మన్‌ టి.కృష్ణబాబు, బీహెచ్‌ సుబ్బరాజు తదితరులు పాల్గొన్నారు.

విజేతలు వీరే..

పురుషుల సింగిల్స్‌లో డి.శ్రీకర్‌, మహిళల సింగిల్స్‌లో హర్షిణి నాగరాజ్‌, మెన్స్‌ డబుల్స్‌లో ఐ.ప్రసాద్‌–పరితోష్‌ పవార్‌, ఉమెన్స్‌ డబుల్స్‌లో జనని రమేష్‌–హర్షిణి నాగరాజ్‌ విజేతలుగా నిలిచారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement