లోకేష్‌ రాజీనామా చేయాల్సిందే | - | Sakshi
Sakshi News home page

లోకేష్‌ రాజీనామా చేయాల్సిందే

Jul 29 2026 12:58 AM | Updated on Jul 29 2026 12:58 AM

రహదారి ప్రమాదాలు నివారించాలి లక్ష్యానికి దూరం.. మిషన్‌ సక్షం

న్యూస్‌రీల్‌

రహదారి ప్రమాదాలు నివారించాలి
జిల్లాలో అధికంగా ప్రమాదాలు జరిగే బ్లాక్‌ స్పాట్‌లను గుర్తించి, వాటి నివారణకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌, ఎస్పీ అధికారులను ఆదేశించారు. 8లో u

ఏలూరులో వైఎస్సార్‌సీపీ విద్యార్థి, యువజన సంఘాల ఆందోళన

డీఎస్సీ అక్రమాలపై సీబీఐ దర్యాప్తునకు డిమాండ్‌

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘మిషన్‌ సక్షం అంగన్‌వాడీ’ పథకం క్షేత్రస్థాయిలో తూతూమంత్రంగా మారుతోందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 8లో u

బుధవారం శ్రీ 29 శ్రీ జూలై శ్రీ 2026

ఏలూరు టౌన్‌: ఏపీలో మెగా డీఎస్సీ –25లో అంతులేని అక్రమాలు, అవినీతి, కుంభకోణానికి నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి నారా లోకేష్‌ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తూ వైఎస్సార్‌సీపీ యువజన, విద్యార్థి విభాగ నేతలు, పార్టీ నేతలు, శ్రేణులు రోడ్డెక్కాయి. వైఎస్సార్‌సీపీ జిల్లా యువజన విభాగ అధ్యక్షుడు కామిరెడ్డి నాని, విద్యార్థి విభాగం అధ్యక్షుడు పాతినవలస రాజేష్‌ ఆధ్వర్యంలో ఏలూరులో భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరై నాయకత్వం వహించారు. పార్టీ జిల్లా కార్యాలయం నుంచి జిల్లా వ్యాప్తంగా ఏడు నియోజకవర్గాల నుంచి వచ్చిన పార్టీ నేతలు, శ్రేణులతో కలిసి ఏలూరు రైల్వే ఫ్లైఓవర్‌ బ్రిడ్జి మీదుగా ర్యాలీగా ఏలూరు పాతబస్టాండ్‌ సెంటర్‌కు చేరుకున్నారు. బీఆర్‌ అంబేద్కర్‌ సెంటర్‌లో రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు. ఈ ఆందోళన కార్యక్రమంలో.. ఏలూరు నగర అధ్యక్షుడు గుడిదేశి శ్రీనివాసరావు, కై కలూరు పరిశీలకుడు నూకపెయ్యి సుధీర్‌బాబు, చింతలపూడి పరిశీలకుడు దాసరి రమేష్‌, దెందులూరు నియోజకవర్గ నేత వెంకటేశ్వరరావు, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి సొంగ సందీప్‌, వైఎస్సార్‌సీపీ నాయకులు శెట్టి రాజా, కందుల దినేష్‌ రెడ్డి, జాన్‌ గురునాథ్‌, ఇంజేటి నీలిమ, ఆళ్ళ సతీష్‌ చౌదరి, నెరుసు చిరంజీవి, తేరా ఆనంద్‌, పల్లి శ్రీనివాస్‌, చిక్కాల దుర్గాప్రసాద్‌, భోగిశెట్టి పార్వతి, స్టాన్లీబాబు, పుప్పాల గోపి, చప్పిడి వెంకన్న, పసుపులేటి దినేష్‌, గంటా సాయి, కాశీ, మిరియాల దిలీప్‌, చార్లెస్‌, సింహాద్రి చందు, కిట్టు, ఉదయభాస్కర్‌ రాజు, తుమరాడ స్రవంతి, వేదకుమారి, పల్లెం ప్రసాద్‌, గొల్ల కిరణ్‌, కట్టా ఏసుబాబు తదితరులు పాల్గొన్నారు.

ఏలూరులో వైఎస్సార్‌సీపీ కార్యాలయం నుంచి పాతబస్టాండ్‌ సెంటరుకు ర్యాలీగా వస్తున్న పార్టీ నాయకులు, యువత, విద్యార్థులు

పాతబస్టాండ్‌ సెంటరులో నిరసన తెలుపుతున్న జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు, ఉంగుటూరు సమన్వయకర్త వాసుబాబు, ఏలూరు సమన్వయకర్త జయప్రకాష్‌ తదితరులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement