సింగిల్‌గా ఆడేసుకుంటున్నారు | - | Sakshi
Sakshi News home page

సింగిల్‌గా ఆడేసుకుంటున్నారు

May 6 2026 8:19 AM | Updated on May 6 2026 8:19 AM

8లో

వడదెబ్బతో ప్రాణాలకు ముప్పు

8లో

న్యూస్‌రీల్‌

బుధవారం శ్రీ 6 శ్రీ మే శ్రీ 2026

సాక్షి, భీమవరం: తమిళనాడు ఎన్నికల ఫలితాలు జనసేనకు సెగ పుట్టిస్తున్నాయి. సినీ హీరో విజయ్‌ తమిళగ వెట్రి కళగం(టీవీకే) స్థాపించిన రెండేళ్లకే భారీ విజయాన్ని సొంతం చేసుకోవడం హాట్‌ టాఫిక్‌గా మారింది. సోషల్‌ మీడియాలో ఇప్పుడు ఎక్కడ చూసినా జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ పొత్తుల తీరు, టీవీకే అధ్యక్షుడు విజయ్‌ ఒంటరి పోరు గురించి చర్చ నడుస్తోంది.

2024 సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ టీడీపీ, బీజేపీతో కలిసి కూటమిగా జతకట్టడం తెలిసిందే. రాష్ట్రంలో కేవలం 21 సీట్లకు పరిమితమైన ఆ పార్టీ తమకు పట్టుందని చెప్పుకునే జిల్లాలో ఏడు నియోజకవర్గాలకు మూడింట మాత్రమే పోటీ చేసింది. పేరుకు భీమవరం, తాడేపల్లిగూడెం, నరసాపురంలలో జనసేన పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నా టీడీపీ నేతల హవానే నడుస్తోందన్న అసంతృప్తి కేడర్‌లో ఉంది. ఆయా నియోజకవర్గాల్లో జనసేన ఎమ్మెల్యేలకు పోటీగా టీడీపీ నేతలు సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కుల పంపిణీతో పాటు ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే తాడేపల్లిగూడెంలో జనసేన, టీడీపీ మధ్య వివాదాలు రచ్చకెక్కాయి. మరోపక్క టీడీపీ ఎమ్మెల్యేలు గెలుపొందిన పాలకొల్లు, తణుకు, ఆచంట, ఉండిలో తమకు తగిన ప్రాధాన్యం లేదన్న నైరాశ్యంలో జనసేన శ్రేణులు ఉన్నారు. తాము జెండాలు మోస్తే గెలుపొందిన వారు తమను పరిగణనలోకి తీసుకోవడం లేదన్న ఆవేదనతో కేడర్‌ చాలావరకు సైలెంటైపోయారు. టీడీపీతో పొత్తుపై లోలోపలే అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఈ తరుణంలో తమిళనాడు ఎన్నికల ఫలితాలు వారిని ఆలోచనలో పడేస్తాయని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. విజయ్‌ ఒంటరిగా బరిలోకి దిగి రెండు జాతీయ పార్టీలు ఢీకొట్టిన వైనాన్ని తమ అధినేత పవన్‌తో బేరీజు వేసుకుంటున్నారు.

నెట్టింట ట్రోల్స్‌

తమిళనాడు ఎన్నికల్లో సినీ హీరో విజయ్‌ ఏ పార్టీలతో పొత్తు పెట్టుకోకుండా ఒంటరిగా పోటీచేసి గెలుపొందడాన్ని నెటిజన్లు పవన్‌తో పోలుస్తున్నారు. రెండేళ్ల పసికూన సింగిల్‌గా సత్తా చాటితే జనసేన పార్టీ పెట్టి 12 ఏళ్లయినా ఇంకా పొత్తుల కోసం పాకులాడుతోందంటున్నారు. ‘ఇంకో పార్టీ జెండాలు మీతో మోయించను, మీ ఆత్మాభిమానాన్ని దెబ్బతీయనంటూ’ విజయ్‌ తన అభిమానులు, పార్టీ కేడర్‌లో ధైర్యాన్ని నింపి విజయం సాధిస్తే.. మరో 15 ఏళ్లు కూటమి పొత్తు సాగుతుందంటూ పవన్‌ పదే పదే ప్రకటనలు చేస్తున్నారంటూ నెటిజన్లు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ‘సింహం సింగిలైనా కింగ్‌ ఆఫ్‌ జంగిల్‌ ’ అంటూ విజయ్‌ చెప్పిన మాటలు.. సింహం ముసలిదయ్యాక సింగిల్‌గా తిరుగుతుందన్న పవన్‌ పలుకులకు తమ సృజనాత్మకను జోడిస్తున్నారు. సినిమాల్లోని హాస్య సన్నివేశాలను జోడిస్తున్నారు. హీరో ఎవరు? జీరో ఎవరంటూ రకరకాల క్యాప్సన్లు జతచేస్తున్నారు. సింహాలు సింగిల్‌గా వస్తాయంటూ మాజీ సీఎం వైస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, విజయ్‌ కలిసి ఉన్న చిత్రాలు, ఎన్నికల ప్రచారంలో అభిమాని ఇచ్చిన జగన్‌, విజయ్‌ల చిత్రపటాన్ని విజయ్‌ చూపిస్తున్న వీడియోలను షేర్‌ చేస్తున్నారు. ఇప్పుడు ఫేస్‌బుక్‌, ఇన్‌స్టా, యూట్యూబ్‌ తదితర సామాజిక మాద్యమాల్లో తమిళనాడు ఫలితాలు పవన్‌ పొత్తుల పాకులాటపై రీల్స్‌ ట్రెండింగ్‌లో ఉన్నాయని చెప్పవచ్చు. వీటికి అధిక సంఖ్యలో లైక్‌లు, షేర్‌లు, వ్యూస్‌, కామెంట్లు వస్తుండటం గమనార్హం.

ఇదిలా ఉండగా తమిళనాడు ఎన్నికల్లో బీజేపీ, అన్నాడీఎంకేలకు మద్దతుగా చంద్రబాబు ప్రచారంలో పాల్గొన్న విషయం తెలిసిందే. ఆయన ప్రచారం చేసిన నియోజకవర్గాల్లో ఎన్డీఏ అభ్యర్థులు పరాజయం పాలవ్వడంతో ట్రోల్స్‌ సెగ చంద్రబాబును తాకుతోంది. ప్రచారంలో భాగంగా తమిళంలో ఆయన ప్రసంగాల తాలుకూ వీడియోలకు ఫన్నీ సన్నివేశాలను జోడించి ‘మీరు ప్రచారం చేసిన చోట్ల ఓడిపోవడమేమిటి’ బాబుగారు అంటూ క్యాప్సన్లు జోడించిన రీల్స్‌ సోషల్‌ మీడియాలో సర్క్యులేట్‌ అవుతున్నాయి.

విజయ్‌ ప్రచారంలో వైఎస్‌ జగన్‌తో ఉన్న ఫొటో చూపిస్తున్న దృశ్యం

అధిక ఉష్ణోగ్రతలతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. వడదెబ్బతో రోడ్లు నిర్మానుష్యంగా మారుతున్నాయి. ఎండలు ఆక్వా సాగుపై కూడా ప్రభావం చూపుతున్నాయి.

జనసేనకు తమిళనాడు ఎన్నికల సెగ

విజయ్‌ ఒంటరి పోరును పవన్‌తో పోలుస్తున్న నెటిజన్స్‌

హీరో ఎవరంటూ సైటెర్లు

పవన్‌ పాత పలుకులకు సినీ డైలాగ్స్‌ జోడించి రీల్స్‌

చంద్రబాబును వదలని ట్రోలర్స్‌

సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌లో వీడియోలు

Advertisement
 
Advertisement
Advertisement