కూటమి కనికుట్టు | - | Sakshi
Sakshi News home page

కూటమి కనికుట్టు

Feb 26 2026 7:44 AM | Updated on Feb 26 2026 7:44 AM

కూటమి

కూటమి కనికుట్టు

భారీ మొత్తానికి కట్టబెట్టి..

న్యూస్‌రీల్‌

మహిళల స్వయం ఉపాధి కల్పన లక్ష్యంగా కుట్టుమెషీన్లు అందించనున్నట్టు గతంలో ప్రచారం చేసుకున్న చంద్రబాబు ప్రభుత్వం ఇప్పుడు ఆ ఊసే ఎత్తడం లేదు. ఈ పథకం కింద శిక్షణ పూర్తిచేసుకున్న మహిళలు వాటి కోసం నెలల తరబడి ఎదురు చూస్తున్నారు. కుట్టుమెషీన్లు ఎప్పుడు వస్తాయంటూ..? కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.

గురువారం శ్రీ 26 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026

సాక్షి, భీమవరం: ఉమ్మడి జిల్లావ్యాప్తంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో పేద మహిళలకు స్వయం ఉపాధి కల్పన పేరిట కూటమి ప్రభుత్వం బీసీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో గతేడాది ఉచిత కుట్టుశిక్షణ కార్యక్రమం చేపట్టిన విషయం విదితమే. శిక్షణ అనంతరం మహిళలకు కుట్టుమెషీన్లు అందజేస్తామన్నారు. పశ్చిమగోదావరి జిల్లా నుంచి 3,486, ఏలూరు నుంచి 3,259 మంది కలిపి ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 6,745 మందిని ఎంపిక చేశారు. వీరిలో బీసీ సామాజిక వర్గానికి చెందిన మహిళలు 4,516 మంది, బ్రాహ్మణ సామాజిక వర్గం 28 మంది, కమ్మ 211, కాపు 1,711, రెడ్డి 86, ఆర్యవైశ్య 87, క్షత్రియ 50, ఈబీసీ 56 మంది మహిళలు ఉన్నారు.

మెషీన్లు కోసం ఎదురుచూపులు

శిక్షణ పొందిన వారికి కుట్టుమెషీన్లు అందజేయాల్సి ఉంది. ఆరు నెలలు కావస్తున్నా కుట్టుమెషీన్లు పంపిణీ చేయలేదు. వ్యయ ప్రయాసల కోర్చి కేంద్రాలకు చేరుకుని శిక్షణ పొందిన మహిళలు ఇళ్ల వద్ద ఖాళీగా ఎదురు చూడాల్సి వస్తోంది. కుట్టుమెషీన్లు ఎప్పుడు వస్తాయంటూ కొందరు కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తుండగా మరికొందరు కలెక్టరేట్ల వద్ద జరిగే పీజీఆర్‌ఎస్‌లలో ఫిర్యాదులు చేస్తున్నారు. ఎన్నో కష్టాల నష్టాల కోర్చి కేంద్రాలకు చేరుకుని శిక్షణ తీసుకున్నామని, నెలలు గడుస్తున్నా ఇప్పటివరకు కుట్టు మెషీన్లు అందజేయలేదని మహిళలు చెబుతున్నారు. కాగా శిక్షణ పూర్తయ్యిందని, ఏజెన్సీల నుంచి కుట్టుమెషీన్లు వచ్చాక మెషీన్లు అందజేస్తామని అధికారులు చెబుతున్నారు.

శిక్షణ నిమిత్తం ఒక్కొక్కరికి రూ.15,599 చొప్పున రూ.10.52 కోట్లు, కుట్టుమెషీన్‌కు రూ.6,199లు చొప్పున రూ.4.18 కోట్లు లెక్కలు కట్టారు. మొత్తంగా ఒక్కొక్కరికి రూ.21,798లు చొప్పున రూ.14.7 కోట్లు వ్యయంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. శిక్షణ నుంచి మెషీన్లు పంపిణీ వరకు మొత్తం కార్యక్రమాన్ని కూటమి ప్రభుత్వం మూడు ప్రైవేట్‌ ఏజెన్సీలకు అప్పగించింది. కేంద్రానికి 144 మంది చొప్పున భీమవరం, ఏలూరు, తణుకు, తాడేపల్లిగూడెం తదితర ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 50 వరకు కేంద్రాలను ఏర్పాటుచేశారు. రోజుకు రెండు బ్యాచ్‌లుగా మూడు నెలల పాటు శిక్షణ ఇచ్చారు. గత మే నెల నుంచి సెప్టెంబరు వరకు విడతలుగా శిక్షణ కార్యక్రమం సాగింది. మహిళలకు సంబంధించిన జాకెట్లు, చిన్నపిల్లల గౌన్స్‌, జుబ్బాలు తదితర వాటిలో శిక్షణ ఇచ్చారు. అందుకు అవసరమైన దారాలు, క్లాత్‌, ఇతర మెటీరియల్‌ బాద్యత మహిళలదే. నిర్వాహకులు కేవలం శిక్షణ మాత్రమే ఇస్తారు. శిక్షణ నిమిత్తం బయట రూ.7 వేల నుంచి రూ.10 వేలలోపు ఉంటే ఏజెన్సీలకు భారీ మొత్తంలో కట్టబెట్టారన్న విమర్శలున్నాయి.

‘బాబు’ గారడీ

జాడలేని కుట్టుమెషీన్లు

శిక్షణ పూర్తయి ఆరు నెలలు

ఇప్పటికీ అందజేయని మెషీన్లు

ఉమ్మడి జిల్లాలో 6,745 మంది ఎంపిక

కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు

కూటమి కనికుట్టు1
1/2

కూటమి కనికుట్టు

కూటమి కనికుట్టు2
2/2

కూటమి కనికుట్టు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement