మెరుగైన జీవన భృతి కల్పించాలి
ఏలూరు (టూటౌన్): రాష్ట్రంలో 29 వేల రేషన్ డీలర్ల కుటుంబాలకు మెరుగైన జీవన భృతి కల్పించాలని రేషన్ డీలర్లు కోరారు. అన్ని జిల్లాల్లో జాయింట్ కలెక్టర్లకు వినతి పత్రాలు ఇచ్చే కార్యక్రమంలో భాగంగా రాజులపాటి గంగాధర్ గౌడ్, తలారి రామకృష్ణ సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం డీఆర్‌ఓ, డీఎస్‌ఓను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చాలీచాలని కమిషన్లతో ఇబ్బంది పడుతున్న డీలర్లను ఆదుకోవాలని, కేజీకి మూడు రూపాయలు కమిషన్ ఇవ్వాలని, ఐవీఆర్‌ఎస్ రిపోర్టుల ఆధారంగా రేషన్ డీలర్లకు షోకాస్ నోటీసులు ఇవ్వడం సరికాదన్నారు.


