● చెట్ల కిందే సేద.. రోగుల సహాయకుల వ్యథ
ఏలూరు టౌన్: ఏలూరు సర్వజన ఆసుపత్రిలో రోగులు హాస్పిటల్‌లో వైద్య చికిత్స పొందుతూ ఉంటే.. వారి కుటుంబ సభ్యులు మాత్రం చెట్లకింద నిరీక్షించాల్సి వస్తోంది. మహిళలు తమ పిల్లలతో సహా చెట్ల కిందనే కూర్చొని అక్కడే భోజనాలు చేయాల్సిన దుస్థితి. గతంలో స్కానింగ్ సెంటర్ సమీపంలో పెద్ద షెడ్డు వేసి సహాయకులు సేదదీరేందుకు, భోజనాలు చేసేందుకు ఏర్పాట్లు చేశారు. కానీ నేడు ఆ షెడ్డులో మెడికల్ కాలేజీకి సంబంధించి క్లాస్‌లు చెబుతూ ఉండడంతో జనాలకు కనీసం కూర్చొనే అవకాశం లేకుండా పోయింది. దీంతో ఏలూరు జీజీహెచ్ మాతాశిశు విభాగం వద్ద రోగుల సహాయకులు ఇలా చెట్ల కిందే విశ్రాంతి పొందుతున్నారు. గుండుగొలనుకు చెందిన ఝాన్సీ రెండవ ప్రసూతి కోసం జీజీహెచ్‌లో చేరగా ఆమె ఆలనాపాలన కోసం వచ్చిన భర్త రెండు రోజులుగా తన కుమారుడితో కలిసి ఇలా రోడ్డుపైనే చెట్టుకింద ఉంటున్న దృశ్యమిది.


