సచివాలయ ఉద్యోగికి జిల్లా ఉత్తమ బీఎల్‌ఓ అవార్డు | - | Sakshi
Sakshi News home page

సచివాలయ ఉద్యోగికి జిల్లా ఉత్తమ బీఎల్‌ఓ అవార్డు

Jan 21 2026 7:03 AM | Updated on Jan 21 2026 7:03 AM

సచివా

సచివాలయ ఉద్యోగికి జిల్లా ఉత్తమ బీఎల్‌ఓ అవార్డు

సచివాలయ ఉద్యోగికి జిల్లా ఉత్తమ బీఎల్‌ఓ అవార్డు కోకో క్లస్టర్‌ ఏర్పాట్ల పరిశీలన బాలింత నరకయాతనపై కలెక్టర్‌ సీరియస్‌

టి.నరసాపురం: మండలంలోని వెలగపాడు పంచాయతీలో సచివాలయ ఉద్యోగినిగా పనిచేస్తున్న సరిపల్లి స్వాతి జిల్లా స్థాయి బెస్ట్‌ ఎలక్ట్రోల్‌ ప్రాక్టీస్‌ అవార్డుకు ఎంపికయ్యారని తహసీల్దార్‌ టి.సాయిబాబా తెలిపారు. స్థానిక తహసిల్దార్‌ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీఎల్‌ఓగా ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఆమెను జిల్లాస్థాయి ఉత్తమ ఎలక్ట్రోల్‌ ప్రాక్టీస్‌ అవార్డుకు అధికారులు ఎంపిక చేసినట్లు ఆయన తెలిపారు. 16వ జాతీయ ఓటర్ల దినోత్సవం పురస్కరించుకుని, ఈ నెల 25న విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఆమెకు రాష్ట్ర ఎలక్ట్రోల్‌ అధికారుల చేతుల మీదుగా అవార్డు అందజేస్తారని వివరించారు. జిల్లా ఉత్తమ బీఎల్‌ఓగా ఎంపికై న స్వాతిని సచివాలయ సిబ్బందితో పాటు పలువురు బీఎల్‌ఓలు అభినందించారు.

ఏలూరు(మెట్రో): ఏలూరు జిల్లాలో క్లస్టర్‌ డవలప్‌మెంట్‌ ప్రోగ్రాం (సీఎల్‌డీపీ) కింద నేషనల్‌ హార్టికల్చర్‌ బోర్డు (ఎన్‌హెచ్‌బీ) ద్వారా రూ.157. 82 కోట్లతో నవభారత్‌ లిమిటెడ్‌ కోకో క్లస్టర్‌ ఏర్పాట్లను ఉద్యానవన శాఖ జాతీయ స్థాయి అధికారులు మంగళవారం పరిశీలించారు. జిల్లాలో 8833 మంది రైతులకు ఉపయోగపడేలా 14500 హెక్టార్లలో ఏర్పాటుచేయనున్న కోకో క్లస్టర్‌ ఏర్పాట్లను క్షేత్ర స్థాయి పరిశీలనకు ఢిల్లీకి చెందిన నేషనల్‌ హార్టికల్చర్‌ బోర్డు టీం ప్రతినిధి పవన్‌ కుమార్‌ గౌరవ్‌, జయంత్‌ సింగ్‌, విజయవాడ నుంచి ప్రదీప్‌, ఉద్యానవన శాఖ జాయింట్‌ డైరెక్టర్‌ మునిరెడ్డి, సీఎల్‌డీపీ ప్రాజెక్ట్‌ కో–ఆర్డినేటర్‌ వై.విద్యా సాగర్‌, జంగారెడ్డిగూడెం యూనియన్‌ బ్యాంకు ప్రతినిధులు, కోకో, ఆయిల్‌ పామ్‌ తోటలను సందర్శించారు. మక్కినవారిగూడెం రైతులతో కోకో సాగు, అభివృద్ధి, ఎగుమతి అవకాశాలు గురించి చర్చించారని జిల్లా ఉద్యాన అధికారి కె.షాజా నాయక్‌ తెలియజేశారు.

ఏలూరు టౌన్‌: ఏలూరు సర్వజన ఆసుపత్రి ఎంసీహెచ్‌ బ్లాక్‌లో బాలింత సుబ్బలక్ష్మి వైద్యుల నిర్లక్ష్యంతో నరకయాతన పడిన సంఘటనపై కలెక్టర్‌ వెట్రిసెల్వి సీరియస్‌ అయ్యారు. కలెక్టర్‌ ఆదేశాలతో జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న దివ్యాంగురాలు, బాలింత సుబ్బలక్ష్మి బంధువుల నుంచి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్‌ పీజే అమృతం వివరాలు అడిగి తెలుసుకున్నారు. వైద్యులు, వైద్య సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. వైద్య సిబ్బంది నిర్లక్ష్యంపై మంత్రి పార్థసారధి ఆగ్రహం వ్యక్తం చేశారు. 14 రోజుల క్రితం సుబ్బలక్ష్మికి శస్త్రచికిత్స చేసి డెలివరీ చేయగా, కుట్లు విడిపోయి తీవ్ర అస్వస్థతకు గురికావడంపై ఆయన స్పందించారు. కుట్లు విడిపోయి 5 రోజులైనా బాధితురాలిని వైద్యులు, సిబ్బంది పట్టించుకోకుండా, ఉదాసీనంగా వ్యవహరించటంతో బాధితురాలు తీవ్ర అనారోగ్యానికి గురైంది.

సచివాలయ ఉద్యోగికి  జిల్లా ఉత్తమ బీఎల్‌ఓ అవార్డు 1
1/2

సచివాలయ ఉద్యోగికి జిల్లా ఉత్తమ బీఎల్‌ఓ అవార్డు

సచివాలయ ఉద్యోగికి  జిల్లా ఉత్తమ బీఎల్‌ఓ అవార్డు 2
2/2

సచివాలయ ఉద్యోగికి జిల్లా ఉత్తమ బీఎల్‌ఓ అవార్డు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement