మేనత్తపై కుటుంబంపై మేనల్లుడి దాడి
జంగారెడ్డిగూడెం: స్థానిక దళితపేటలో సరిహద్దు తగాదాల మంగళవారం రాత్రి మేనత్త కుటుంబంపై మేనల్లుడి గొడ్డలితో దాడి చేయడంతో ఓ మహిళ మృతి చెందగా, ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వివరాల ప్రకారం కలపాల జీలుగులమ్మ కుటుంబానికి ఆమె మేనల్లుడు ముప్పిడి వివేక్ కుటుంబానికి పొలం, ఇంటి సరిహద్దు తగాదాలు చాలా ఏళ్లుగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మంగళవారం రాత్రి వివేక్ జీలుగులమ్మ కుటుంబంపై గొడ్డలితో దాడికి తెగబడ్డాడు. దీంతో జీలుగులమ్మ (45) మృతి చెందగా, ఆమె తల్లి చుక్కమ్మ, కూతుళ్లు ధనలక్ష్మి, ఉషారాణిలు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు బాధితులను ఏరియా ఆస్పత్రికి తరలించారు. వీరిలో చుక్కమ్మ పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. విషయం తెలుసుకున్న డీఎస్పీ యు.రవిచంద్ర, సీఐ ఎంవీ సుభాష్ ఘటనా స్థలాన్ని పరిశీలించి, ఆస్పత్రిలో క్షతగాత్రుల నుంచి వివరాలను సేకరించారు. ఈ మేరకు దర్యాప్తు చేస్తున్నామని వివరించారు.
మహిళ మృతి


