జాతరకు పటిష్ట భద్రత | - | Sakshi
Sakshi News home page

జాతరకు పటిష్ట భద్రత

Jan 21 2026 7:01 AM | Updated on Jan 21 2026 7:01 AM

జాతరకు పటిష్ట భద్రత

జాతరకు పటిష్ట భద్రత

జాతరకు పటిష్ట భద్రత

ఏలూరు(మెట్రో): ఏలూరు జాతర ఏర్పాట్లపై కలెక్టరు కె.వెట్రిసెల్వి, ఎమ్మెల్యే బడేటి చంటి, మేయర్‌ షేక్‌ నూర్జహాన్‌ మంగళవారం అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టరు మాట్లాడుతూ పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. జాతర సందర్భంగా ఎలాంటి అసౌకర్యం కలగకుండా రక్షిత మంచినీరు, పారిశుధ్యం, నిరంతరాయంగా విద్యుత్తు సరఫరా, రవాణా, జనరేటర్లు, వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలన్నారు. ట్రాఫిక్‌ నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. కంట్రోల్‌ రూం ఏర్పాటుచేసి 24 గంటలు పనిచేసేలా చూడాలన్నారు. అంబులెన్స్‌, అగ్నిమాపక వాహనాన్ని అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపారు. సమావేశంలో జిల్లా రెవిన్యూ అధికారి వి.విశ్వేశ్వరరావు, నూజివీడు సబ్‌ కలెక్టరు బొల్లిపల్లి వినూత్న, ఆర్డీవో అచ్యుత అంబరీష్‌, కమిషనరు ఏ.భానుప్రతాప్‌ తదితరులు, పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement