నేడు వాసవీ మాత ఆత్మార్పణ దినోత్సవం
పెనుగొండ: ఆర్యవైశ్యుల ఆరాధ్యదేవత వాసవీ కన్యకపరమేశ్వరి ఆత్మార్ఫణ దినోత్సవం జన్మస్థలమైన పెనుగొండలో మంగళవారం అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. మూల విరాట్ కొలువై ఉన్న శ్రీనగరేశ్వర మహిషాసురమర్ధనీ వాసవీ కన్యక పరమేశ్వరి ఆలయంలో ఆత్మార్పణ దినోత్సవంను దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం విఘ్నేశ్వర పూజ, పుణ్యహవచనం, నగరేశ్వర స్వామికి ఏకాదశ రుద్రాభిషేకం, అనంతరం వాసవీ మాతకు 102 కలశాలతో అభిషేకం నిర్వహించనున్నారు. ముందుగా పెనుగొండలోని బజారు రామాలయం నుంచి 102 కలశాలతోనూ, అమ్మవారిని వెండి పల్లకీపై గ్రామోత్సవం కనుల పండుగగా నిర్వహించనున్నారు. అభిషేకాల అనంతరం ఆలయ ప్రాంగాణంలో వాసవీ మాలధారుల వాసవీహోమం నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు. హోమానంతరం అమ్మవారికి ఇరుముడులు సమర్పించడానికి దేశం నలుమూలల నుంచి వాసవీ మాఽలధారులు భారీ సంఖ్యలో రానున్నారు.
వాసవీ శాంతి థాంలో..
అఖిల భారత శ్రీవాసవీ పెనుగొండ టెంపుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలోని వాసవీ శాంతి థాంలోనూ ఆత్మార్పణ దినోత్సవం పీఠాథిపతి శ్రీపజ్ఞానంద సరస్వతీ(బాల) స్వామీజీ ఆధ్వర్యంలో నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు. రాష్టమంత్రి నిమ్మల రామానాయుడు వాసవీ మాతకు పట్టువస్త్రాలు సమర్పిస్తారు.


