కారు బోల్తా పడి వృద్ధురాలి మృతి
పెదవేగి: కారు అదుపు తప్పి ఓ వృద్ధురాలు దుర్మరణం పాలైంది. ఎస్సై ఎం హరిగోపాల్ తెలిపిన వివరాలు ఇటవి. చల్లా వెంకట్రావు అనే వ్యక్తి సోమవారం తల్లి వెంకటరమణమ్మతో కలసి కారులో చింతలపూడి నుంచి ఏలూరు వెళ్తుండగా పెదవేగి మండలం నడిపల్లి వద్దకు వచ్చే సరికి కారు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న చల్లా వెంకటరమణమ్మ (76) అక్కడికక్కడే మృతి చెందగా, వెంకట్రావుకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చెప్పారు.
కై కలూరు: అరటిపండ్ల దుకాణంలో రూ.3 లక్షలు, సెల్ ఫోన్ చోరీకి గురైన ఘటన కై కలూరులో ఆదివారం రాత్రి జరిగింది. కై కలూరు టౌన్ సీఐ ఏవీఎస్.రామకృష్ణ తెలిపిన వివరాలు ప్రకారం కోరుకొల్లు రోడ్ బృందావనం అపార్ట్‌మెంటు పక్కన మొవ్వా నాగేశ్వరరావు అరటిపండ్లు, చికెన్ దుకాణాన్ని నిర్వహిస్తున్నాడు. ఆదివారం రెండు దుకాణాల నుంచి వచ్చిన రూ.3 లక్షల నగదు, ఒక సెల్ ఫోన్‌ను అరటి పండ్ల దుకాణంలోని మూడు అరల ఇనుప సొరుగులో పెట్టి రాత్రి 9 గంటలకు ఇంటికి వెళ్లాడు. సోమవారం ఉదయం దుకాణం వద్దకు వచ్చి చూసేసరికి సొరుగు పగలగొట్టి ఉండడం గుర్తించి నాగేశ్వరరావు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. జిల్లా ట్రైనీ ఐపీఎస్ జయ శర్మ, డీఎస్పీ శ్రావణ్‌కుమార్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. టౌన్ ఎస్సైలు డి.వెంకట్‌కుమార్, ఆర్.శ్రీను కేసు దర్యాప్తు చేస్తున్నారు.


