వచ్చే నెలలో జాతీయస్థాయి హ్యాకథాన్‌ | - | Sakshi
Sakshi News home page

వచ్చే నెలలో జాతీయస్థాయి హ్యాకథాన్‌

Jan 20 2026 9:14 AM | Updated on Jan 20 2026 9:14 AM

వచ్చే నెలలో జాతీయస్థాయి హ్యాకథాన్‌

వచ్చే నెలలో జాతీయస్థాయి హ్యాకథాన్‌

వచ్చే నెలలో జాతీయస్థాయి హ్యాకథాన్‌

భీమవరం: భీమవరం ఎస్‌ఆర్‌కేఆర్‌ ఇంజనీరింగ్‌లో ఫిబ్రవరి 27, 28 తేదీల్లో జాతీయస్థాయి హ్యాకథాన్‌ పోటీలు నిర్వహిస్తున్నట్లు కళాశాల కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజనీరింగ్‌ (సీఎస్‌ఈ) హెడ్‌ డాక్టర్‌ బీహెచ్‌వీఎస్‌ రామకృష్ణంరాజు చెప్పారు. ప్రజ్వలన 2కె 26 పేరిట నిర్వహించనున్న హ్యాక్‌థాన్‌ పోస్టర్‌ను కళాశాల సెక్రటరీ కం కరస్పాండెంట్‌ సాగి రామకృష్ణ నిషాంత వర్మ సోమవారం జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా కళాశాల డైరెక్టర్‌ డాక్టర్‌ ఎం జగపతిరాజు మాట్లాడుతూ విద్యార్థుల్లో నూతన ఆవిష్కరణలు, వాస్తవ సమస్యలకు సాంకేతిక పరిజ్ఞానంతో పరిష్కారాలు రూపొందించడం హ్యాకథాన్‌ వంటి పోటీలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. పోటీల్లో విజేతలకు రూ.75,000 వరకు బహుమతులు అందిస్తామని రామకృష్ణంరాజు తెలిపారు. దీనికి సంబంధించి జనవరి 20 నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభం అవుతాయని జాతీయస్థాయిలో విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో డీన్‌ అకాడమిక్స్‌ డాక్టర్‌ వి చంద్రశేఖర్‌, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పి సరోజ, కే హరికృష్ణ, ఏ నీలిమ కోఆర్డినేటర్లుగా వ్యవహరిస్తున్నారని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement