సూర్యకుమార్‌కు జాతీయ ప్రతిభా పురస్కారం
యలమంచిలి: పాలకొల్లు శంభునిపేటకు చెందిన ఉపాధ్యాయుడు, కవి, రచయిత కొల్లాబత్తుల సూర్యకుమార్ జాతీయ ప్రతిభా పురస్కారానికి ఎంపికయ్యారు. ఈ నెల 21న విజయవాడ చాంబర్ ఆఫ్ కామర్స్ ఆడిటోరియంలో ప్రాచీన కవుల వారసులచే నిర్వహించనున్న సాహితీ పట్టాభిషేక మహోత్సవంలో ఈ పురస్కారాన్ని సూర్యకుమార్‌కు ప్రదానం చేయనున్నట్లు కళావేదిక జాతీయ అధ్యక్షురాలు జి.ఈశ్వరి భూషణం తెలిపారు. శ్రీశ్రీ కళావేదిక, ప్రపంచ తెలుగు సంస్కృత కళావేదిక, తెలుగు అసోసియేషన్ ఆఫ్ నేషనల్ అకాడమీ బుక్ ఆఫ్ రికార్డ్స్, తెలుగు రైటర్స్ అకాడమీ, గోదావరి సోషల్ అండ్ కల్చరల్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో పురస్కారానికి సూర్యకుమార్‌ను ఎంపిక చేశారు.


