ప్రతి అర్జీని పరిష్కరించాలి
అనుమానాస్పద స్థితిలో మృతి
ఉండిలో అనుమానాస్పద స్థితిలో ఓ వ్యక్తి మృతి చెందాడు. హత్యా లేక ఆత్మహత్యా అనే విషయంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 8లో u
కలెక్టర్ కె. వెట్రిసెల్వి
ఏలూరు(మెట్రో): గోదావరి సమావేశ మందిరంలో సోమవారం జిల్లా స్థాయి ప్రజాసమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని కలెక్టరు కె.వెట్రిసెల్వి నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టరు మాట్లాడుతూ ఫిర్యాదుదారులను ఆప్యాయతతో పలకరించి సమస్యలను పూర్తిగా విని చక్కని పరిష్కారం చూపాలని అన్నారు. పీజీఆర్‌ఎస్, రెవిన్యూ క్లినిక్‌లో ప్రజలు సమర్పించిన అర్జీలపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, అధికారులు క్షేత్రస్థాయిలో అర్జీదారులతో స్వయంగా మాట్లాడి నాణ్యమైన పరిష్కారాన్ని చూపాలన్నారు. ఏ శాఖకు వచ్చిన అర్జీలకు ఆయా శాఖ వారు మాత్రమే పరిష్కారం చూపాలని, వేరే శాఖకు పంపితే కాలయాపన జరిగి సమస్యలు ఉత్పన్నం అవుతాయన్నారు. క్షేత్రస్థాయిలో ఉత్పన్నమయ్యే సమస్యలను క్షేత్రస్థాయిలోనే పరిష్కారం చేసి అర్జీలు రీఓపెన్‌కు ఆస్కారం లేకుండా చూడాలన్నారు. వచ్చిన అర్జీలకు నాణ్యమైన పరిష్కారం చూపినప్పుడు అర్జీదారులు సంతృప్తి చెందుతారని అటువంటి పరిష్కారాలను విజయగాథలుగా జిల్లా కార్యాలయానికి పంపించాలని అన్నారు.


