అలరించిన వేమన జయంతి వేడుకలు | - | Sakshi
Sakshi News home page

అలరించిన వేమన జయంతి వేడుకలు

Jan 19 2026 4:23 AM | Updated on Jan 19 2026 4:23 AM

అలరిం

అలరించిన వేమన జయంతి వేడుకలు

అత్తిలి: మానవ జీవితానికి సంబంధించిన అనేక నిత్యసత్యాలను తనదైన శైలిలో తేట తెలుగు పదాలతో వర్ణించి తెలుగువారి హృదయాల్లో చిరస్మరణీయుడిగా నిలిచిన ప్రజా కవి యోగి వేమన. అత్తిలి మండలం ఆరవల్లిలో వేమనకు మందిరం నిర్మించి, ఏగా జనవరి 18న జయంతి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. ఆదివారం యోగి వేమన 101వ జయంతి ఉత్సవాన్ని నేత్రపర్వంగా జరిపారు. వేకువ జామున వెలగల దాసు వంశీయులు వేమనకు గోస్తనీ నది స్నానం చేయించారు. వేమన మందిరాన్ని పుష్పాలతో విశేషంగా అలంకరించారు. ఉదయం నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై వేమనను దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణంలో భజన కీర్తనలు, కోలాట భజన, సినీ సంగీత విభావరి కార్యక్రమాలు నిర్వహించారు. బ్యాండు మేళాలు, మంగళ వాయిద్యాల నడుమ, బాణసంచా కాల్పులతో విశేషంగా అలంకరించిన పల్లకీపై వేమన చిత్రపటాన్ని ఉంచి పురవీధులలో ఊరేగించారు. వేమన పల్లకీ కింద నుంచి తల్లిదండ్రులు తమ చిన్నారులను దాటించారు. ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన గృహోపకరణ, ఫ్యాన్సీ వస్తు దుకాణాల వద్ద సందడి నెలకొంది. వేమన జయంతి సందర్భంగా గ్రామంలో పండుగ వాతావారణం నెలకొంది. దేశ, విదేశాలలో ఉన్నవారు స్వగ్రామానికి చేరుకుని బంధుమిత్రులతో ఉత్సాహంగా గడిపారు. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విద్యుత్‌ దీపాలంకరణ ఉత్సవాలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వేమన ఉత్సవ కమిటీ ఛైర్మన్‌ వెలగల అమ్మిరెడ్డి, కమిటీ సభ్యులు పర్యవేక్షణలో ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఆరవల్లి గ్రామానికి చెందిన ప్రముఖ సినీ దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి, నిర్మాత కె.అచ్చిరెడ్డి యోగి వేమనను దర్శించుకున్నారు. కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డిలను ఆలయ కమిటీ ఛైర్మన్‌ వెలగల అమ్మిరెడ్డి సత్కరించి, వేమన పద్యాల పుస్తకాలను అందజేసారు. క్రీడా ప్రాంగణంలో జరుగుతున్న వాలీబాల్‌ పోటీలను వారు తిలకించారు.

శునకాలకు అన్నదానం

వేమన జయంతి ఉత్సవాలలో భాగంగా గ్రామ సింహాలైన శునకాలకు అన్నదానం చేశారు. పలు రకాల ఆహార పదార్థాలను కావిడిలో పెట్టుకుని గ్రామంలో తిరుగుతూ కనిపించిన శునకాలకు విస్తరి వేసి, ఆహార పదార్ధాలను వడ్డించారు. గ్రామానికి కాపలా ఉంటూ, గ్రామాన్ని రక్షించేది కాలభైరవుడని, ఏటా గ్రామంలో కాలభైరవ సంతర్పణ పేరుతో గ్రామంలో ఉన్న శునకాలకు భోజనం వడ్డిస్తామని యోగి వేమన జయంతి ఉత్సవ కమిటీ చైర్మన్‌ తెలిపారు.

అత్తిలి మండలం ఆరవల్లిలో ప్రత్యేక కార్యక్రమాలు

అలరించిన వేమన జయంతి వేడుకలు 1
1/4

అలరించిన వేమన జయంతి వేడుకలు

అలరించిన వేమన జయంతి వేడుకలు 2
2/4

అలరించిన వేమన జయంతి వేడుకలు

అలరించిన వేమన జయంతి వేడుకలు 3
3/4

అలరించిన వేమన జయంతి వేడుకలు

అలరించిన వేమన జయంతి వేడుకలు 4
4/4

అలరించిన వేమన జయంతి వేడుకలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement