హోరాహోరీగా కబడ్డీ పోటీలు
నరసాపురం: నరసాపురం రుస్తుంబాదలో జరుగుతున్న జాతీయస్థాయి కబడ్డీ పోటీల్లో పురుషుల విభాగంలో ఎస్సీ రైల్వే నాగ్‌పూర్, హర్యానా జట్లు, మహిళల విభాగంలో సీఆర్‌పీఎఫ్ ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్ జట్లు ఫైనల్స్‌కు చేరాయి. ఆదివారం ఉదయం నుంచి లీగ్‌లో చివరి మ్యాచ్‌లు, సెమీఫైనల్స్ మ్యాచ్‌లు హోరాహోరీగా సాగాయి. ఫ్లడ్‌లైట్స్ వెలుగులో జరిగిన ఫైనల్ మ్యాచ్‌కు కలెక్టర్ నాగరాణి, ఎస్పీ నయీం అస్మీ ముఖ్య అతిథులుగా హాజరై మ్యాచ్‌లు తిలకించారు. పెద్ద ఎత్తున ప్రేక్షకులు హాజరవ్వడంతో స్టేడియం నిండిపోయింది. అర్థరాత్రి వరకూ ఫైనల్స్ జరిగాయి. గెలుపొందిన జట్లకు మొత్తం రూ.7.50 లక్షల ప్రైజ్‌మనీ అందించారు. కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు, పోటీల కన్వీనర్ కొత్తపల్లి జానకీరామ్, నరసాపురం ఆర్డీవో దాసి రాజు, డీఎస్పీ డాక్టర్ శ్రీవేద, కబడ్డీ అసోసియేషన్ సీఈవో వీ.వీర్లెంకయ్య, వన్నెంరెడ్డి శ్రీనివాస్, గుగ్గిలపు మురళి, తదితరులు పాల్గొన్నారు.
హోరాహోరీగా కబడ్డీ పోటీలు


