సందడి చేసిన అనిల్ రావిపూడి
తణుకు అర్బన్: మన శంకర వరప్రసాద్ చిత్రం ప్రదర్శిస్తున్న వీమాక్స్ థియేటర్‌ను ఆదివారం దర్శకుడు అనిల్ రావిపూడి సందర్శించారు. చిన్నతనం నుంచి చిరంజీవి సినిమాలను ఇలాగే థియేటర్‌కు వెళ్లి చూశానని, ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి సినిమాను దర్శకత్వం చేసే స్థాయికి ఎదగడం, ఇలా ప్రేక్షకుల ముందుకు రావడం మర్చిపోలేని అంశమన్నారు. మెగా అభిమానులు చూపిస్తున్న ప్రేమాభిమానాలతో తాను ఎంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నానని, సినిమాను ఆదరిస్తున్న అభిమానులే తనకు దేవుళ్లుగా భావిస్తున్నట్లు చెప్పారు. త్వరలోనే మరో భారీ ప్రాజెక్టుతో ప్రేక్షకుల ముందుకు వస్తానని చెప్పారు. కార్యక్రమంలో చిత్ర నిర్మాత గారపాటి సాహు, ఇతర చిత్ర బృందం పాల్గొన్నారు.
గణపవరంలో..
గణపవరం: గణపవరంలోని మహాలక్ష్మీ థియేటర్‌లో మన శంకర వరప్రసాద్ చిత్ర విజయోత్సవ సభలో అనిల్ రావిపూడి పాల్గొని చిత్ర విజయం పట్ల అభినందనలు తెలిపారు.
ఏలూరులో
ఏలూరు(ఆర్.ఆర్.పేట): డైరెక్టర్ అనిల్ రావిపూడి ఆదివారం ఏలూరులో సందడి చేశారు. ఎస్‌వీసీ సినిమా థియేటర్‌లో ప్రేక్షకులతో ముఖాముఖి నిర్వహించారు. గంగానమ్మ జాతరకు సంబంధించిన అమ్మవారి మేడలను సందర్శించి పూజలు చేశారు.
తాడేపల్లిగూడెం రూరల్: కారు ఢీకొని వ్యక్తి మృతి చెందినట్లు రూరల్ ఎస్సై జేవీఎన్ ప్రసాద్ తెలిపారు. ఆదివారం ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని కొండ్రుప్రోలు జాతీయ రహదారిపై నిట్ కళాశాల జంక్షన్‌లో గేదెల సింహాచలం ఏలూరు నుంచి వస్తుండగా కారు ఢీకొంది. క్షతగాత్రుడిని ప్రైవేట్ ఆసుపత్రికి తరలిస్తుండగా మధ్యలో మృతి చెందాడు. మృతుడిని యాగర్లపల్లికి చెందిన జట్టు కూలీగా గుర్తించారు.


