అన్నదానం.. స్వాహాపర్వం
రూ.28.50 లక్షలు ఉన్నట్టు వెల్లడి
నూజివీడు: ప్రముఖ ప్రాచీన దివ్యక్షేత్రమైన ఆగిరిపల్లిలోని శోభనాచల వ్యాఘ్ర లక్ష్మీనరసింహస్వామి కి శఠగోపం పెట్టే ప్రబుద్ధులు తయారవ్వడంపై గ్రా మస్తులతో పాటు భక్తుల్లో ఆందోళన నెలకొంది. ఏ టా మాఘమాసంలో నిర్వహించే రథసప్తమి ఉత్స వాల్లో భాగంగా అన్నదానం నిర్వహించేందుకు రసీదులు లేకుండా విరాళాలు సేకరించడం, లెక్కలు చెప్పకపోవడం తెలిసిందే. గ్రామ పెద్దలు నిలదీయడంతో గత 20 ఏళ్లుగా విరాళాలు వసూలు చేసి ఖ ర్చు చేయగా మిగిలిన సొమ్ము రూ.28.50 లక్షలు ఉ న్నాయని, వాటిని ఇచ్చేస్తామని చెప్పిన కమిటీ స భ్యులు సొమ్మును ఇవ్వకుండా మాటమార్చడం స ర్వత్రా చర్చనీయాంశమైంది. నూజివీడు జమిందారులు మేకా వంశీయులు నిర్మించిన ఈ ఆలయానికి రథసప్తమి నాడు లక్షలాది మంది భక్తులు విచ్చేస్తారు. రాత్రంతా, తెల్లవార్లూ నిర్వహించే తిరునాళ్ల మహోత్సవంలో పాల్గొంటారు. స్వామి వారికి మే కా వంశీయులు వేలా ఎకరాల భూములను, బంగా రు ఆభరణాలను సైతం సమర్పించారు.
అన్నదానం ఖర్చుపై లోపించిన పారదర్శకత
రథసప్తమి నాడు భక్తులకు భారీ అన్నసమారాధన నిర్వహించడం ఆనవాయితీ. స్థానికులే కమిటీగా ఏ ర్పడి అన్నదాన నిర్వహణ నిమిత్తం రసీదులు లే కుండానే విరాళాలు వసూలు చేసి అన్నదానాన్ని ని ర్వహిస్తున్నారు. అయితే వసూలు అవుతున్న సొ మ్ము ఎంత? ఎంత ఖర్చు అవుతోంది? ఎంత సొ మ్ము మిగులుతోంది? అనే అంశాల్లో పారదర్శకత లేకుండా పోయింది. దేవుడి పేరు చెప్పి విరాళాలు సేకరిస్తూ లెక్కలు చెప్పకుండా కొందరు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. అన్నదానం పూర్తయిన తరువాత అటు దేవదాయ శాఖ అధికారులు, కమిటీ సభ్యులకు, గ్రామస్తులకు గానీ విరాళాలు ఇచ్చిన గ్రామ పెద్దలకు లెక్కలు చెప్పడం లేదు. మిగిలిన సొమ్మును వడ్డీలకు ఇచ్చుకుంటూ మింగేస్తున్నారనేది అందరికీ తెలిసిందే. ఈ తంతు గత 20 ఏళ్లుగా సాగుతున్నట్లు గ్రామస్తులు చెబుతున్నారు.
మాట మార్చి.. విరాళాలు మింగేసి
రథసప్తమి ఉత్సవాలు దగ్గర పడుతున్న నేపథ్యంలో కమిటీ నిర్వాహకులు మిగిలి ఉన్న రూ.28.50 లక్షలను ఇచ్చేది లేదంటూ, తామే ఈ ఏడాది కూడా అన్నదానాన్ని నిర్వహిస్తామని మాట మార్చారు. దీంతో గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సొమ్ములు ఇవ్వాల్సిందేనని ఎవరైనా గట్టిగా మాట్లాడితే వారిని బెదిరిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. దీంతో ఎవరికి వారు తమకెందుకులే అని మిన్నకుండిపోతున్నారు.
పట్టించుకోని ఉన్నతాధికారులు
ఆలయంలో నిర్వహించే అన్నదాన కార్యక్రమంపై ఏడాదిగా ఆరోపణలు, విమర్శలు వస్తున్నా దేవదాయశాఖ ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడంపై గ్రామస్తులు, భక్తులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. స్వామివారి పేరు చెప్పి విరాళాలు వసూలు చేస్తూ లెక్కలు చెప్పకుండా కొందరు తమ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నా అధికారులు ఎందుకు మిన్నకుంటున్నారని ప్రశ్నిస్తున్నారు. దీనిపై దేవదాయ శాఖ మంత్రితో పాటు కమిషనర్‌కు కూడా ఫిర్యాదు చే సేందుకు సిద్ధమవుతున్నట్టు తెలిసింది.
రథసప్తమి ఉత్సవాల నిర్వహణపై గత నెల 25న ఆలయ ఆవరణలో ఈఓ సాయి గ్రామ పెద్దలు, కుల సంఘాల పెద్దలతో సమావేశం నిర్వహించారు. 20 ఏళ్లుగా అన్నదానం నిర్వహణకు వసూలు అయిన సొమ్ములో ఖర్చులు పోను మిగిలిన సొమ్మును అప్పగిస్తామని చెప్పి ఏడాది అవుతున్నా అన్నదాన కమిటీ సభ్యులు ఎందుకు అప్పగించలేదని ప్రశ్నించారు. నాలుగేళ్ల క్రితం అప్పటి ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు చొరవతో గ్రామ పెద్దలతో కమిటీని ఏర్పాటు చేసి సేకరించిన విరాళాలకు రసీదులు ఇచ్చి రెండేళ్ల పాటు అన్నదానం నిర్వహించగా రెండేళ్లలో రూ.5.75 లక్షలు మిగిలాయి. వాటిని అన్నదానం పేరుతో అకౌంట్ ఓపెన్ చేసి అందులో ఫిక్స్‌డ్ డిపాజిట్ చేశారు. ఈ నేపథ్యంలో 20 ఏళ్లలో ఎన్ని డబ్బులు మిగిలాయో లెక్కలు చెప్పి అప్పగించిన తరువాతే అన్నదానం నిర్వహించాలని తేల్చిచెప్పారు. ఈ క్రమంలో ఈనెల 2న రెండోసారి నిర్వహించిన సమావేశంలో రూ.28.50 లక్షలు ఉన్నట్లు అన్నదాన కమిటీ నిర్వాహకులు తెలిపారు. ఈ సొమ్మును దేవస్థానం అన్నదానం బ్యాంకు ఖాతాలో వేసి కమిటీ ఏర్పాటు చేసి ఖర్చు చేయాలని నిర్ణయం తీసుకున్నారు.
నరసన్నకే శఠగోపం
ఆగిరిపల్లిలో ఏటా భారీ అన్నదానం
రసీదులు లేకుండా విరాళాల సేకరణ
కమిటీ నిర్వాహకుల ఇష్టారాజ్యం
మిగులు సొమ్ములు ఇచ్చేందుకు నిరాకరణ


