అధిక ధరలకు మద్యం అమ్మకాలు
లక్కవరంలో షాపు వద్ద ఆందోళన
జంగారెడ్డిగూడెం: లక్కవరంలోని మద్యం షా పులో ఎమ్మార్పీకి మించి అధిక ధరలకు మ ద్యం విక్రయిస్తున్నారంటూ మందుబాబులు ఆదివారం ఆందోళనకు దిగారు. దీంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. కొద్దిరోజులుగా జంగారెడ్డిగూడెం పట్టణం, మండలంలో మద్యం షా పుల సిండికేట్లు అధిక ధరలతో దోపిడీ చేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రతి బాటిల్‌పై రూ.20 వసూలు చేస్తున్నా పట్టించుకునే నాథుడే లేడని మండిపడ్డారు. ఎంసీ విస్కీ క్వార్టర్ బాటిల్ ధర రూ.190 ఉండగా రూ.220 వసూలు చేస్తున్నారని, కొన్ని బ్రాండ్ల అమ్మకాలు నిలిపివేశారన్నా రు. అలాగే కొన్ని బ్రాండ్లను బెల్టు షాపులకు తరలిస్తూ మద్యం దుకాణాల్లో మాత్రం విక్రయించడం లేదన్నారు. బెల్టు షాపులకు ఇచ్చే బాటిళ్లపై ఎమ్మార్పీ స్లిక్కర్లు చింపేస్తున్నారని విమర్శించారు. అలాగే బాటిళ్లకు జేఆర్ అనే స్టిక్కర్ అంటించి బెల్టు షాపులకు సరఫరా చే స్తున్నారని అన్నారు. జంగారెడ్డిగూడెం ఎకై ్సజ్ అధికారులు, లక్కవరం ఎస్సై షేక్ జబీర్, ఎస్సై కుటుంబరావు ఇక్కడకు చేరుకున్నారు. ఎమ్మార్పీకే అమ్మేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళనకారులు శాంతించారు. మద్యం షాపుల నిర్వాహకులు దురుసు గా మాట్లాడుతున్నారని చెప్పగా అధికారులు వారితో క్షమాపణ చెప్పించారు.
ద్వారకాతిరుమల: ద్వారకాతిరుమల చినవెంకన్న క్షేత్రంపై అమావాస్య ఎఫెక్ట్ పడింది. ఆదివారం ఆలయానికి భక్తుల రాక స్వల్పంగా ఉంది. మధ్యాహ్నం 3 గంటల వరకు ఆలయ పరిసరాల్లో నామమాత్రంగా భక్తులు సంచరించా రు. ఆ తరువాత నుంచి దాదాపుగా అన్ని విభాగాలు ఖాళీగా మారాయి.
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): 11వ పీఆర్సీ కాల పరిమితి ముగిసి 27 నెలలకు కావస్తున్నా 12వ పీఆర్సీ కమిటీ నియామకంపై ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని ఎస్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఫ్యాప్టో చైర్మన్ ఎల్.సాయి శ్రీనివాస్ అన్నారు. ఆదివారం స్థానిక ఎస్టీయూ భవన్‌లో నిర్వహించిన జిల్లా ఎస్టీయూ ముఖ్య నాయకుల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాలుగు డీఏలు బకాయిలు ఉంచడం సరికాదని, 11వ పీఆర్సీ బకాయిలు, పీ ఎఫ్ లోన్ల బకాయిలు చెల్లించడానికి రోడ్ మ్యాప్‌ని విడుదల చేయాలని, డీఏ ఏరియర్ బకాయిల చెల్లింపులో సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. జిల్లా అధ్యక్షుడు పీబీవీఎన్‌ఎల్ నారాయణ మాట్లాడుతూ బోధనేతర కార్యక్రమాల ఒత్తిడి తగ్గించాలని, విద్యా శక్తి పేరుతో పాఠశాల పనివేళలను పెంచడం సరికాదన్నారు. ప్రభుత్వం ఉపాధ్యాయులపై, విద్యా వ్యవస్థలోని సమస్యలపై నిర్లక్ష్య ధోరణి ప్రదర్శించడం శోచనీయమన్నారు. ఉంగుటూరు మండల సంఘ నూతన కార్యవర్గాన్ని ఏర్పాటుచేశారు. అధ్యక్షుడిగా గుండె మధుసూదనరావు, ప్రధాన కార్యదర్శిగా షేక్ లెహర భానును ఎన్నుకున్నారు. జిల్లా ప్రధాన కార్యదర్శి కేఆర్ పవన్‌కుమార్, రాష్ట్ర నాయకులు ఎండీ షఫీ, సీనియర్ నాయకులు పాల్గొన్నారు.
అధిక ధరలకు మద్యం అమ్మకాలు
అధిక ధరలకు మద్యం అమ్మకాలు


