వైఎస్సార్‌సీపీ నేత కుటుంబంపై దాడి
దెందులూరు: వైఎస్సార్‌సీపీ పంచాయతీరాజ్ విభా గం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోకల రాంబాబు కు మారుడు ప్రవీణ్, కుమార్తె కల్యాణి, భార్య గంగమ్మ పై కొందరు విచక్షణారహితంగా దాడి చేసి గాయపరిచారు. బాధితులు, ప్రత్యక్ష సాక్షులు, పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. రాంబాబు శనివా రం సాయంత్రం 5 గంటల సమయంలో దెందులూరులోని తన నివాసంలో కుటుంబసభ్యులతో కలిసి ఉన్నారు. ఉంగుటూరు మండలం బావాయిపేటకు చెందిన శంకు పద్మారావు, శంకు రాజు, గోలి సత్య వతి, సిరి, సాయి, మరో 30 మంది ఐదు కార్లలో వచ్చి ‘మా డబ్బులు ఎప్పుడు ఇస్తారు.. ఇస్తారా ఇవ్వరా’ అంటూ అసభ్య పదజాలంతో దూషిస్తూ దౌర్జన్యానికి దిగారు. రాంబాబుతో పాటు ప్రవీణ్, కల్యాణిలపై దాడి చేశారు. రాంబాబును గుండైపె త న్నడంతో ఆయన కుర్చీ నుంచి వెనక్కి పడిపోయా రు. ప్రవీణ్ తల, ముక్కు, కళ్లు, ఛాతీపై రక్త గాయా లయ్యాయి. అడ్డు వచ్చిన గంగమ్మను గోడకేసి కొట్టడంతో ఆమె అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. అంతటితో ఆగకుండా వరండాలో ఉన్న స్కూటర్‌ని కింద పడేసి ధ్వంసం చేశారు. అర గంటకు పైగా వీర విహారం చేశారు. విషయం తెలిసి చుట్టుపక్కల వారు, గ్రామస్తులు అక్కడికి చేరుకున్నారు. దాడి ఘటనపై రాంబాబు మాట్లాడుతూ బావాయిపేటలోని చేపల చెరువులో ఫీడ్ నిమిత్తం తన కుమార్తె భర్త కుటుంబసభ్యులకు రూ.3 లక్షలు ఇవ్వాల్సిన మాట వాస్తవమని, గత నెలలో వారి ఇంటికి వెళ్లి త్వ రలో ఇస్తామని స్వయంగా చెప్పి వచ్చానన్నారు. ఇంతలోనే ఇలా దౌర్జన్యం చేయడం దారుణమన్నారు. కల్యాణి మాట్లాడుతూ కట్నం కోసం చాలా కాలంగా తమను వేధిస్తున్నారని, ఇప్పుడు తమను హతమార్చాలని చూసినవారే గతంలో తనను చాలా ఇబ్బందులు పెట్టారని, దీనిపై ఉంగుటూరు, హైదరాబాద్ పోలీస్‌స్టేషన్లలో ఫిర్యాదు చేశానని చెప్పారు. అధిక కట్నం కోసం కొన్నేళ్లుగా తన భర్త కుటుంబ సభ్యు లు వేధిస్తూ దాడులు, దౌర్జన్యానికి దిగుతున్నారని ఆమె కన్నీటిపర్యంతమయ్యారు. రాంబాబుకు ఇటీ వల బైపాస్ సర్జరీ జరిగింది. దాడి అనంతరం కు టుంబసభ్యులు ఆయన్ను దెందులూరు వైద్యశాలకు తరలించారు. అనంతరం ఆయన దెందులూరు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి దాడి ఘటనపై ఎస్సై శివాజీకి ఫిర్యాదు చేశారు.
రక్త గాయాలు, స్కూటర్ ధ్వంసం
వైఎస్సార్‌సీపీ నేత కుటుంబంపై దాడి


