నేటి నుంచి శోభనగిరిలో కల్యాణోత్సవాలు
ఆగిరిపల్లి: భక్తులు కోరిన కోరికలు తీర్చే కొంగుబంగారం కలియుగ వైకుంఠపురంగా ప్రసిద్ధి చెందిన ఆగిరిపల్లిలో శోభనాచల వ్యాఘ్ర లక్ష్మీ నృసింహ స్వామి ఆలయంలో సోమవారం నుంచి కల్యాణోత్సవాలు జరుగనున్నాయి. ఈ క్షేత్రానికి పురాణ ప్రా శస్త్యం ఉంది. స్వామి వ్యాఘ్ర రూపంలో శోభనగిరిపై వెలిసినట్టు స్థలం పురాణం చెబుతోంది. శోభనగిరి శిఖర భాగాన ఉన్న శివుడు మల్లికార్జునస్వామిగా, దిగువ భాగాన ఉన్న కొండపై విష్ణుమూర్తి లక్ష్మీ నృసింహస్వామిగా కొలువుదీరారు. 18వ శతాబ్దం నుంచి నూజివీడు జమిందారులు ధర్మకర్తలుగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం నూజివీడు మాజీ ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు ఆలయ వంశపారంపర్య ధర్మకర్తగా వ్యవహరిస్తున్నారు.
తొలిరోజు చంద్రప్రభ వాహనంపై..
కల్యాణోత్సవాల్లో భాగంగా తొలిరోజు స్వామివారిని చంద్రప్రభ వాహనంపై తీసుకువచ్చి పెండ్లి కుమారుడిగా అలంకరిస్తారు. రాత్రి 9 గంటలకు వేద పండితులు నిత్య కల్యాణం జరిపిస్తారు. ఇలా పది రోజులపాటు నిత్య కల్యాణాలు జరుగుతాయి. 25న రథసప్తమి నాడు ఆలయ ఆవరణలో గ్రామస్తుల ఆధ్వర్యంలో భారీ సమారాధన నిర్వహిస్తారు. కల్యాణోత్సవాల్లో ముఖ్య ఘట్టం 26న ఉదయం 8.45 గంటలకు గ్రామంలోని నాలుగు మాడ వీధులు చుట్టూ రాష్ట్రంలోనే అతి పెద్దదైన రథంలో రథోత్సవం నిర్వహిస్తారు. సోమవారం వంశపారంప ర్య ధర్మకర్త మేకా వెంకట ప్రతాప్ అప్పారావు క ల్యాణోత్సవాల్లో పాల్గొని స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు.


