మేల్ నర్సు బలవన్మరణం
● జంగారెడ్డిగూడెం ఏరియా ఆస్పత్రిలో ఉరి వేసుకున్న వైనం
● ఐదుగురు వ్యక్తులు కారణమని సూసైడ్ నోట్
జంగారెడ్డిగూడెం: చేయని తప్పుకు తనను తీవ్రంగా వేధిస్తూ ఆత్మహత్య చేసుకునేందుకు కారణమైన ఐదుగురు వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని సూసైడ్ నోట్ రాసి స్థానిక ఏరియా ఆస్పత్రిలో ప్రభుత్వ అండర్ టేకింగ్‌లో నడుస్తున్న అపోలో డయాలసిస్ కేంద్రంలో మేల్ నర్స్ (టెక్నీషియన్)గా పనిచేస్తున్న ముప్పిడి సుధాకర్ (27) ఆత్మహత్య చేసుకున్నాడు. ఆదివారం ఆస్పత్రి ఆర్వో ప్లాంట్ గదిలో ఉరి వేసు కుని బలవన్మరణం చెందాడు. వివరాలిలా ఉన్నా యి.. గతేడాది సెప్టెంబర్‌లో మృతుడు సుధాకర్‌కు, డయాలసిస్ చేయించుకునేందుకు వచ్చిన వ్యక్తికి మధ్య ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో రోగిపై సుధాకర్ దాడి చేశాడని రోగి త రఫు బంధువులు పీజీఆర్‌ఎస్‌లో కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో సుధాకర్‌ను వేరే డయాలసిస్ సెంటర్‌కు బదిలీ చేశారు. మూడు నెలల క్రితం జంగారెడ్డిగూడెం ఏరియా ఆస్పత్రిలో సుధాకర్ వి ధుల్లో చేరాడు. ఈ నేపథ్యంలో ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపింది. తన చావుకి కారణం ఐదుగురు వ్యక్తులను, తనను బెదిరిస్తూ మానసిక వేదనకు గురిచేశారని సూసైడ్ నోట్‌లో పేర్కొన్నాడు. తాను బయట చనిపోతే న్యాయం జరగదనే ఉద్దేశంతోనే, ఆస్పత్రిలో ఆత్మహత్య చేసుకుంటున్నట్టు లేఖలో రా శాడు. తనపై వచ్చిన ఆరోపణలపై విచారణ చేసి, తాను తప్పు చేసి ఉంటే కేసు ముగించమని, లేదంటే తన మృతికి కారణమైన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని కోరాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ద ర్యాప్తు ప్రారంభించారు. ఇదిలా ఉండగా సుధాకర్ కొన్నిరోజులుగా సెలవులో ఉన్నాడు.


