కోళ్లపర్రులో రెడ్‌బుక్ రాజ్యాంగం
ఆకివీడు : కోళ్లపర్రు గ్రామంలో కూటమి నాయకుల దౌర్జన్యాలు పెచ్చుమీరుతున్నాయని వైఎస్సార్‌సీపీ గ్రామ కమిటీ అధ్యక్షుడు పాశం నర్సింహరావు, నాయకులు ఆరోపించారు. గ్రామంలోని వైఎస్సార్ జెండా దిమ్మపై పసుపు రంగు పులిమిని సంఘటన పై నర్సింహరావు ఆదివారం విలేకరులతో మాట్లాడారు. గ్రామ పార్టీ అధ్యక్షుడిగా ఉన్న తనను పలు విధాలుగా వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సరిహద్దు గొడవలు సృష్టిస్తున్నారని, చెరువు గట్ల వద్ద దౌర్జన్యాలు చేస్తున్నారని వాపోయారు. సంక్రాంతి పండుగ రోజుల్లో కూడా మనశ్శాంతిగా ఉండనివ్వకుండా పార్టీ నాయకులకు చెందిన ఫ్లెక్సీలను భోగిమంటలో వేసి దహనం చేశారని ఆవేదన వ్యక్తంచేశారు. అలాగే వైఎస్సార్‌సీపీ జెండా దిమ్మ పై పసుపు రంగు పులిమారని వాపోయారు. ఇటీవల కోళ్లపర్రు వంతెన వద్ద ఉన్న పేదల ఇళ్లు తొలగిస్తామని అధికారులు నోటీసులు ఇవ్వడంతో వారికి మద్దతుగా తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన తెలపడంతో కూటమి నేతలు తనపై దౌ ర్జన్యానికి వచ్చారని ఆరోపించారు. గ్రామంలో రెడ్‌బుక్ అమలుజేసూ పార్టీకి అండగా ఉన్న వారిని, తనను పలు విధాలుగా వేధింపులకు గురిస్తున్నా రని వాపోయారు. విషయాన్ని నియోకవర్గ ఇన్‌చార్జి పీవీఎల్ నర్సింహరాజు ద్వారా అఽధిష్టానానికి తీసుకువెళతామన్నారు. ఎవరెన్ని ఇబ్బందులు పెట్టినా పార్టీని వీడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.


