లాడ్జిలో వ్యక్తి మృతి
జంగారెడ్డిగూడెం: స్థానికంగా ఉన్న ఒక లాడ్జ్‌లో ఒక వ్యక్తి అతిగా మద్యం సేవించి మృతి చెందాడు. దీనికి సంబంధించి ఎస్సై ఎన్‌వి ప్రసాద్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఆర్యవైశ్య కల్యాణ మండపం రోడ్డులో నివశిస్తున్న గూడూరి మోహన ఈశ్వర సాయి (28) విజయవాడలో ఫార్మాసిస్టుగా పనిచేస్తున్నాడు. ఈ నెల 14న పండుగకు జంగారెడ్డిగూడెం వచ్చాడు. 15 మధ్యాహ్నం ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. లాడ్జిలో రూమ్ తీసుకుని రాత్రి సమయంలో కొందరు స్నేహితులతో అతను మద్యం సేవించాడు. స్నేహితులు వెళ్లిపోయాక సాయి ఇంకా మద్యం సేవించాడు. కొద్దిసేపటికి అతనికి గ్యాస్ నొప్పి రావడంతో లాడ్జి సిబ్బందిని మెడికల్ షాపునకు తీసుకువెళ్లమనగా సిబ్బంది తీసుకువెళ్లారు. ఎక్కడా మందులు దొరకక పోవడంతో తిరిగి లాడ్జికి చేరుకున్నాడు. లాడ్జి వద్దకు చేరకుని అతనిని సిబ్బంది దించారు. 16న ఉదయం చూసేసరికి లాడ్జి బయట మోహన ఈశ్వర సాయి మృతి చెంది ఉన్నాడు. దీనిపై పోలీసులకు సమాచారం ఇవ్వగా తండ్రి మల్లికార్జునరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.


