పొంచి ఉన్న ప్రమాదాలు
కాలువలు, డ్రెయిన్‌లలోకి రోడ్లు జారిపోవడంతో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఒకవైపు జాతీయ రహదారి, మరోవైపు రాష్ట్రీయ రహదారులు ఇదే విధంగా ఉండడం దారుణం. నిత్యం వందలాది ప్రయాణికుల వాహనాలు వెళ్లే ఈ రహదారుల్లో సరైన చర్యలు చేపట్టాలి.
– బాతు జాన్సన్, కలిసిపూడి, ఉండి మండలం
కాలువలు, డ్రెయిన్‌లలోకి ప్రధాన రహదారులు కుంగిపోతున్నాయి. దీంతో పగలు ఎలా ఉన్నా రాత్రివేళల్లో ఈ ప్రాంతాల్లో ప్రయాణించే వాహనదారులు భయం భయంగా ప్రయాణాలు సాగిస్తున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి ఈ ప్రాంతాల్లో రివిట్‌మెంట్ వాల్స్ నిర్మాణం వెంటనే చేపట్టాలి.
– బొడ్డు నాగన్న, చెరుకువాడ, ఉండి మండలం
పొంచి ఉన్న ప్రమాదాలు


