పందేలు మామూళ్లుగా లేవు
న్యూస్‌రీల్
మామూళ్లు షురూ
ప్రముఖుల రాక
ఉత్సాహంగా బాస్కెట్‌బాల్ పోటీలు
నూజివీడులో నిర్వహించిన బాస్కెట్ బాల్ పోటీలు ముగిశాయి. పురుషుల విభాగంలో చైన్నె ఎస్‌ఆర్‌ఎం, మహిళల విభాగంలో కేఎల్‌యూ విజేతలుగా నిలిచాయి. IIలో u
నరసాపురం రుస్తుంబాదలో జాతీయస్థాయి మహిళలు, పురుషులు ఇన్విటేషన్ కప్ కబడ్డీ పోటీలు ఉత్కంఠగా సాగుతున్నాయి. జట్లు హోరాహోరీగా తలపపడుతున్నాయి. IIలో u
శనివారం శ్రీ 17 శ్రీ జనవరి శ్రీ 2026
సాక్షి, భీమవరం: సంక్రాంతి పండుగల మాటున కూటమి నేతలు జూదాల జాతర చేసుకున్నారు. కోర్టు ఆదేశాలను లెక్కచేయకుండా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా విచ్చలవిడిగా కోడి పందేలు, పేకాట, గుండాటలు నిర్వహించారు. జూదాల్లో పాల్గొనేవారు కాలు బయట పెట్టాల్సిన పనిలేకుండా బరుల వద్దనే సకల సదుపాయాలు కల్పించారు. పందెం రాయుళ్లను ప్రోత్సహిస్తూ విజేతలకు కానుకలు అందించారు. సంప్రదాయం మాటున సాగిన జూదాల్లో రూ.1000 కోట్లకు పైనే నగదు చేతులు మారినట్టు అంచనా.
పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాల్లో 300కు పైనే బరులు ఏర్పాటు చేసి పందేలు నిర్వహించారు. పండుగల మూడు రోజులు పోలీసులు పత్తాలేకుండా పోవడంతో నిర్వాహకుల ఇష్టారాజ్యమైంది. భీమవరం, ఉండి, తాడేపల్లిగూడెం, దెందులూరు, తాడేపల్లిగూడెం, చింతలపూడి, నూజివీడు, ఉంగుటూరు, తణుకు తదితర చోట్ల ఏర్పాటుచేసిన పెద్ద బరుల్లో పెద్ద మొత్తాల్లో పందేలు జరిగాయి. తాడేపల్లిగూడెంలోని బరిలో సంక్రాంతి నాడు రూ.1.53 కోట్ల పందెం జరగ్గా, కనుమ రోజు రూ.90 లక్షల పందెం జరిగింది. భీమవరం పరిసరాల్లో ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన నాలుగు పెద్ద బరుల వద్ద అధిక శాతం మేర పందేలు రూ.5 లక్షల నుంచి రూ.50 లక్షలు వరకు జరిగితే, ఓ మాదిరి బరుల్లో రూ.లక్ష నుంచి రూ.5 లక్షల వరకు, చిన్న బరుల వద్ద రూ.10 వేల నుంచి రూ.50 వేల వరకు జరిగాయి. ఇవికాకుండా పైపందేలు కోట్లల్లో కాసుకున్నారు. ఒక్కో బరిలో రోజుకు 20 నుంచి 30 వరకు పందేలు జరిగాయి. పందెంపై 10 శాతం వరకు నిర్వాహకులు కమిషన్‌గా తీసుకున్నారు.
గుండాట, పేకాట, కోతాట, కేసినో, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లను వాటి నిర్వహణలో ఆరితేరిన వారికి నిర్వాహకులు ముందుగానే రూ. 10 లక్షల నుంచి రూ.1.5 కోట్ల వరకు కాంట్రాక్టుకు ఇచ్చేశారు. తమ డబ్బులతో పాటు లాభాలు రాబట్టుకునేందుకు వారు పగలు, రాత్రీ తేడా లేకుండా యథేచ్ఛగా జూద కార్యకలాపాలు నిర్వహించారు. సొమ్ములు అయిపోయిన వారు బయటకు వెళ్లాల్సిన పనిలేకుండా బరుల వద్దనే జీరో కమిషన్‌పై మినీ ఏటీఎంలను సైతం పెట్టారు. పలు రకాల మాంసాహారాలతో విందు భోజనాలు, జబర్దస్త్ నటులు, ఇతర కళాకారులతో వినోద కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. మద్యం స్టాళ్లు ఏర్పాటుచేసి హాఫ్ బాటిల్, ఫుల్ బాటిల్‌పై రూ.50 నుంచి రూ. 100 అదనంగా వసూలు చేస్తూ విచ్చల విడిగా అమ్మకాలు సాగించారు.
భీమవరం, నరసాపురం, ఉండి, నూజివీడు ప్రాంతాల్లోని కొన్ని చోట్ల ఏర్పాటుచేసిన క్యాసినోలకు తెలంగాణ, రాయలసీమ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో పందెంరాయుళ్లు హాజరైనట్టు సమాచారం. వీరికి ప్రత్యేకమైన ట్యాగులు అందజేశారు. పెద్ద బరుల వద్ద బౌన్సర్లను ఏర్పాటుచేశారు. ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన గ్యాలరీల్లోకి ఇతరులు రాకుండా పందేల్లో పాల్గొనే వారు, పుంజులు తెచ్చినవారు, చూసేందుకు వచ్చిన వీఐపీలకు వేర్వేరు చేతిబ్యాండ్లు అందజేసి వారిని మాత్రమే గ్యాలరీల్లోకి అనుమతించారు. పట్టణ శివార్లలోని పలు గెస్ట్‌హౌస్‌లు, ప్లాట్లు పేకాట క్లబ్బులుగా మారిపోయాయి.
పందెంరాయుళ్లకు కానుకలు
బరుల వద్దకు పందెంరాయుళ్లను ఆకర్షించేందుకు నిర్వాహకులు కానుకల ఎత్తుగడ వేశారు. ఎక్కువ పందేల్లో గెలిచిన వారికి బుల్లెట్లు కానుకగా అందజేశారు. తణుకులోని ఒక బరిలో మూడు రోజుల్లో ఆరు బుల్లెట్లు కానుకలుగా అందజేయగా, నవుడూరులోని ఒక బరిలో ఒకరికి, నీలాద్రిపురం బరిలోను ఒకరికి, నూజివీడు నియోజకవర్గంలోని 10 బరుల్లోను, పోలవరం బరిలోను బుల్లెట్లు కానుకగా ఇచ్చారు.
కోర్టు ఆదేశాలను పక్కనపెట్టి పందేలు, జూదాల నిర్వహణకు సహకరించినందుకు పలువురు ఎమ్మెల్యేలు, పోలీసులకు ముడుపులు ముట్టచెప్పే పనిలో నిర్వాహకులు ఉన్నారు. మధ్యవర్తిత్వం నెరిపిన కూటమి నేతలే ఈ మామూళ్ల సంగతి చూసుకుంటున్నారు. కొందరు ఎమ్మెల్యేలకు పెద్ద బరుల నుంచి రూ.25 లక్షలు వరకు అందజేయాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. చిన్నా పెద్దా తేడా లేకుండా అన్ని బరుల నుంచి స్టేషన్ మామూళ్లు రాబట్టే పనిలో ఉన్నారు. పందేలు, పేకాట, గుండాట తదితర జూద కార్యకలాపాల ద్వారా ఈ మూడు రోజులు జిల్లాలోని ఏ బరుల వద్ద ఎంత మొత్తంలో నగదు చేతులు మారింది ఇప్పటికే పోలీసుల వద్ద లెక్కలు ఉన్నట్టు సమాచారం. సంక్షేమ నిధి పేరిట చిన్నా పెద్ద బరుల వద్ద రూ.50 వేలు నుంచి రూ. ఐదు లక్షలు వరకు వసూలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఏర్పాటుచేసిన 40 వరకు పెద్ద బరుల్లో మామూళ్ల మొత్తం మరింత అధికంగా ఉంటుందంటున్నారు. జిల్లాలో జోరుగా కోడిపందేలు జరిగినట్టు మీడియాలో కథనాలు నేపధ్యంలో వాటిని అడ్డుకున్నట్టుగా కోర్టుకు చూపించే నిమిత్తం కొందరు వ్యక్తులు, పుంజులను అప్పగించాలని ఇప్పటికే పోలీసుల నుంచి నిర్వాహకులకు కబుర్లు పంపుతున్నారు.
కత్తులు దూశాయ్.. కట్టలు తెగాయ్
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా జూదాల జాతర
ఎక్కడ చూసినా కోడి పందేలు, గుండాట, పేకాట
రూ.కోట్లల్లో పందేలు, చేతులు మారిన వందల కోట్లు
డబ్బులు ఇచ్చేందుకు బరుల వద్దనే మినీ ఏటీఎంలు
నిర్వాహకుల నుంచి కూటమి నేతలు, పోలీసులకు భారీగా మామూళ్లు
బరికి రూ.5 లక్షల నుంచి రూ.50 లక్షల పైనే ముడుపులు
కోడిపందేలను వీక్షించేందుకు పలువురు రాజకీయ సినీ ప్రముఖులు తరలివచ్చారు. ఎంపీ బీద మస్తానన్ రావు, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, నిర్మాత దగ్గుబాటి సురేష్, సినీ హీరోలు బెల్లంకొండ శ్రీనివాస్, రోషన్, హీరోయిన్‌న్‌డింపుల్ హయాతి, యాంకర్ జెమినీ సురేష్, సినీ నటి హేమ తదితర సినీ రంగ ప్రముఖులు ఉన్నారు.
పందేలు మామూళ్లుగా లేవు
పందేలు మామూళ్లుగా లేవు


