వైఎస్సార్‌సీపీ గ్రామ కమిటీలు నియమించాలి | - | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ గ్రామ కమిటీలు నియమించాలి

Jan 17 2026 8:50 AM | Updated on Jan 17 2026 8:50 AM

వైఎస్

వైఎస్సార్‌సీపీ గ్రామ కమిటీలు నియమించాలి

వైఎస్సార్‌సీపీ గ్రామ కమిటీలు నియమించాలి జగన్‌ మళ్లీ సీఎం కావాలని వేడుకున్నా వేడుకగా ప్రభల తీర్థం ట్రాఫిక్‌ నియంత్రణలో పోలీసు సేవలు భేష్‌

అత్తిలి: వైఎస్సార్‌సీపీ గ్రామకమిటీలు నియమించి పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా పార్టీ శ్రేణులు కృషిచేయాలని మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు. అత్తిలి మండలం లక్ష్మీనారాయణపురంలో వైఎస్సార్‌సీపీ నాయకులతో ముఖ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ పార్టీలో కష్టపడి పనిచేసే వారికి తగిన గుర్తింపు లభిస్తుందని, వచ్చే ఎన్నికలలో వైఎస్సార్‌సీపీ అధికారం చేపట్టడం ఖాయమన్నారు. గ్రామాలలో పార్టీ నాయకులు ఏకతాటిపై నిలిచి పార్టీ ఇచ్చే ప్రతీ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో కీలకపాత్ర పోషించాలన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు పైబోయిన సత్యనారాయణ, ఎంపీటీసీ సభ్యుడు ఆడారి శ్రీనివాసరావు, గ్రామ పార్టీ అధ్యక్షుడు బొడ్డేటి శ్రీనివాసరావు, మండల ఉపాధ్యక్షుడు దొడ్డి వెంకటేశ్వరరావు, ప్రగడ బాలు తదితరులు పాల్గొన్నారు.

ద్వారకాతిరుమల: మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మళ్లీ సీఎం కావాలని ఆ శ్రీవారిని వేడుకున్నట్టు వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆర్‌.శ్యామల తెలిపారు. సంక్రాంతి పర్వదినాన్ని పుర స్కరించుకుని గురువారం ఆమె ద్వారకాతిరుమల చినవెంకన్న ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా స్వామి, అమ్మవార్లను దర్శించి ప్రత్యేక పూజలు జరుపుకున్నారు. అనంతరం ఆలయ ముఖ మండపంలో పండితులు ఆమెకు శ్రీవారి శేష వస్త్రాన్ని కప్పి, వేద ఆశీర్వచనాన్ని పలికి, స్వామి వారి చిత్రపటాన్ని, ప్రసాదాలను అందజేశారు. ఆ తరువాత ఆమె ఆలయ తూర్పురాజగోపురం వద్ద మీడియాతో మాట్లాడారు. తన సొంత ఊరు కాకినాడని, హైదరాబాద్‌ వెళ్లిన తరువాత ఇక్కడకు రావడం తగ్గిందన్నారు. ఆ స్వామి ఆశీస్సుల వల్లే అనుకోకుండా సంక్రాంతి పండుగ రోజు ఇక్కడకు వచ్చానని, శ్రీవారిని దర్శించుకోవడం సంతోషాన్ని కలిగించిందన్నారు. నా మనస్సులో ఉన్న కోరిక జగన్‌ సీఎం కావడమేనని, అది తొందరలో నెరవేరాలని స్వామిని వేడుకున్నట్టు చెప్పారు.

పెనుగొండ: ఆచంట మండలం కందరవల్లిలో శుక్రవారం ప్రభల తీర్థం వేడుకగా జరిగింది. సంక్రాంతి సందర్భంగా మూడో రోజు కనుమ రోజున ఇక్కడ ప్రభల తీర్థం నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. మండలంలోని కోడేరు, కరుగోరుమిల్లి, కందరవల్లి, పెనుమంచిలి గ్రామాల నుంచి ప్రభలను ఊరేగింపుగా తీసుకువస్తే కందరవల్లిలో కొలువు తీర్చారు. అనేక మంది భక్తులు ప్రభలను దర్శించుకున్నారు.

భీమవరం: సంక్రాంతి సందర్భంగా భీమవరం పట్టణంలో ట్రాఫిక్‌ నియంత్రణలో ముఖ్యభూమిక పోషించిన పోలీసు సిబ్బందికి ఎస్పీ అద్నాన్‌ నయీం ఆస్మీ అభినందలు తెలిపారు. సాధారణ రోజుల్లోనే రద్దీగా ఉండే భీమవరం పట్టణం సంక్రాంతి సమయంలో జనసంద్రంగా మారుతుందని అలాంటి క్లిష్ట పరిస్థితులలో కూడా వాహన రద్దీని నియంత్రించి ప్రజలకు అసౌకర్యం కలగకుండా భీమవరం పోలీసులు అత్యుత్తమ పనితీరు కనబర్చారన్నారు.

వైఎస్సార్‌సీపీ గ్రామ కమిటీలు నియమించాలి  
1
1/2

వైఎస్సార్‌సీపీ గ్రామ కమిటీలు నియమించాలి

వైఎస్సార్‌సీపీ గ్రామ కమిటీలు నియమించాలి  
2
2/2

వైఎస్సార్‌సీపీ గ్రామ కమిటీలు నియమించాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement