సంక్షేమ పథకాలు లేవు
జగనన్న ప్రభుత్వం సంక్షేమ పథకాలు కారణంగా ఏటా చేతిలో ఎంతో కొంత సొమ్ము ఉండేది. దీంతో ఏ పండుగ వచ్చినా, ఏ అవసరం వచ్చిన భయపడే పరిస్థితి ఉండేది కాదు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తరువాత ఒక్క సంక్షేమ పథకం లేదు.
– ముప్పిడి నాగేశ్వరరావు, జంగారెడ్డిగూడెం
ఆరోగ్యశ్రీని చంద్రబాబు ప్రభుత్వం నీరు గార్చింది. జగనన్న ప్రభుత్వాసుపత్రుల్లో మెరుగైన సేవలు అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. వైద్య విద్యను ప్రోత్సహిస్తూ, మరింత మంది వైద్యులు సమాజంలోకి వచ్చేలా 17 ప్రభుత్వ మెడికల్ కళాశాలలను సైతం తీసుకువచ్చారు. అయితే ప్రభుత్వం మారడంతో, అధికారంలోకి వచ్చిన చంద్రబాబు వాటిని ప్రైవేట్ పరం చేయాలని చూస్తున్నాడు.
– కొత్తూరి స్టాలిన్, జంగారెడ్డిగూడెం
జగన్ హయాంలో లక్షలాది ఇళ్లు మంజూరు చేశారు. చాలా మంది పేదలు జగనన్న ఇచ్చిన స్థలంలో, ఇంటిని కట్టుకుని సంతోషంగా ఉన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత కొత్తగా ఇంటి స్థలం గాని, ఇల్లుగాని మంజూరు చేయలేదు. గత ప్రభుత్వంలో మంజూరు చేసిన వాటికి కూడా కొర్రి పెట్టేలా చూస్తోంది. – దున్న శివ, జంగారెడ్డిగూడెం
విద్యార్థులకు ఉన్నత విద్య అవకాశాలు బాగుంటాయని ఆశపడ్డాం. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయంతో ఉన్నత విద్య ఆశలపై నీళ్లు చల్లినట్టయింది. నేను చెన్నయ్‌లో చదువుతున్నా. గతంలో చాలా మంది ఏపీ ప్రజలు చదువు కోసం ఇక్కడికి రావాల్సిన అవసరం లేదని అనేవారు. ప్రభుత్వం మారడం.. ప్రస్తుత ప్రభుత్వ ప్రైవేటీకరణ నిర్ణయంతో మా తరువాత వచ్చే విద్యార్థులు ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సిన పరిస్థితి.
– ఉరిటి భాను మాణిక్యమూర్తి, చెన్నయ్ నుంచి జుత్తిగకు వచ్చిన యువకుడు
సంక్షేమ పథకాలు లేవు
సంక్షేమ పథకాలు లేవు
సంక్షేమ పథకాలు లేవు


