కనుమ ఉత్సవానికి సర్వం సిద్ధం | - | Sakshi
Sakshi News home page

కనుమ ఉత్సవానికి సర్వం సిద్ధం

Jan 15 2026 10:46 AM | Updated on Jan 15 2026 10:46 AM

కనుమ ఉత్సవానికి సర్వం సిద్ధం

కనుమ ఉత్సవానికి సర్వం సిద్ధం

ద్వారకాతిరుమల: శ్రీవారి కనుమ ఉత్సవానికి సర్వం సిద్ధమైంది. ఈ నెల 16న మండలంలోని దొరసానిపాడులో కనుమ మండపంలో ఈ ఉత్సవాన్ని దేవస్థానం అంగరంగ వైభవంగా నిర్వహించనుంది. సిబ్బంది ఇప్పటికే కనుమ మండపాన్ని, పరిసరాలను సుందరీకరించారు. ఆ ప్రాంతం విద్యుద్దీప కాంతులతో మిరుమిట్లు గొలుపుతోంది. ఏటా సంక్రాంతి పండుగ మరుసటి రోజు స్వామివారు, ఉభయ దేవేరులతో కలసి దొరసానిపాడు గ్రామానికి అట్టహాసంగా వెళ్తారు. ఏడాదికోమారు తమ గ్రామానికి విచ్చేసే స్వామివారి ఆగమనం కోసం ఆ గ్రామస్తులు నియమ నిష్టలతో, భక్తి ప్రపత్తులతో నిరీక్షిస్తారు. కనుమ అయినప్పటికీ ఆ గ్రామ ప్రజలు మాంసాహారాన్ని ముట్టరు. ఈ క్రమంలో శుక్రవారం సాయంత్రం స్వామివారు ఉభయ దేవేరులతో కలసి రాజాధిరాజ వాహనంపై క్షేత్రం నుండి బయలుదేరి మండపానికి చేరుకుంటారు. అనంతరం ఆలయ అర్చకులు శ్రీవారు, అమ్మవార్లను మండపంలో ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఆ తరువాత గిరిప్రదక్షిణగా ఆలయానికి చేరుకుంటారు. వైభవోపేతంగా జరిగే ఈ వేడుకలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొనాలని ఆలయ ఈఓ వై.భద్రాజి కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement