పందెం బరులు పంచుకున్నారు
న్యూస్‌రీల్
డంపింగ్ యార్డులో మంటలు
పాలకొల్లు యడ్లబజారు సెంటర్ డంపింగ్ యార్డులో మంగళవారం తారాజువ్వ పడి మంటలు చెలరేగడంతో ఆ ప్రాంతవాసులు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. IIలో u
బుధవారం శ్రీ 14 శ్రీ జనవరి శ్రీ 2026
సాక్షి ప్రతినిధి, ఏలూరు: ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 300 లకుపైగా పందెం బరులు సిద్ధమయ్యాయి. బుధవారం ఉదయం నుంచి పందెం కోళ్లు ఢీకొట్టనున్నాయి. పండగ మూడు రోజులు పాటు విచ్చల విడిగా కోడి పందేలు, జూద క్రీడలు కొనసాగేలా భారీ ఏర్పాట్లు చేశారు. దానికనగుణంగా ఎక్కడా పోలీసుల అభ్యంతరం లేకుండా అన్ని చక్కదిద్దేశారు. కొన్ని బరుల్లో కార్ల బహుమానం, మరికొన్ని చోట్ల ఏఏ సమయాల్లో ఏ స్ధాయి పందేం జరుగుతుందో వివరాలను సైతం సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నాలుగు బరుల్లో రూ.కోటి పందేలు నిర్వహించనున్నారు.
పేకాట, గుండాట, కోతాట శిబిరాలు
ఉమ్మడి జిల్లాలోని అనేక నియోజకవర్గాల్లో సంక్రాంతి పోటీల పేరిట నాలుగు రోజుల క్రితమే బరులను పూర్తిస్ధాయిలో సిద్ధం చేశారు. మంగళవారం వరకు సంప్రదాయ పోటీలు నిర్వహించి బుధవారం నుంచి పందెం బరులుగా తీర్చిదిద్దుతున్నారు. అన్ని నియోజకవర్గాల్లోనూ కూటమి నేతలే కీలకంగా వ్యవహరిస్తూ పోటీలు పడి మరీ భారీ బరులు ఏర్పాటు చేస్తున్నారు. హైకోర్టు నిషేధాజ్ఞల నేపథ్యంలో పోలీసులు మొక్కుబడిగా అక్కడక్కడ చిన్నబరులను ధ్వంసం చేసి పొలిటికల్ బరులవైపు కన్నెత్తి చూడకుండా ఉండేలా అన్ని సిద్ధం చేసి పందాలకు రెడీ అయ్యారు. ఈ ఏడాది కోడి పందేలల్లో పదుల సంఖ్యలో పేకాట, గుండాట, కోతాట శిబిరాలు ఏర్పాటు చేశారు. ఎక్కువ మంది నిర్వాహకులు భారీ ధరకు ముందస్తుగానే విక్రయించారు. భీమవరంలో ఒక బరిలో జూదక్రీడలన్నీ కలిపి అత్యధికంగా రూ.1.40 కోట్లకు విక్రయించారు. తాడేపల్లిగూడెం, ఉంగుటూరు, దెందులూరు, నూజివీడు, తణుకులోనూ రూ.50 లక్షల నుంచి రూ.కోటి వరకు విక్రయాలు చేశారు.
ప్రజాప్రతినిధులే నిర్వాహకులు
జిల్లాలో ఈ సారి కీలక నియోజకవర్గాల్లో ప్రజాప్రతినిధులే కీలక నిర్వాహకులుగా మారి పనులన్నీ నిర్వహించడానికి ఏజెన్సీలకు, జూదరులకు బరులు అప్పగించారు. నూజివీడు నియోజకవర్గంలోని మీర్జాపురంలో మంత్రి కొలుసు పార్థసారథి సహకారంతో భారీ బరి ఏర్పాటు చేసి సకల సౌకర్యాలు సిద్ధం చేశారు. మూడు రోజులు పాటు ఎక్కువ పందేలు గెలిచిన వారికి కారును, ఒక్కొక్క రోజు ఎక్కువ పందేలు గెలిచిన వారికి కారును బహుమతిగా ఇస్తున్నట్లు ప్రకటించారు. రోజుకు సగటున 22 పందేలు రూ.25 లక్షల స్ధాయిలో నిర్వహిస్తున్నట్లు సమాచారం. సినీ సెట్టింగుల హంగులతో ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ సహకారంతో దుగ్గిరాలలో బరి ఏర్పాటు చేశారు.
ఏలూరు మండలం జాలిపూడిలో పందెం బరి
ఏలూరు మండలం మాదేపల్లిలో పేకాట శిబిరం
మినీ స్టేడియంను తలపించే రీతిలో ఏర్పాట్లు.. మంత్రులు, పారిశ్రామికవేత్తలు, ఇతర ప్రముఖుల కోసం ప్రత్యేకంగా క్యారవాన్లు, మద్యం, మాంసం కోసం ప్రత్యేకంగా ఏసీ కంటైనర్లతో తాత్కాలిక గదులు, భారీ స్వాగత ద్వారాలతో కోడి పందేల బరులు.. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో నేటి నుంచి మూడు రోజులు కోడి పందేలకు సర్వం సిద్ధమైంది. పందేలతో పాటు పెద్ద ఎత్తున గుండాట, పేకాట శిబిరాలకు ఏర్పాట్లు చేశారు. వీటిలో ఎక్కువ శాతం కూటమి నేతలు పంచుకుని జేబులు నింపుకునే పనిలో పడ్డారు.
పశ్చిమలో అనేక చోట్ల ప్రజాప్రతినిధులే నిర్వాహకులు
భీమవరం, ఉండి, దెందులూరు, నూజివీడు, ఉంగుటూరులో భారీ బరులు
సంప్రదాయం మాటున కత్తి కట్టిన కోడిపందేలు
బరుల్లో సినీ సెట్టింగ్‌లు, క్యారవాన్లు, ఏసీ ట్రక్కుల్లో ప్రత్యేక ఆతిథ్యాలు
మీర్జాపురంలో కార్లు బహుమానం
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 300కుపైనే పందెంబరులు
పందెం బరులు పంచుకున్నారు
పందెం బరులు పంచుకున్నారు
పందెం బరులు పంచుకున్నారు


