గోడమీద పిల్లివాటంలా పవన్ కల్యాణ్
చాట్రాయి: ఉపాదీ హామీ పథకంలో రాష్ట్ర ప్రభుత్వంపై నిధుల భారం పడుతున్నా పంచాయతీరాజ్ మంత్రి పవన్ కల్యాణ్ ఎందుకు నిలదీయడం లేదని వైఎస్సార్ సీపీ మహిళా విభాగం అధికార ప్రతినిధి ఆర్ శ్యామల ప్రశ్నించారు. పవన్ కల్యాణ్ గోడమీద పిల్లివాటంలా వ్యవహరిస్తున్నారని ఆమె ఎద్దేవా చేశారు. కూటమి ప్రభుత్వం నిర్వాకం కారణంగా పెద్ద పండుగ సంక్రాంతికి రైతుల ముఖంలో సంతోషం కనపడడంలేదని 2029లో మళ్లీ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిని చేద్దామని ఆమె పిలుపునిచ్చారు. ఈ నెల 25న మండలంలోని చిన్నంపేటలో మహానేత వైఎస్ రాజశేఖరెడ్డి విగ్రహ ఆవిష్కరణ జరుగుతుందని, వేలాది మంది కార్యకర్తలు, అభిమానులు పాల్గొనాలని ఆమె కోరారు. మరో వైఎస్సార్ సీపీ అదికార ప్రతినిఽఽధి కారుమూరి వెంకటరెడ్డి మాట్లాడుతూ రైతులను ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. వీకెండ్ వస్తే ఎమ్మెల్యేలు, మంత్రులు హైదరాబాద్ పబ్బుల్లో ఉంటారని ఆయన ఎద్దేవా చేసారు. రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని భోగి మంటల్లో కలుపుతామని అన్నారు. మంగళవారం చాట్రాయి మండలంలోని నరశింహారావుపాలెం గ్రామానికి శ్యామల, వెంకటరెడ్డి పుచ్చకాయల శ్రీనివాసరెడ్డి (వైఎస్సార్ సీపీ ఐటీ వింగ్ కార్యదర్శి హైదరాబాదు) కుటుంబ సభ్యులను పరామర్శించారు. శ్రీనివాసరెడ్డి తల్లి సత్యవతి ఇటీవల మృతి చెందడంతో ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో మండల పార్టీ నాయకులు గడ్డం లోకేశ్వరరెడ్డి, పరసా చెన్నారావు, గడ్డం శ్రీనివాసరెడ్డి, చింతలపూడి మండల వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు రమేష్‌రెడ్డి, సిద్దిపేట పార్టీ అధ్యక్షుడు తడకా జగదీశ్వర్ గుప్తా తదితరులు పాల్గొన్నారు.


