పందేల మాటున ‘పైసా’చికం | - | Sakshi
Sakshi News home page

పందేల మాటున ‘పైసా’చికం

Jan 13 2026 6:03 AM | Updated on Jan 13 2026 6:03 AM

పందేల మాటున ‘పైసా’చికం

పందేల మాటున ‘పైసా’చికం

కోజా అంటూ కానుకగా..

సాక్షి, భీమవరం: ఆయ్‌.. నేను పందెం పుంజునండీ.. పేరు డేగ.. మా ఈకల రంగు, శరీర తీరు బట్టి డేగ, నెమలి, పచ్చకాకి, నల్లకాకి, శవల, మైల, అ బ్రాస్‌, సేతువ పేర్లు పెట్టి మురిసిపోతుంటారు. తేడా వస్తే కోజంటూ కర్రీ చేసుకుని లొట్టలేసుకుంటూ తింటారు. ఎంత రాజభోగం అనుభవించినా సంక్రాంతి వస్తోందంటే చిగురుటాకుల్లా వణికిపోతాం. ప్రాణాలు అరికాల్లో పెట్టుకుని పోరాడతాం. ఈ భోగం మూణ్ణాళ్ల ముచ్చటనేనని తెలిసొచ్చేసరికి మా ఊపిరి పోతుంది.

బతికున్నంత కాలం దర్జానే..

ఏమాటకామాట.. బతికున్నంత కాలం మా దర్జానే వేరు. పెద్ద పెద్ద లోగిళ్లు, మకాంలు మా నివా సాలు. మాలో కొందరికి ప్రత్యేకంగా పనివాళ్లు ఉంటారండోయ్‌. మా బాగోగులు చూస్తూ టైముకి మేత పెట్టేది వాళ్లే. అది ఆషామాషీ మేతనుకుంటే పొరపాటే. ఆ రాజభోగమే వేరు. అప్పుడప్పుడూ కాస్త ‘చుక్క’ కూడా పోస్తుంటారు. ట్రైనింగ్‌ మూడు నెలల్లో మా ఒక్కొక్కరిపై రూ.30 వేల వరకు ఖర్చు చేస్తుంటారు. ఇలా పెంచిన మమ్మల్ని పందెంరాయుళ్లు రూ.లక్షలు పెట్టి కొంటారు. పండుగల పేరు చెప్పి రూ.15 కోట్లకు పైనే మాపై వ్యాపారం జరుగుతుందంటే మాకున్న డిమాండ్‌ అలాంటిది మరి. ఇవన్నీ చూసి ఎంతో సంబరపడతాం. జన్మంటూ ఉంటే ఇక్కడే పుట్టాలని కోరుకుంటాం. అందుకే మా గోదారోళ్లకు కావాల్సిన వారిపై కోపం వచ్చినప్పుడు నిన్ను పందెం కోడిని మేపినట్టు మేపానని దెప్పిపొడవడం మమ్మల్ని చూసే వచ్చిందంటండీ.. ఆయ్‌.

ఈ ఆనందం క్షణకాలమేనా..

ఈ ఆనందం క్షణకాలమేనని.. అమ్మవారికి బలిచ్చేముందు మేకపోతును మేపినట్టు.. పందెం బరి లో వదలడానికి మమ్మల్ని పెంచుతున్నారని తె లిసేసరికే భూమ్మీద మాలో చాలామందికి నూ కలు చెల్లిపోతాయండి. మాకు ట్రైనింగ్‌ మొదలవుతుందంటేనే అర్థమవుతుంది సంక్రాంతి దగ్గరపడుతోందని. అప్పటి నుంచి దినదినగండమే. ఇన్నాళ్లూ అనుభవించిన ఆనందం, రాజభోగం అంతా ఇంకొంతకాలమేనని.

మా గోడు వినేదెవ్వరూ?

ఎన్ని చట్టాలుండి.. వాటిని రక్షించే వ్యవస్థలు ఎన్నుండి.. కోర్టులు ఎంత కన్నెర్ర చేసి ఏం లాభం? కంచే చేను మేసినట్టు చట్టాలు చేసే పెద్దలే చంకలో మమ్మల్ని పెట్టుకుని ఫొటోలకు పోజులిస్తూ మరీ బరులు ప్రారంభిస్తారు. మాలో మేమే కత్తులు దూసుకునేలా పందెంలో దింపి వేలల్లో, లక్షల్లో పందేలు కాసి ఆనందిస్తారు. మా తలపై నిమిరిన చేతులే మా కాళ్లకు క త్తులు కడతాయి. వారికేం తెలుసు మా బాధ? పందెంలో దిగాక ఏం చేయలేని పరిస్థితి. చుట్టూ జనం, తప్పించుకునే వీలులేక మాలో మేమే ప్రాణాల కోసం తలపడాల్సిందే.

‘కాళ్లకు కట్టిన పదునైన కత్తులు శరీర భాగాల్ని చీలుస్తూ ఛిద్రం చేస్తున్నా.. ఒళ్లంతా నెత్తురోడుతున్నా.. కనురెప్ప వాలిపోతున్నా.. రెక్కలు తెగిపడి కదలలేకున్నా.. గెంతేందుకు శరీరం సహకరించకున్నా.. జాలి లేని జనం కోసం, వారి పైశాచికానందం కోసం ఊపిరున్నంతసేపూ పోరాడతాం. చివరి క్షణాల్లో అప్పుడనిపిస్తుంది.. రెక్కలకి బలమొచ్చి పక్షుల్లా ఎగిరిపోతే ఎంత బాగుంటుందని’. మేం అనుభవించే నరకాన్ని చూస్తూ పైశాచిక ఆనందం పొందడానికి పనిగట్టుకుని ఎక్కడెక్కడి నుంచో గొప్పగొప్పోళ్లు వస్తుంటారు.

మూడు రోజులూ ఏమైపోతారో..?

కోడిపందేలు నిర్వహిస్తే ఖబడ్దార్‌ అంటూ హె చ్చరించే పోలీసులు, జంతు సంక్షేమ సంఘం స మావేశాల పేరిట హడావుడి చేసే అధికారులు పండుగల మూడు రోజులూ ఏమైపోతారో తెలీదు. తర్వాత కొందరిపై ఏవో చిన్నచిన్న కేసులు పెట్టి చేతులు దులిపేసుకుంటుంటారు. ఇంకెవరికి చెప్పుకోవాలి మా బాధ? అదిగో అక్కడ బరి సిద్ధం చేసేశారు.. నన్ను పిలుస్తున్నారు.. బాయ్‌.. ఇక ఉంటాను. భూమ్మీద నాకింకా నూకలుంటే కొక్కొరోకో అంటూ తెల్లారి మిమ్మల్ని మేల్కొలుపుతాను.

ఒకరు కోడి పోటీలంటారు.. ఇంకొకరు సంప్రదాయం అంటారు. కత్తుల్లేని పందేలు జరపమంటే మాత్రం నో అంటారు. ఆ కొట్లాటలో మాలో ఎవరోకరి ప్రాణాలు పోవాల్సిందే. నేను నెగ్గితే సరేసరి... ఓడినా వదలరు. కోజంటూ కోసేసి ఆరగిస్తారు. బతికుండగా రూ.లక్షల ధర పలికే మేము చచ్చినా తగ్గేదేలే అన్నట్టే ఉంటాం. మూడు నుంచి ఐదు కేజీల వరకు బరువుండే మా శరీరాలను రూ.5 వేల నుంచి రూ.15 వేల వరకు కొని గల్లీ నుంచి ఢిల్లీ దాకా కావాల్సిన రాజకీయ నాయకులు, అధికారులకు కానుకగా పంపిస్తుంటారు. పండుగల మూడు రోజుల్లో కోజాల పైనే జిల్లాలో రూ.5 కోట్ల పైనే వ్యా పారం జరుగుతుందంటుంటారు.

కత్తి కట్టి.. నెత్తురోడి

కాళ్లకు కత్తులు కట్టి కోడి పందేల నిర్వహణ

శరీరం ఛిద్రమై నెత్తురోడుతూ..

కనురెప్ప పడుతున్నా కడ దాకా పోరాటం

కానరాని జంతు ప్రేమికులు

అడ్డుకోలేని చట్టాలు, వ్యవస్థలు

పందెం పుంజుల గోడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement