కోడి పందేలు చట్ట విరుద్ధం
కలెక్టర్ వెట్రిసెల్వి
ఏలూరు(మెట్రో) : జిల్లాలో కోడి పందేలు జరగకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కె.వెట్రిసెల్వి ఆదేశించారు. జిల్లాలో కోడి పందేలు, బెట్టింగులు నిర్వహించడం, ప్రోత్సహించడం, పాల్గొనడం చట్టవిరుద్ధమని, జిల్లాలో ఎవరైనా కోడి పందేలు, గుండాట, బెట్టింగులు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించా రు. పోలీసు, రెవెన్యూ అధికారులు గట్టి నిఘా పెట్టాలన్నారు. సదరు ఉత్తర్వులను అతిక్రమిస్తే కేసులు నమోదు చేస్తామన్నారు. జిల్లాలో ఎక్కడైనా కోడి పందేలు, గుండాట, బెట్టింగు లు నిర్వహిస్తున్నట్టు గుర్తిస్తే, సదరు సమాచారాన్ని కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ నం. 18002331077కు తెలియజేయాలన్నారు. అ లాగే ఫొటోలు, వీడియోలను వాట్సాప్ నం.9491041428కు పంపాలని కోరారు.
వచ్చేనెల రెండో వారంలో జరిగే రెండో విడత పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ, మొ దటి విడత పంపిణీపై పరిశీలన విషయాలను కలెక్టర్ కె.వెట్రిసెల్వి అధ్యక్షతను సమీక్షించారు.
ఏలూరు (టూటౌన్): కూటమి ప్రభుత్వం ఇచ్చి న హామీలను అమలు చేయాలని చేతి వృత్తిదారుల సమాఖ్య జిల్లా కమిటీ కలెక్టరేట్‌లో జేసీకి సోమవారం వినతి పత్రం సమర్పించింది. జి ల్లా కన్వీనర్ కడుపు కన్నయ్య, జిల్లా కో–కన్వీన ర్ పొట్టేలు పెంటయ్య మాట్లాడుతూ చేతి వృత్తి దారులకు 50 ఏళ్లకే పింఛన్ హామీని ప్రభుత్వం అమలు చేయాలని, సబ్సిడీపై రుణాలు, 300 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇవ్వాలని కోరారు. చేతివృత్తిదారులతో పాటు బీసీలకు పలు హా మీలు ఇచ్చారని, వాటన్నింటినీ అమలు చే యాలని డిమాండ్ చేశారు. బీసీలకు రాష్ట్రంలో అనేక హామీలను ప్రభుత్వం ఇచ్చిందని అవి తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు.
భీమవరం (ప్రకాశంచౌక్): చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న పనుల కారణంగా సమ్మె నోటీ సు ఇస్తున్నట్టు భీమవరం మున్సిపల్ కాంట్రాక్టర్లు తెలిపారు. సోమవారం మున్సిపల్ కమిషనర్ రామచంద్రరెడ్డికి సమ్మె నోటీసు అందజేశారు. ఏళ్ల తరబడి చేసిన పనులకు బిల్లులు చె ల్లించకపోవడంతో తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎ దుర్కొంటున్నామన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త చెల్లింపు విధానంతో సమస్యలు ఎదురవుతున్నాయని తెలిపారు. సుమారు రూ.18 కోట్ల బిల్లుల చెల్లింపులు పెండింగ్‌లో ఉన్నాయని, తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు. పా త బకాయిలు చెల్లించే వరకూ కొత్త పనుల టెండర్లలో పాల్గొనరాదని నిర్ణయించామన్నారు. పట్టణానికి చెందిన కాంట్రాక్టర్లు పాల్గొన్నారు.
భీమవరం: సంక్రాంతి పండుగకు ఇతర రా ష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి వచ్చేవారు అక్కడి మద్యం తీసుకురావడం నేరమని జిల్లా మద్య నిషేధ అబ్కారీ అధికారి ఆర్‌వీ ప్రసాద్ రెడ్డి సోమవారం ప్రకటనలో తెలిపారు. మద్యం తీసుకువచ్చి పట్టుబడితే కేసు నమోదు చేయడంతో పాటు ఆయా వాహనాలను సీజ్ చేస్తామని హెచ్చరించారు. అలాగే ఇదే విషయాన్ని ప్రైవేట్ బస్సు, టూరిస్ట్ బ స్సు, ప్రైవేట్ టాక్సీ యజమానులు గుర్తుంచుకోవాలన్నారు. డిప్యూటీ కమిషనర్ బి.శ్రీలత, అసిస్టెంట్ కమిషనర్ కేవీఎన్ ప్రభుకుమార్ ఆధ్వర్యంలో ఏడు ప్రత్యేక బృందాలు ఈనెల 1 నుంచి ఇప్పటివరకు 14 కేసులు నమోదు చేసి 14 మందిని అరెస్ట్ చేశారన్నారు. అలాగే 13.05 లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నామని, 95 మంది పాత నేరస్తులను బైండోవర్ చేశామని పేర్కొన్నారు. ఇతర ప్రాంతాల నుంచి మద్యం రవాణా కాకుండా వాహన తనిఖీలు చేపట్టామని తెలిపారు.
కోడి పందేలు చట్ట విరుద్ధం
కోడి పందేలు చట్ట విరుద్ధం


